.రౌడీయిజం పులివెందులలో చూపించుకో
.యువనేత నారా లోకేష్ హెచ్చరిక
అమరావతి: మిస్టర్ జగన్ రెడ్డీ.. నీ రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పం జోలికి వస్తే తాటతీస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. కుప్పం ఘటనపై గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కుప్పంలో అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిరచారు. జగన్‌రెడ్డి కుప్పంలో ఎన్ని కుప్పిగంతులు వేసినా చివరకి భంగపాటు తప్పదన్నారు. పేదవాళ్లు నోటికాడ ముద్ద లాక్కునే మూర్కపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డిఅని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లపై వైసీపీ మూకలు దాడులు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. రౌడీయిజం పులివెందులలో చూపించుకో.. కుప్పం జోలికి వస్తే తాటతీస్తామని నారాలోకేష్ వార్నింగ్ ఇచ్చారు.