సీఎం జగన్ రెడ్డికి ఫోటోల పిచ్చి ముదిరిపోయింది. సంక్షేమ పథకాల పేరుతో పత్రికల్లో ప్రకటనల కోసం ఏటా 600 కోట్లుపైగా ఖర్చు చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, సకాలంలో ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు. తాజాగా వైసీపీ మా నమ్మకం నువ్వే జగన్ అంటూ రాగం అందుకుంది. స్లోగన్ పార్టీది అయినా ప్రచారం మాత్రం ప్రభుత్వ ఖర్చుతోనే జరుగుతోంది. ఇప్పటికే రైతుల పట్టాదారు పాసు పుస్తకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చే ధ్రువపత్రాలు, చివరకు జగనన్న శాశ్విత భూ హక్కు పథకం ద్వారా పొలాల సరిహద్దుల్లో నాటించే రాళ్లపై కూడా జగన్ రెడ్డి బొమ్మ పడింది. ఇవి చాలవన్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు ఇచ్చే ఓపీ స్లిప్పులపై కూడా జగర్ రెడ్డి బొమ్మ ముద్రించి మరీ ఇస్తున్నారు. అన్న అంతటితో ఆగలేదు… అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్న పిల్లలకు ఉచితంగా ఇచ్చే చిక్కీలపై కూడా జగన్ రెడ్డి బొమ్మ వేయించుకుకున్నారు.
జగన్ రెడ్డి బొమ్మ లేకుంటే మాత్రం అధికారులకు మూడినట్టే. ఇవన్నీ ఒక ఎత్తయితే పర్సనల్ గా ప్రజలు వాడుకునే ఫోన్ వెనకాల మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్లు వేసేందుకు ఫ్రింటింగ్ మొదలు పెట్టారు. ఇక పనిలో పనిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటి మెయిన్ డోరుకు మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు వేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ఇలా జగన్ రెడ్డి బొమ్మల పిచ్చి అన్ని రంగాలకు, అన్ని ప్రాంతాలకు విస్తరించింది. టిడ్కో ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయని జగన్ రెడ్డి, వాటి రంగులు మార్చేందుకు మాత్రం వందల కోట్లు తగలేశారు. జగన్ రెడ్డి రంగుల, బొమ్మల పిచ్చి అంతటితో ఆగలేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు పార్టీ రంగులు పులిమించారు. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు ఏంటని కోర్టు ముట్టికాయలు వేసినా కుక్కతోక వంకరన్నట్టు, అధికారులు వారి వక్ర బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు