.అవినీతి నుంచి బయటపడటానికే ఢల్లీి పర్యటన
.పోలవరం కోసం ఏం చేశారో జగన్‌రెడ్డి చెప్పాలి
.మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి: సీఎం జగన్ రెడ్డి స్వప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోదీనికి కలిశారని, రాష్ట్ర ప్రయోజనాల కోసంకాదని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. మంగళవారం జూమ్ సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానికి ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని మీడియాకు ఇవ్వలేని నిస్స హాయ స్థితిలో జగన్ ఉండడం సిగ్గు చేటన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు తాత్కాలిక సాయం అందించమని ఢిల్లీలో ప్రధానికి ముఖ్యమంత్రి వినతి పత్రాన్ని ఇచ్చినట్లు ముఖ్య మంత్రి కార్యాలయం వాట్సప్ ద్వారా పత్రికలకు సమా చారం తెలియజేసిందని చెప్పారు. సీఎం స్వయంగా పత్రికలకు తెలియజేయలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్ని సార్లు ఢిల్లీ వెళ్లినా, ప్రధాన మంత్రికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం శూన్యమని చెప్పారు. చంద్రబాబు హయాంలో 2019 ఫిబ్రవరిలో టెక్నికల్ ఎడ్వైజరీ కమిటీ డీపీఆర్ ప్రకారం రూ.55,548 కోట్లతో పోలవరానికి ఆమోదం తీసుకొచ్చినట్లు తెలిపా రు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. బస్సులను ఏర్పాటుచేసి, భోజన వసతి కల్పించి ప్రజలు, మీడియాకి ఇబ్బందులు లేకుండా పోలవరం ప్రాజెక్టు సందర్శన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారం పోల వరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు రూ.4,500 కోట్ల ఖర్చుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, కేంద్ర ప్రభుత్వం డయా ఫ్రం వాల్ నిర్మాణానికి రియింబర్స్ మెంట్ ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజనచట్టంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన హక్కని, దాన్ని జగన్‌రెడ్డి భ్రష్టు పట్టించాడని మండి పడ్డారు. స్వప్రయోజనాల కోసం, డర్టీ ఎంపీ మాధవ్‌ని కాపాడటానికి రాష్ట్ర ప్రయోజనాలని, పోలవరాన్ని తాక ట్టు పెట్టారని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులకు అందించిన సహాయ సహకారాలు శూన్యమన్నారు. కేంద్రం ఇచ్చిన రూ.4.5వేల కోట్లు ఏం చేశారని, వాటిలో నిర్వాసితులకి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేశారని చెప్పారు. ఆ ప్రాజెక్టు వద్దకు వెళ్ళ డానికి అనుమతులు దేనికని అడిగారు. లోయర్ కాపర్ డ్యాం మధ్యలో నీళ్ళు నిలబడేలా చేసి లోయర్ కాపర్ డ్యాం నాశనానికి పాల్ప డ్డారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో చేసిన పనులకి వచ్చిన రియింబర్స్ మెంట్ నిధులను పోలవ రానికి, నిర్వాసితులకి కాకుండా లిక్కర్ కంపెనీలకి అడ్వాన్స్ లు ఇచ్చుకోవడం దుర్మార్గమన్నారు. 31 మంది ఎంపీలు ఉన్న ఆర్థికశాఖ, ప్రధాని మంత్రి కార్యాలయం పై నిధుల కోసం ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు.
అవినీతి నుంచి బయటపడటానికే ఢిల్లీ పర్యటన
బాబాయి హత్య కేసులో నిందుతులను కాపాడ టానికి, కుటుంబ సభ్యులని అరెస్ట్ చేయకుండా ఉండ టానికి, డర్టీ ఎంపీని కాపాడుకోవటానికి, రూ.20వేల కోట్ల బీచ్ సాండ్ అవినీతి నుంచి బయటపడటానికి ప్రధాని మంత్రిని జగన్‌రెడ్డి కలిశారే తప్ప రాష్ట్ర యోజనా లకోసం కాదన్నారు. రూ.800 కోట్లు డయా ఫ్రం వాల్‌కి, రూ.వేల కోట్లు నీళ్లు ఎత్తి పోయడానికి కావాలని చేతకాని కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. పోలవరం పనులని ముందుకు తీసుకెళ్ళడంలేదని మద్రాస్ ఐఐటి వారు నివేదికలో స్పష్టం చేశారని చెప్పారు. ఒక ప్రణాళిక లేదు, ప్రభుత్వ అసమర్ధత, నిర్వాహణ లోపం, సమయానికి నిధులు విడుదల చేయకపోవడం, ఎజెన్సీల మధ్య సమ న్వయం లేకపోవడం, రివర్స్ టెండరింగ్ వల్ల పోలవరం ఇరిగేషన్‌కి ఈ దుస్థితి పట్టిందని 124 పేజీల నివేదికలో మద్రాస్ ఐఐటి వారు పేర్కొన్నట్లు తెలిపారు. రివర్స్ టెండరింగ్‌కి వెళ్లొద్దని పీపీఏ స్పష్టంగా చెప్పినా వినలేద న్నారు. ఒకవేళ వెళితే రాబోయే రోజులలో ఏ అనర్థాలు వచ్చినా గత కాంట్రాక్టర్‌ని, ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్‌ని అడగాలని చెప్పారు.
జగన్‌రెడ్డి సొంత నిర్ణయాలకు పోలవరం బలైందన్నారు. వేల కోట్ల అక్రమాలు జరిగాయని జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారని, పవర్ ప్రాజెక్ట్‌ని కొట్టేయడానికే ఈ డ్రామా అడాడనేది జగమెరిగిన సత్య మన్నారు. చంద్రబాబు పోలవరాన్ని సోమవారంగా మార్చి 40సార్లు పోలవరం సందర్శనకు వెళ్లి పనులను పరి గెత్తించినట్లు తలిపారు. గిరిజన, గిరిజనేతర కుటుంబాల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు నీళ్లల్లో కొట్టుకు పోయా యని, వారు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో తలదాచు కుంటున్నారని తెలిపారు. వారికి తినడానికి తిండి లేదని, వారికి ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికలకు ముందు భూమికి భూమి ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని చెప్పారు. గిరిజనులు, గిరిజనేతరులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారిపట్ల నిర్లక్ష్యం వహించా రన్నారు. పోలవరం, రంపచోడవరం ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, వారి అనుయాయులు రికార్డులు మార్చేసి పోలవరం నిర్వాసితులకు అందాల్సిన వందల కోట్ల రూపాయలు కాజేశారని చెప్పారు.వైసీపీ నాయకులు ప్రాజెక్టు రికార్డులు తారుమారు చేసి పోలవరం నిర్వాసితులకు వచ్చే నిధుల ను పందికొక్కుల్లా మెక్కుతున్నారని మండిపడ్డారు. పోల వరం కోసం ఏం చేశారో జగన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాడని దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.