- నీతులు చెప్పడం కాదు.. ఆచరించడం నేర్చుకో!
- మళ్లీ విష సంస్కృతిని తీసుకొస్తున్నారా?
- చెట్లునరకడం, బోర్లు పూడ్చడం ఉన్మాదచర్య
- ఎమెల్యే కేతిరెడ్డిపై పరిటాల శ్రీరామ్ ఆగ్రహం
ధర్మవరం: తెలుగుదేశం కేడర్‌పై దాడులు చేస్తూ ఉంటే ఇలాగే చూస్తూ ఊరుకోమని.. ప్రతి దాడులు తప్పవని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి పరి టాల శ్రీరామ్ తీవ్రంగా హెచ్చరించారు. గ్రామాల్లో వైసిపి గూండాలు దాడులు, దౌర్జన్యాలు చేసి.. రాజకీ యాలు చేయాలనుకుంటున్నారని ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకోబోమని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని మల్లేనిపల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. గ్రామంలో రెండు వేరు వేరు కులాలకు చెందిన అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. 25 రోజుల తర్వాత గ్రామానికి వచ్చిన యువకుడితో పాటు అతని వర్గీయులపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, పరిటాల శ్రీరామ్ ఇవాళ ప్రభుత్వ ఆసు పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. అధైర్య పడవద్దని,అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ప్రేమ వ్యవహారంలో జరిగిన దాడి కాదని.. కక్షపూరితంగా కొందరు దాడికి పాల్పడ్డారని పరిటాల శ్రీరామ్ ఆగ్ర హం వ్యక్తంచేశారు. గ్రామంలో రాజకీయంగా ఎదుగుతున్నార న్న కారణంతో ఇలా దాడులు చేయడం ధర్మవరంలో పరిపాటిగా మారిందని శ్రీరామ్ అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ముదిగుబ్బ మండలంలో జరిగిన దాడినికూడా ఆయన ప్రస్తావించారు.
బత్తలపల్లి మండలంలో ఎస్టీ కులాని కిచెందిన ఓవ్యక్తి ఫిర్యాదు చేశాడని బోరు బావిని పూడ్చేసిన సంఘటన కూడా జరిగిందని గుర్తుచేశారు. గ్రామాల్లో ఇలాగా దాడులుచేసి దౌర్జన్యాలు చేసిపై చేయి సాధిద్దామని అనుకుంటే అది పొరపాటు అని వైసిపి నాయకులపై పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇలాంటి సంఘటనలను ఖండిరచాలని అన్నారు. ఆయన పొద్దునలేచినప్పటి నుంచి నీతి వాక్యాలు బాగా చెబుతారని, కానీవాటిని ఆచరించాల ని కూడా సూచించారు. ధర్మవరం ప్రాంతప్రజలు ఎప్పు డు ప్రశాంతత మాత్రమే కోరుకుంటున్నారని కానీ గ్రామాల్లో మళ్ళీ చెట్లు నరకడం, బోర్లు పూడ్చివేయడం వంటి సంఘటనలు చేస్తున్నారని ఇది ఎంతమాత్రంసరికాదన్నా రు. గ్రామాల్లో ఇలాంటిసంఘటనలు జరిగి కక్షలు రేగితే దానికి ఎమ్మెల్యేనే బాధ్యతవహించాల్సి ఉంటుందని అన్నారు.