ఎమ్మిగనూరు బహిరంగ సభ లో నారా లోకేష్ మాట్లాడుతూ ..
ఎమ్మిగనూరు లో ప్రజల ఎనర్జీ చూసిన తరువాత జగన్ కి జ్వరం రావడం ఖాయం అని ఫిక్స్ అయ్యా.
చేనేతకు పుట్టినిల్లు ఎమ్మిగనూరు. ఎమ్మిగనూరు చేనేతకు గుర్తింపు తెచ్చిన గొప్ప వ్యక్తి సోమప్ప గారు.
ఎమ్మిగనూరు కి అభివృద్ధి ని పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ బివి. మోహన్ రెడ్డి గారు.
శ్రీ నీలకంఠశ్వరస్వామి, శ్రీ రామలింగేశ్వరస్వామి, అల్లిపీరా దర్గా ఉన్న పుణ్యభూమి ఈ ఎమ్మిగనూరు.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఈ నేల పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.
యువగళం…మనగళం…ప్రజాబలం.
పేదలు ఎప్పటికీ పేదలు గానే ఉండాలి అనేది దేశంలోనే ధనిక సీఎం జగన్ కోరిక.
పేదరికం లేని రాష్ట్రం చూడాలన్నది మీ లోకేష్ కోరిక.
ధనిక సీఎం జగన్ కి పేదలకి మధ్య యుద్ధం జరుగుతుంది.
పేదల గొంతు వినిపించే వేధికే ఈ యువగళం.
పరదాల సీఎం ప్రజల్లో తిరిగే లోకేష్ ని అడ్డుకోవడానికి అనేక కుట్రలు చేసాడు.
జిఓ1 తెచ్చాడు మడిచి పెట్టుకో అని చెప్పా. పోలీసులతో వచ్చాడు అంబేద్కర్ గారి రాజ్యాంగం చూపించా. లాస్ట్ ట్రయల్ గా వైసిపి కుక్కల్ని పంపాడు తన్ని పంపాం.
నన్ను అడ్డుకోవడం నీ తరం కాదు. నువ్వు రోడ్డు మీద ధైర్యంగా తిరగడం సాధ్యం కాదు.
మొన్న హెలికాఫ్టర్లో టెక్నికల్ ప్రాబ్లెమ్ వచ్చిందని రోడ్డు మార్గంలో వెళ్లాడు పరదాల సీఎం.
ధర్మవరం నియోజకవర్గంలో న్యాయం చెయ్యాలి అంటూ రైతులు పరదాల సీఎం కాన్వాయ్ కి అడ్డం పడుకున్నారు. కనీసం ఆగకుండా రైతులను ఈడ్చిపడేసారు జగన్.
ఒక్క క్షణం ఆగి వారి సమస్య వినే ఓపిక లేదు పరదాల సీఎంకి.
నన్ను ఆపడం సాధ్యం కాదని జగన్ కి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు భారతి రెడ్డి గారిని రంగంలోకి దింపాడు.
లోకేష్ దళితుల్ని అవమానించాడు అంటూ ఒక ఫేక్ వీడియో తయారు చేసి సాక్షి లో హడావిడి చేసారు భారతి రెడ్డి గారు.
దళితులకు జగన్ పీకింది, పొడిసింది ఏమి లేదు అని నేను అన్నాను. అక్కడ మీటింగ్ లో ఉన్న దళితులు అంతా చప్పట్లు కొట్టారు.
నేను మరోసారి సవాల్ చేస్తున్నా అమ్మా భారతి రెడ్డి గారు నేను దళితుల్ని అవమానించినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా.
మీ వీడియో ఫేక్ అని తేలితే సాక్షి మీడియా మూసేస్తారా?
జగన్ కొత్త జిఓ ఇచ్చాడు. అదేంటో తెలుసా చంచల్ గూడా జైలు పేరు జగన్ గూడా జైలు గా మారుస్తూ జిఓ తీసుకొచ్చాడు.
బాబాయ్ ని చంపిన కేసు లో మరో బాబాయ్ చంచల్ గుడా జైలు కి పోవడమే దేవుడి స్క్రిప్ట్.
త్వరలో అబ్బాయిలు కూడా చంచల్ గూడా జైలుకి పోవడం ఖాయం.
వివేకా గారి మర్డర్ గురించి జగన్ అండ్ కో చెప్పిన కధలు విన్న తరువాత నాకో కథ గుర్తొచ్చింది.
అనగనగా ఇడుపులపాయ అని ఒక ఊరు ఉంది
ఆ ఊరిని అనుకోని ఒక ఏరు ఉంది.
వర్షా కాలంలో ఆ ఏరు కి వరద వచ్చింది.
అందరూ ఊరు ఖాళీ చేసి ఏరు దాటుతున్నారు.
ఆ ఊర్లో జగన్నాథ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు.
అతను కూడా అందరి లానే తన దగ్గర ఉన్న తెప్ప లో కుటుంబాన్ని ఎక్కించుకొని ఏరు దాటుతున్నాడు.
తెప్ప లో జగన్నాథ్, బాబాయ్, తమ్ముడు, భార్య కూడా ఉన్నారు.
వరద బాగా పెరిగింది. తెప్ప ప్రమాదంలో పడింది.
ఏరు దాటాలి అంటే తెప్ప లో బరువు తగ్గాలి.
అప్పుడు జగన్నాద్ బాబాయ్ ని ఏరు లోకి గెంటేసాడు.
మళ్లీ వరద పెరిగింది ఇంకొకరిని గెంటేయ్యాలి. అప్పుడు తమ్ముడ్ని గెంటేసాడు.
మళ్లీ వరద పెరిగింది తెప్ప తిరగబడేలా ఉంది.
ఇప్పుడు ప్రశ్న ఎంటి అంటే భార్యను గెంటేస్తాడా? లేక ఆయన్ని భార్య గెంటేస్తుందా?
జగన్ ఒక మోసగాడు. ఎందుకో తెలుసా? ఒక్క ఉదాహరణ చెబుతా.
జగన్ కి చెబుదాం అనేది కొత్త కార్యక్రమం అంటూ బిల్డప్ ఇస్తున్నారు.
నాలుగేళ్లుగా స్పందన కు కాల్ చేస్తే స్పందన లేదు. ఇప్పుడు దానికే పేరు మార్చి జగన్ కి చెబుదాం అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టారు.
సరే చెబుతా విని పరిష్కరించాలి. కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా కావాలి తెస్తావా?
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చెయ్యగలవో చెప్పు?
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావో చెప్పు.
జగన్ చేసేవి అన్ని దొంగ పనులే అందుకే పరదాల మధ్య దాక్కుంటాడు.
అందుకే ఆయనకి పరదాల జగన్ అని పేరు పెట్టా.
పరదాల జగన్ పెద్ద ఫిట్టింగ్ అండ్ కట్టింగ్ మాస్టర్. ఆయన ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతాను.
పరదాల జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.
అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు.
పరదాల జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
పరదాల జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ పరదాల జగన్.
పరదాల జగన్ యువత ను చీట్ చేసాడు.
జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
పరదాల జగన్ మహిళల పసుపు, కుంకుమ చెరిపేస్తున్నాడు.
సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఎం అయ్యింది? సొంత జే బ్రాండ్లు అమ్ముకొని వేల కోట్లు సంపాదిస్తున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు.
అధికారంలోకి వచ్చాకా పన్నుల భారం తగ్గిస్తాం. నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తాం.
పరదాల జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు.
పరదాల జగన్ పరిపాలనలో పురుగుల మందులు పనిచేయవు. జగన్ బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ కొడితే మాత్రం పురుగులు చస్తాయి.
రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు.
రాయలసీమ లో 1000 అడుగుల వరకూ బోర్లు వేస్తే కానీ నీళ్లు రావు…,మరి కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి.
మీటర్లు రాయలసీమ రైతులకు ఉరితాళ్లు.
పరదాల జగన్ ఉద్యోగస్తులను కూడా వేధించాడు.
వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.
పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది.
బీసీలకు బ్యాక్ బోన్ విరిచాడు పరదాల జగన్.
పేరుకే బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసారు. నిధులు కేటాయించలేదు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ కట్ చేసి 16,500 మందిని పదవులకు దూరం చేసాడు.
బీసీలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల అక్రమ కేసులు బీసీల పై పెట్టాడు. అందుకే బీసీల భద్రత కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.
బీసీలకు శాశ్వత కుల ధృవ పత్రాలు అందిస్తాం.
