అమరావతి: టిడిపి కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణేష్ విగ్రహాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ అశోక్ బాబు, టిడిపి నేతలు బుచ్చిరాం ప్రసాద్, దొరబాబు, కావలి గ్రీష్మ, ఎన్ ఆర విభాగం కోఆర్డినేటర్ రాజశేఖర్, మీడియా కోఆర్డినేటర్ దారపునేని నరేంద్రబాబు పూజలు నిర్వహించి వినాయక విగ్రహానికి వీడ్కోలు పలికారు. పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది ఆటపాటలతో హుషారుగా నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.