చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కులాలపేరుతో రాజకీయం చేసేవాడిని చెప్పుతో కొట్టండి

by చైతన్యరధం
Aug 20, 2022 at 12:28pm
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
కులాలపేరుతో రాజకీయం చేసేవాడిని చెప్పుతో కొట్టండి
Share on FacebookShare on TwitterShare on Whatsapp

.పాలన చేతగాని వాడే కులాల గురించి మాట్లాడతాడు
.ఆ డర్టీ ఎంఫి బాగోతంపై సిఎం సిగ్గుతో తలదించుకోవాలి
.నోరేసుకు పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా?
.వైసిపి నేతల తీరుపై విరుచుకుపడిన చంద్రన్న

అమరావతి: డర్టీ ఎంపి మాధవ్‌ చేసిన పనికి ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి.. ఆ పని చేయకపోగా మళ్లీ అతనితోనే మాపై ఎదురుదాడి చేయిస్తున్నరు.. నోరేసుకుని పడిపోతే భయపడి పారిపోతామనుకుంటున్నారా.. మీ కథ తేల్చేదాకా వదలనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌ లో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెనాలికి చెందిన గుదిబండ గోవర్థన్‌ రెడ్డి అనుచరులు, మద్దతుదారులతో కలిసి వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. డర్టీ పిక్చర్‌ లో ఉన్నది ఎవరి రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు..ఎంపీ మాధవ్పైమ ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఎక్లిప్స్‌ నివేదిక ఫేక్‌ అని ఎవరు చెబుతారు? కులాల పేరుతో రాజకీయం చేసేవాడిని చెప్పుతో కొట్టండి.. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు కొందరు దుర్మార్గులు తయారయ్యారు.. వారి ఆటలు సాగునీయబోమని స్పష్టం చేశారు. నిన్న ఒక్క రోజులో రాష్ట్రంలో అయిదు ఘటనలు జరిగాయి.. ప్రభుత్వ దారుణ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఇసుక మాఫియాను ప్రశ్నించిన కిషన్‌ శవమై తేలాడు. తమతో విభేదించాడని ఏలూరి జిల్లాలో వైసిపి ఎంపిటిసి సాల్మన్‌ రాజును వేధించారు. వేధింపులు తట్టుకోలేక..సెల్పీ వీడియో విడుదల చేసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. పల్నాడులో మైనింగ్‌ అక్రమాల్లో వైసిపి లోని రెండు వర్గాలే గొడవలు పడ్డారు. ఈ వివాదంలో వడ్డర నేత దేవళ్ల రేవతిపై వైసిపి వాళ్లే దాడి చేశారు. వైసిపి కి చెందిన ఉయ్యూరు జడ్పిటిసి పూర్ణిమ సొంత పార్టీ వేధింపుల తో పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఎవరినీ బతకనీయరా అంటూ చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తెనాలి ప్రాంతానికి చెందిన గుదిబండ వెంకట్‌ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు..ఆయన నాకు సన్నిహితులు.. అతని బంధువు గుదిబండ గోవర్థన్‌ రెడ్డి ఇప్పుడు పార్టీలో చేరారు..వైసిపి ప్రభుత్వ విధానాలతో విసిగిపోయి పార్టీ మారుతున్నట్లు గోవర్దన్‌ రెడ్డి చెప్పారన్నారు.

సంబంధితవార్తలు

సంక్షేమం అభివృద్ధి.. సమతూకం

చంపేస్తాం..!

నేడు 13,326 పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

వైసిపి దాష్టీకానికి అమాయకుల బలి
తమకు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది కదా అని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామంటే కుదరదు.. ప్రజాస్వామ్యంలో పరిపాలన నిర్వహించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వాటికి లోబడే ఎవరైనా వ్యవహరించాల్సి ఉంటుందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.రాష్ట్రంలో రౌడీయిజం పరాకాష్ఠకు చేరుకుంది. సెటిల్‌ మెంట్లతో అందరిఆస్తులు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు ఒక కేసు పెట్టాలి అంటే ఎంతో ఆలోచన చేసేవాళ్లు.. కానీ ఇప్పుడు పోలీసులు మీటింగ్‌ కు వచ్చినందుకు కూడా కేసులు పెడుతున్నారు. నర్సీపట్నంలో ఒక డాక్టర్‌ మాస్క్‌ అడగడం తప్పా..మా ప్రభుత్వాన్నే మాస్క్‌ అడుగుతా అని పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేశారు. ఎస్‌ సి వర్గం నుంచి ఒక డాక్టర్‌ కావడం అంటే ఎంత కష్టమో ఒక సారి ఆలోచించండి. కాకినాడలో వైసిపి ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను చంపేసి..మళ్లీ అతని కార్‌లోనే మృత దేహాన్ని ఇంటిదగ్గర పడేశాడు. రైతుల డబ్బులు ఇవ్వలేదని ప్రశ్నించారని ప్రకాశం జిల్లాలో ఒక మహిళను తీవ్రంగా వేధించారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాంను వేధిస్తే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్రంలో వైసిపి వేధింపులకు ఎంతో మంది బలయ్యారు.

