విజయవాడ: ముస్లింలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఆ తర్వాత వాళ్లను వదిలేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. ముస్లిం యువతుల పెళ్లిళ్లకు ఆర్థిక సాయాన్ని అందించేందుకు గాను టీడీపీ హయాంలో తీసుకొచ్చిన దుల్హన్ పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. దుల్హన్ పథకాన్ని కొనసాగించాలని కోరుతూ ముస్లిం సంఘాల నాయకులు విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల కోసం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని… ఈ కార్పొరేషన్ ద్వారా ముస్లింలకు అనేక లోన్లు ఇప్పించి, వారి అభివృద్ధికి కృషి చేశారని బొండా ఉమ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మైనార్టీలను వాడుకుని వదిలేసిన ఘనత జగన్ దని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో మాదిరే మైనార్టీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ముస్లింలకు పెద్దపీఠం వేస్తామని జగన్ రెడ్డి అనేక వాగ్దానాలు చేశారని… అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింలను వదిలేశారన్నారు. మైనారిటీ కార్పొరేషన్‌కు వైసీపీ నిధులు కేటాయించకపోవడం దారుణమని మండిపడ్డారు. మైనార్టీలను జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా మోసం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామ రాజు, మైనారిటీ నేతలు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జాన్ వలి, సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు షేక్ అన్వర్, ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా, మోతుకుర్ కాసిమ్, షరీఫ్, షేక్ షఫీ, మస్తాన్, షేక్ బడే బాజీ, షేక్ ఫతవుల్లా, విజయవాడ పార్లమెంట్ మైనారిటీ అధ్యక్షులు షేక్ కరిముళ్ళా, షేక్ అస్లం, అంజాద్, షేక్ అన్వర్, షేక్ ఆషా, షేక్ సలీం, ఎండీ గౌసియ, చెన్నుపాతి ఉషారాణి, దాసరి ఉదయశ్రీ, లబ్బా వైకుంఠం, కొండా, మల్లేశ్వర రావు, దాసరి దుర్గారావు, ప్రేమ్, జైపాల్, గరిమెళ్ల చిన్న, మురళి, నున్న శ్రీనివాసరావు, పాల కేశవ, చల్లగాలి అనీల్, తంగిరాల కొండ, సాంబి రెడ్డి, ఏరుబోతు రమణ, పరుచూరి ప్రసాద్, పీరియా సోమేశ్వర రావు, ఇప్పిలీ మోహన్, వింజమూరి సతీష్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.