బీసీలమని ఆరు నెలలకోసారి కుల ధృవపత్రాలు తీసుకోవాల్సిన దుస్థితి లేకుండా చేస్తాం.
మొబైల్ లో ఒక్క బటన్ నొక్కగానే ఇంటికి బిసి కుల ధృవ పత్రాలు వచ్చే ఎర్పాటు చేస్తాం.
అవి శాశ్వత కుల ధృవ పత్రాలు గా ఉపయోగపడేలా చట్టం లో మార్పులు తీసుకొస్తాం.
దామాషా ప్రకారం బీసీ ఉపకులాలకు నిధులు, రుణాలు ఇస్తాం.
పరదాల జగన్ దళిత ద్రోహి.
డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలైంది. ఇప్పుడు డాక్టర్ అచ్చెన్న వరకూ వచ్చింది.
ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ కి గుండు కొట్టించారు, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ ని కొట్టి చంపారు, జగన్ లిక్కర్ స్కామ్ పై పోరాడినందుకు ఓం ప్రతాప్ కి చంపేసారు. పెద్దిరెడ్డి అవినీతి పై పోరాడినందుకు జడ్జ్ రామకృష్ణ ని హింసించారు.
ఒక్క కేసులో అయినా దళితుల పై దాడి చేసిన వారికీ శిక్ష పడిందా?
సుబ్రహ్మణ్యం అనే దళిత యువకుడిని చంపేసిన ఎమ్మెల్సీ అనంతబాబు కి సన్మానం చేసి ఉరేగించారు.
వైసిపి పాలనలో దళితులను చంపడానికి జగన్ స్పెషల్ లైసెన్స్ ఇచ్చారు.
మైనారిటీలను మోసం చేసాడు పరదాల జగన్.
దుల్హన్, రంజాన్ తోఫా వంటి పథకాలు రద్దు చేశాడు.
మసీదు, ఈద్గా, ఖబర్ స్తాన్ ల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు.
ఆత్మహత్య చేసుకోవడం మైనార్టీలు మహా పాపంగా భావిస్తారు.
జగన్ రెడ్డి సీఎం అయ్యాక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కేవలం వైసీపీ నాయకుల వేధింపుల వల్లే వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇబ్రహీం అనే ముస్లిం నేతను నరసరావుపేటలో దారుణంగా నరికి చంపేశారు.
పలమనేరులో మిస్బా అనే పదో తరగతి చెల్లిని వైసీపీ నాయకుడు సునీల్ టీసీ ఇప్పించి, బలవంతంగా వేధించడంతో, చదువుకు దూరం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.
కర్నూలు లో హాజీరాని అత్యాచారం చేసి చంపేశారు. ఆమె తల్లి బేగంబీ కి కనీసం పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వకుండా ప్రభుత్వం వేధించింది. ఇప్పటికీ ఆ తల్లికి న్యాయం జరగలేదు.
టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. హజ్ యాత్రకు సహాయం చేసాం. ఆనాడు బీజేపీ తో పొత్తు ఉన్నా మైనార్టీల పై ఒక్క దాడి జరగలేదు, ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపలేదు.
పరదాల జగన్ నేను రాయలసీమ బిడ్డని అంటాడు కానీ ఆయన రాయలసీమ కు పట్టిన క్యాన్సర్ గడ్డ.
అప్పర్ తుంగభద్ర కోసం కేంద్రం 5300 కోట్లు కేటాయించింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయితే రాయలసీమ ఎడారిగా మారిపోతుంది.
టిడిపి ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసింది 11 వేల కోట్లు. జగన్ 4 ఏళ్లలో ఖర్చు చేసింది 2,700 కోట్లు మాత్రమే.
రాయలసీమ రైతులకు టిడిపి హయాంలో ఇచ్చిన డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసాడు జగన్ రెడ్డి. ఎస్సి,ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, మిగిలిన వారికి 90 శాతం సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం.
అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమత్తు కూడా మర్చిపోయాడు. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయి 61 మంది చనిపోయారు.
రిలయన్స్, అమరరాజా, జాకీ వెళ్లిపోవడం వలన రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు.
ఎమ్మిగనూరు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని మీరు చెన్నకేశవ రెడ్డి గారిని గెలిపించారు.