ప్రజారాజధానిని నాశనం చేశారు
ప్రజారాజధాని అమరావతిని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి అనాలోచిత విధానాలతో నాశనం చేశారని చంద్ర బాబునాయుడు మండిపడ్డారు.హైదరాబాద్‌ లాంటి అభి వృద్ది ఇక్కడా జరగాలని అమరావతికి శ్రీకారం చుట్టాం. దానికిపైనా బుదర వేశారు..రెండు మూడు లక్షల కోట్ల సంపద నాశనం చేశారు. అమరావతి, పోలవరం అనేవి రాష్ట్రానికి రెండు కళ్లు లాంటివి. 72 శాతం పూర్తి అయిన పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. నదుల అను సంధానంతో రాయలసీమ బాగుపడుతుందని ఐదేళ్లలో 64 వేల కోట్లు ఖర్చు చేశాం. పోలవరం డయాఫ్రం వాల్‌ ఏమయ్యిందో ఇప్పటికీ తేల్చలేదు. పోలవరం లో తప్పిదాలపై పిపిఎ స్వయంగా హెచ్చరించింది. ఏజెన్సీలను మార్చవద్దని పిపిఎ, కేంద్రం స్పష్టంగా చెప్పినా రాష్ట్రం వినలేదు. తొందరపాటు వద్దు అని స్వయంగా లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం వినలేదు. పోలవరంలో జరిగిన నష్టం టిడిపి ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పోలవరం విషయంలో కేంద్రాన్ని తప్పు పట్టే పని మొదలు పెట్టారు.

చివరకు జనానికి గోచీకూడా మిగలనివ్వరు!
రాష్ట్రంలో ప్రస్తుతం 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు..చివరికి గోచి కూడా తీసేస్తారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. అంబేద్కర్‌ విదేశీ విద్యకు పేరు మార్చి జగన్‌ పేరు పెట్టుకుంటాడా..అంబేద్కర్‌ కంటే జగన్‌ గొప్పవాడా.. కనీసం బుద్ది ఉందా..దేశంలో ఎక్కడైనా ఉందా? సోషల్‌ మీడియాలో ప్రశ్నించిన రాజేష్‌ అనే వ్యక్తిని కేసులు పెట్టి వేధించారు. రాష్ట్రంలో ప్రాణాలు తీయడం అంత సులభం అయి పోయింది. ఉదయం నన్ను తిట్టడంతోనే వైసిపి నేతల దినచర్య ప్రారంభం అవుతుంది. నా ఇంటికి వైసిపి ఎమ్మెల్యే కర్రలతో దాడికి వచ్చి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాడు..ఇప్పుడు అతను మంత్రి అయ్యాడు. అమరావతిలో నా కాన్వాయ్‌ పై రాళ్లు వేస్తే నాడు డిజిపి సమర్థించారు. మట్టిలో మాణిక్యాలు మన పేదల పిల్లలు..వారికి అవకాశాలు కల్పించాం. ఇప్పుడు ప్రపంచంలో మేటిగా మారారు.

