గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని, వారి బకాయిల వెంటనే చెల్లించాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి రాసిన లేఖలో కోరారు.
లేఖలో అంశాలు:-
• గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది క్రమబద్ధీకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది.
• సచివాలయ సిబ్బంది కి 2021 అక్టోబర్ ప్రోబేషన్ పూర్తయింది. 2022 జూన్ నుంచి రెగ్యులరైజేషన్ జరిగింది.
• రాష్ట్ర ప్రభుత్వం వారికి 2021 అక్టోబరు నుంచి పే స్కేల్‌ను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. అయితే ఆ బకాయిలకు మాత్రం చెల్లించలేదు.
• మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాలలో ఇంకా దాదాపు 40,000 మంది ఉద్యోగుల క్రమబద్ధీకరణ పెండింగ్ లో ఉంది.
• ఇది ఉద్యోగుల మధ్య అసమానతలను సృష్టిస్తోంది.
• సచివాలయ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లింకపోవడం….కొందరికి క్రమబద్ధీకరణ చేయకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
• గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందిని తక్షణమే క్రమబద్ధీకరించాలి.
• క్రమబద్ధీకరించబడిన సిబ్బందికి పెండింగ్ బకాయిలు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలి.
• AP గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (APGLI), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS), ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) కింద గ్రామ/వార్డు సెక్రటేరియట్ సిబ్బంది నుండి మినహాయించబడిన మొత్తాలను వెంటనే సంబంధిత ఖాతా హెడ్‌లలో జమ చేయాలి.