ఎవరికైనా వయస్సు పెరిగే కొద్ది డబ్బు మీద ఆశ తగ్గుతుంది. కానీ మీ ఎమ్మెల్యే గారికి వయసుతో పాటు డబ్బు మీద ఆశ పెరుగుతుంది.
అందుకే ఎమ్మెల్యే పేరు మార్చాను ఆయన చెన్న కేశవ కాదు క్యాష్ కేశవ.
నియోజకవర్గాన్ని దోచుకోవడం కోసం ఆయన నాలుగు కలక్షన్ బ్రాంచులు ఓపెన్ చేసారు. క్యాష్ కేశవ ఒక బ్రాంచ్ కి ఎండీ, కొడుకు జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాంచ్ కి ఎండీ, అల్లుడు ఒక బ్రాంచ్ కి ఎండీ, ఇక క్యాష్ కేశవ అనుచరులది ఒక బ్రాంచ్.
ఎమ్మిగనూరులో ప్రజలు ప్రశాంతత కోల్పోయారు. భూకబ్జాలు, కమిషన్లు, దాడులకు అడ్డాగా మారిపోయింది.
క్యాష్ కేశవ సొంత ఊరు కడిమెట్లలో సర్వే నెంబర్లు 773/B1, 773/B2, 707, 895-8 పరిధిలో 100 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసారు. భూమి దగ్గరకు ఎవరూ వెళ్లకుండా ట్రెంచ్ కూడా కొట్టాడు.
దేవుడ్ని కూడా వదలలేదు క్యాష్ కేశవ. ఆయన సొంత ఊరు కడిమెట్లలో సర్వే నంబర్ 70, 583 లో ఉన్న 30 ఎకరాల దేవాదాయ భూమిని తన పేరు మీద ఆన్ లైన్ చేసుకున్నారు.
కడిమెట్లలో దోచుకోగా మిగిలిన చెన్నకేశవస్వామి ఆలయ భూమిని “లాంగ్ లీజ్” పేరుతో కొట్టేయడానికి స్కెచ్ వేసాడు క్యాష్ కేశవ.
నందవరం మండలం నాగులదిన్నెగ్రామంలో సర్వే నంబర్ 94 లో ఉన్న శ్మశానం భూముల్ని కూడా వదలలేదు క్యాష్ కేశవ అనుచరులు. శ్మశానాన్ని కబ్జా చేసి షాపులు కట్టేసారు.
ఎమ్మిగనూరు టౌన్ లో టెండర్లు లేకుండా ప్రభుత్వ స్థలంలో షాపులు నిర్మాణం చేసారు. ఒక్కో షాపు కి గుడ్ విల్ కింద 10లక్షలు వసూలు చేసారు క్యాష్ కేశవ.
ఎమ్మిగనూరు లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా క్యాష్ కేశవకు 10 శాతం వాటా ఇవ్వాలి అంట.
ఇక ఎమ్మిగనూరు లో ఎవరు రియల్ ఎస్టేట్ వెంచర్ వెయ్యాలి అన్నా క్యాష్ కేశవ కొడుకు జగన్మోహన్ రెడ్డికి 10 శాతం కప్పం కట్టాల్సిందే.
గోనెగండ్ల గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన 8 ఎకరాల భూమిని కబ్జా చేసాడు క్యాష్ కేశవ అనుచరుడు.
టిడిపి హయాంలో ఎమ్మిగనూరు అభివృద్ధి లో నంబర్1. ఇప్పుడు అవినీతి లో నంబర్1. క్యాష్ కేశవ రెడ్డి 5 కోట్ల రూపాయిలు మింగేసాడు. ఆఖరికి కరెంట్ బిల్లులు కట్టలేని దుస్థితికి మున్సిపాలిటీని తెచ్చాడు.
టిడిపి హయాంలో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు జరిగేది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ విధానాన్ని రద్దు చేసి ప్రైవేట్ వ్యాపారులతో పత్తి కొనుగోలు చేయిస్తున్నారు. పత్తి అమ్మడానికి వచ్చిన ప్రతి వాహనం నుండి వేల రూపాయిలు వసూలు చేస్తున్నాడు క్యాష్ కేశవ అల్లుడు.
ప్రస్తుతం మన సభ జరుగుతున్నఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీ గ్రౌండ్ ని కొట్టేయడానికి స్కెచ్ వేసారు క్యాష్ కేశవ.
ఎమ్మిగనూరు నియోజకవర్గం అభివృద్ధి మీద సైకిల్ బ్రాండ్ ఉంది. ఎమ్మిగనూరు టౌన్ లో రోడ్లు, తాగునీటి సమస్య తీర్చింది టిడిపి. గ్రామాల్లో సిసి రోడ్లు, పేదలకు ఇళ్లు కట్టింది టిడిపి.
మీరు ఎం చేసారు? పాలిచ్చే ఆవుని వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నారు.
రూ.1986 కోట్లతో టిడిపి హయంలో ప్రారంభించిన ఆర్డీఎస్ రైట్ కెనాల్ పనులు వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తాం.
గురురాఘవేంద్ర లిఫ్ట్ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కోసం రూ.15 కోట్లు ఇవ్వలేని చెత్త ప్రభుత్వం జగన్ ది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత పనులు పూర్తి చేసి గురురాఘవేంద్ర లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం.
టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో 3వేల టిడ్కో ఇళ్లు నిర్మించాం. 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులు కూడా వైసిపి చెత్త ప్రభుత్వం పూర్తిచెయ్యలేక పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకు ఇళ్లు కేటాయిస్తాం.
టిడిపి హయాంలో బనవాసి దగ్గర 10 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి 96 ఎకరాలు కేటాయించాం. వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టును చంపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం.
టిడిపి హయాంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి చేనేత క్లస్టర్ మంజూరు చేస్తే వైసిపి ప్రభుత్వం ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తాం.
టిడిపి హయాంలో రూ.111 కోట్ల చేనేత రుణాలు మాఫీ చేసాం. మగ్గం కొనుగోలు కోసం 50 శాతం సబ్సిడీ తో రుణాలు ఇచ్చాం.
యార్న్,కలర్, కెమికల్స్ సబ్సిడీ లో అందించాం. ఇప్పుడు అన్ని పధకాలు పరదాల జగన్ రద్దు చేసాడు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మగ్గం ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం. టిడ్కో ఇళ్లు అందిస్తాం. పాత పధకాలు అన్ని తిరిగి ప్రారంభిస్తాం.
టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం గుడికల్ గ్రామంలో 95 ఎకరాల్లో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. ఆ పనులు ఆపేయడమే కాకుండా ఆ భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు క్యాష్ కేశవ. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములు స్వాధీనం చేసుకొని ఎస్ఎస్ ట్యాంక్ నిర్మాణం చేసి ఎమ్మిగనూరు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం.
టిడిపి హయంలో ఎమ్మిగనూరు టౌన్ లో కోట్ల విలువైన స్థలాన్ని వాల్మీకి కమ్యూనిటీ భవనానికి కేటాయించి, భవన నిర్మాణం కోసం నిధులు కూడా ఇచ్చాం. వైసిపి ప్రభుత్వం వాల్మీకి భవనం నిర్మాణాన్ని ఆపేసింది.
టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాల్మీకి భవనం నిర్మాణం చేస్తాం.
టిడిపి హయాంలో ఎమ్మిగనూరు టౌన్ లో దళితుల కోసం అంబేద్కర్ భవన్ కోసం విలువైన స్థలాన్ని కేటాయించడం జరిగింది. వైసిపి ప్రభుత్వం అంబేద్కర్ భవన్ నిర్మాణాన్ని ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ భవన్ నిర్మాణం చేస్తాం.
టిడిపి హయాంలో ఎమ్మిగనూరు లో జామియా మసీదు కోసం 30 లక్షల రూపాయలు కేటాయించాం. వైసిపి ప్రభుత్వం పనులు ఆపేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే జామియా మసీదు నిర్మాణం చేపడతాం.
రాయలసీమలో పెండింగ్ ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందిస్తాం.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మిర్చి, పత్తి, ఉల్లి, టొమాటో రైతులు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడి వ్యయం తగ్గించి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత నాది. మీకు అవసరమైన కోల్డ్ స్టోరేజ్ లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం.
ఉపాధి లేక ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాకా ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కేలా చేస్తాం.
టిడిపి కార్యకర్తల పై అక్రమ కేసులు బనాయించి వేధించిన ఎవరిని వదిలి పెట్టను. వడ్డీతో సహా చెల్లిస్తాం. అక్రమ కేసులు పెట్టిన అధికారులు పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.