డోన్ నియోజకవర్గం ఎస్.రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ లబ్ధిదారులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు. టిడిపి హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద గ్రామంలో నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీకి సిసి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
అప్పలుచేసి ఇళ్లు పూర్తిచేసుకున్న మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ బిల్లులు ఇప్పించి, సిసి రోడ్లు నిర్మించండి అని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ పేదలపై కక్షసాధింపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో అసంపూర్తిగా నిలచిపోయిన సుమారు 2లక్షల ఇళ్లకు గత టిడిపి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఇళ్లనిర్మాణం పూర్తిచేసింది.
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు అందజేస్తాం. రంగాపురం ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో సిసి రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.