టీచర్లు ఫోటోల పంపాలా.. మీరు పబ్జీ ఆడుకుంటారా?
రాష్ట్రంలో ఇప్పుడు శాడిస్టు ప్రభుత్వం టీచర్లపై వేధింపులకు పాల్పడుతోందని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.టీచర్లు ఫోటోలు తీసి పంపించాలా.. మీరు ఇంట్లో పబ్జీ అడుకుంటారా? పోస్టింగ్‌ ల కోసం రాజకీయ నేతల ఇళ్ల వద్దకు టీచర్లు వెళ్లకూడదు అని కొత్త విధానం తెచ్చింది టిడిపినే. పాఠశాలల విలీనం వల్ల పిల్లలు బడి మానేసే పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ తుగ్లక్‌ నిర్ణయాలు. రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆనందంగా లేరు. దేశంలో ఎక్కువ అప్పున్నది ఎపి రైతులు. వైసిపిలో అరటి తోటలు తగలేస్తే ఎంపి అవుతారు, బట్టలు విప్పేస్తే కేంద్రంలో మంత్రి అవుతారామో. సమాజంలో వర్గ విభేదాలు సృష్టిం చి లబ్ది పొందే ప్రయత్నాలను అడ్డుకోవాలి. వైసిపి వారే కుల రాజకీయాలకు ఆజ్యంపోస్తూ..కులం పేరుతో జన సేనను తిడుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ను తిడుతున్నారు. ఇదేమి సంస్కృతి అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నక్కా ఆనంద్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags: అంబేద్కర్‌ విదేశీ విద్య పథకంఅబ్దుల్‌ సలాంఅమరావతిఇసుక మాఫియాఉయ్యూరుఉల్లంఘినఎక్లిప్స్‌ నివేదికఎంపిఎంపిటిసిఎమ్మెల్సీఎస్‌ సి వర్గంఏలూరి జిల్లాకాన్వాయ్‌కారు డ్రైవర్‌కిషన్‌కులాలుగంగాధర నెల్లూరుగుదిబండ గోవర్థన్‌ రెడ్డిగోచిచంద్రబాబునాయుడుచిత్తూరు జిల్లాచెప్పుజడ్పిటిసిటిడిపిడయాఫ్రం వాల్‌డర్టీ పిక్చర్‌డాక్టతెనాలిదేవళ్ల రేవతినదుల అనుసంధానంనంద్యాలనర్సీపట్నంనాశనంపరాకాష్ఠపల్నాడుపవన్‌ కళ్యాణ్‌పూర్ణిమపోలవరంప్రకాశం జిల్లాప్రజారాజధానిప్రజాస్వామ్యంఫేక్‌మాధవ్‌మైనింగ్‌రాజకీయరాజీనామారాజేష్‌రాజ్యాంగంరాళ్లురౌడీయిజంర్‌ మాస్క్‌వడ్డర నేతవేధింపులువైసిపిశవశాడిస్టుసాల్మన్‌ రాజుసెటిల్‌ మెంట్సెల్పీ వీడియోసోషల్‌ మీడియాహైదరాబాద్
Previous Post

గెలుపు గుర్రాలకే టిక్కెట్లు

Next Post

వైసిపి నేతలు మా భూమిని కబ్జా చేశారయ్యా

మరిన్ని వార్తలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!
ఆంధ్రప్రదేశ్

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..
ఆంధ్రప్రదేశ్

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!
ఆంధ్రప్రదేశ్

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
ఐక్యంగా, అప్రతిహతంగా..!
ఆంధ్రప్రదేశ్

విజన్ లక్ష్యాలకు అనుగుణంగా వీబీ జీ రామ్‌జీ పనులు

చైతన్యరధం
@ February 20, 2026
ఎవరెన్ని కుట్రలు చేసినా.. అమరావతి అన్ స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

నేడు ఢిల్లీకి సీఎం

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

సమగ్రశిక్ష సిబ్బంది జీతాల

చైతన్యరధం
@ February 20, 2026
కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం
ఆంధ్రప్రదేశ్

కర్నూలుకు క్లస్టర్ వర్శిటీ ఖాయం

చైతన్యరధం
@ February 20, 2026
Load More

ముఖ్య వార్తలు

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అన్నింటా ఇదే ప్రాతిపదిక

చైతన్యరధం
@ February 19, 2026
అదరహో.. ఐఎఫ్ఆర్

అదరహో.. ఐఎఫ్ఆర్

చైతన్యరధం
@ February 19, 2026
మీరే ఈ దేశపు హీరోలు

మీరే ఈ దేశపు హీరోలు

చైతన్యరధం
@ February 18, 2026
చదువును దెబ్బతీశారు!

చదువును దెబ్బతీశారు!

చైతన్యరధం
@ February 18, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

పాడిరైతు సాధికారతే హెరిటేజ్ పారదర్శకత!

చైతన్యరధం
@ February 20, 2026
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

ఉద్యోగ కల్పనే ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ February 20, 2026
డిన్నర్ విత్ లోకేష్..

డిన్నర్ విత్ లోకేష్..

చైతన్యరధం
@ February 20, 2026
దమ్ము లేకే దొంగ డ్రామాలు!

దమ్ము లేకే దొంగ డ్రామాలు!

చైతన్యరధం
@ February 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist