టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత రేషన్ సరఫరా విధానాన్ని సమీక్షిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం కర్నూలు బండిమిట్ట వాసులు లోకేష్ ను కలిసి వారి సమస్యలపై విన్నవించారు.
మా ప్రాంతంలో కరెంటు స్తంభాల వైర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
డ్రైనేజి, వాటర్ పైపులు కలిసి ఉండటంతో తాగునీరు కలుషితమవుతోంది. మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.
రేషన్ బళ్ల కోసం గంటలతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. డీలర్ల వద్ద రేషన్ ఇచ్చే విధానాన్ని పునరుద్దరించాలి.
పెట్రోలు, గ్యాస్ ధరలు తగ్గించాలి.
తమ ప్రాంతంలో చాలామందికి పింఛన్లు తీసేశారు. అర్హులందరికీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
అర్హులందరికీ టిడ్కో ఇళ్లు ఇవ్వాలి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్ ప్రభుత్వం పన్నులు పెంచడంలో చూపిన చొరవ సౌకర్యాల కల్పనలో చూపడం లేదు.
కమీషన్ల కోసం రేషన్ బళ్లను కొనుగోలు చేసి జనానికి చుక్కులు చూపిస్తున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించి, ధరలను అదుపులోకి తెస్తాం.
అర్హలైన వారదరికీ పెన్షన్లు, ఇళ్లు మంజూరు చేస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.