టిడిపియే అన్నదాతలకు న్యాయం చేస్తుంది
సిఎం అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి
రూ. 3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో సమాధానం చెప్పాలి
రైతు భక్షక కేంద్రాలుగా మారిన ఆర్బీకే లు
రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో చెప్పాలి
అన్నదాతలను ఆదుకోవటం ప్రభుత్వ కనీస బాధ్యత. ఈ ముఖ్యమంత్రికి ఆ పని చేయటం చేతగావటం లేదు. అందువల్ల తక్షణమే పదవినుంచి తప్పుకోవాలి. అన్నదాతలకు ఎలా న్యాయం చేయాలోతెలుగుదేశం పార్టీ చేసి చూపిస్తుంది అని అని మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కన్నామాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమకష్టం చెప్పుకోవడానికి వెళ్లిన రైతుల్ని ఎర్రిపప్ప అని తూలనాడిన మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి.
మంత్రి రైతుల్ని అవమానించినందుకు నైతికబాధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. రైతులు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి కుర్చీఉంటే చాలు, తనకు రావాల్సిన ఆదాయం వస్తుంది అన్న ధీమాలో జగన్ ఉన్నాడు అని విమర్శించారు. పంటలబీమాసొమ్ము సకాలంలో చెల్లించని జగన్ ప్రభుత్వ నిర్లక్షమే రైతులకన్నీళ్లకు ప్రధానకారణమన్నారు.
ధాన్యం కొనుగోళ్లపేరుతో మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న రైతులదోపిడీ జగన్మోహన్ రెడ్డికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ధాన్యంకొనుగోళ్లలో జరిగే అక్రమాలు అరికట్టి, రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే నేరుగా గిట్టుబాటుధరకు కొనాలి, తనపార్టీ మేనిఫెస్టోలో పెట్టిన రూ.2వేలకోట్ల ప్రకృతివిపత్తుల సహాయనిధి, రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి ఏమైందో జగన్ రైతులకు సమాధానంచెప్పాలి అని డిమాండ్ చేశారు.
అకాలవర్షాలకు సర్వంకోల్పోయిన రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిలా తనకే మీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని, ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్లపాలై, ఇతరపంటలు పొలా ల్లోనే కుళ్లి
మగ్గిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతల్ని తిడుతూ కాలక్షేపం చేస్తున్నారని, అధికార యంత్రాంగం రైతుల ముఖంకూడా చూడకుండా నిద్రపోతోందని కన్నా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కుర్చీలో
కూర్చుంటేచాలు, తనకు రావాల్సిన ఆదాయం వస్తుందన్నట్టుగా వ్యవహరిస్తున్న జగన్ కు రైతులబాధలు పట్టడంలేదు.
కేవలం తనకు వచ్చేఆదాయం పోతుందనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని వీడటంలేదని ఆరోపించారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో రైతుల్ని అధికారులతో కుమ్మక్కై ఎలాదోచుకుంటున్నారో ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. 75కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5కేజీలు, మరోచోట 12కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తు న్నారు. కొన్నిచోట్ల మిల్లర్లను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోంది.
లారీధాన్యానికి కొన్నిచోట్ల మిల్లర్లు రూ.10వేలనుంచి రూ.20వేలవరకు రైతులనుంచి దండుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతులకష్టాన్ని అప్పనంగా దోచుకుంటున్నాకూడా ప్రభుత్వంలో చలనంలేదు, పాలకుల్లో స్పందన లేదు. రైతుభరోసా కేంద్రాలు రైతు భక్షకకేంద్రాలుగా మారాయి అని కన్నా ఆరోపించారు. ధాన్యాన్ని రైతులు ఆ కేంద్రాలకు తీసుకెళ్తే వారు ఎక్కడో దూరంగా మిల్లులకు తీసుకెళ్లమని రైతులకు సూచిస్తూ, వారిపై అదనంగా రవాణాఛార్జీల భారం వేస్తున్నారు. అకాలవర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఈ విధంగా వివిధపద్ధతుల్లో మిల్లరు అధికారయంత్రాంగం దోచుకోవడం సరైందికాదు. రైతుల్ని దోచుకుంటున్నవారిని కఠినంగా శిక్షించి, వారికి రవాణాఛార్జీలతో సహా ప్రభుత్వమే సొమ్ము చెల్లించాలన్నారు.
రైతుల కష్టానికి, నష్టానికి జగన్ ఏవిధంగా న్యాయంచేస్తాడో సమాధానంచెప్పాలి అని కన్నా డిమాండ్ చేశారు. మిరపరైతుల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఈ 4ఏళ్లలో ఒక్కరైతుకి ఒక్కటార్పాలిన్
ఇచ్చిందిలేదు. ఒక్కరైతుకి కూడా జగన్ ఒక చిన్న పవర్ స్ప్రేయర్ ఇచ్చిందిలేదు. నానాకష్టా లుపడి మిరపసాగు చేసిన రైతులకు అకాలవర్షాలు కన్నీళ్లే మిగిల్చాయి. పంటచేతికొచ్చే సమయానికి వానలు
పడటంతో చాలాప్రాంతాల్లో కల్లాల్లోనే మిర్చి తడిసిపోయింది. అదే విధంగా మొక్కజొన్న, జొన్నఇతర అపరాలపంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
మామిడి చేతికి వచ్చేసమయానికి నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలాప్రాంతాల్లో మామి డి, బొప్పాయి, పసుపు వంటిపంటలు బాగాదెబ్బతిన్నాయి. రైతులనష్టానికి, కష్టానికి జగన్ ఏ విధంగా న్యాయంచేస్తాడని ప్రశ్నిస్తున్నాం. రైతులకన్నీళ్లకు ముఖ్యమంత్రే బాధ్యత తీసుకో వాలి. జగన్మోహన్ రెడ్డి రైతులతాలూకా పంటలబీమాసొమ్ము సకాలంలో చెల్లించకపోవడమే నేడు రైతులకన్నీళ్లకు ప్రధానకారణం అని కన్నా పేర్కొన్నారు.
ఆ నిధి ఏమైంది?
రూ.3వేలకోట్ల ధరలస్థిరీకరణ నిధి, రూ.2వేలకోట్ల ప్రకృతి విపత్తులసహాయ నిధి ఏమైందో ముఖ్యమంత్రి రైతులకు చెప్పాలి అని కన్నా డిమాండ్ చేశారు.
రూ.3వేలకోట్లతో ధరలస్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానన్న తనహామీ ఏమైందో కూడా జగన్ రైతాంగానికి సమాధానంచెప్పాలి. ప్రకృతివిపత్తులు వచ్చి రైతుల నష్టపోయినప్పుడు వారిని ఆదుకునేందుకు ఏటా రూ.2వేలకోట్లతో విపత్తులసహాయనిధి ఏర్పాటుచేసి, అన్నదాతల్ని ఆదుకుంటానని జగన్ తనపార్టీ మేనిఫెస్టోలో చెప్పాడు. ఆ హామీ ఏమైందని ఆయన్ని ప్రశ్ని స్తున్నాం. రైతురోడ్డునపడినా కూడా ముఖ్యమంత్రికి తనహామీలు, వాగ్ధానాలు గుర్తురాకపోవ డం బాధాకరం.
గతంలో రైతుబంధు పథకంకింద రైతులుపండించిన ఉత్పత్తుల్ని మార్కెట్ యార్డ్ ల్లో నిల్వచేసుకునే సదుపాయం ఉండేది. ఆవిధంగా నిల్వచేసుకొని, మంచిధర వచ్చినప్పుడు వారు తమఉత్పత్తుల్ని అమ్ముకునేవారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఆ పథకాన్ని జగన్ ఎత్తేశాడు. నేడు రాష్ట్రంలో రైతు పూర్తిగా నష్టపోవడానికి నూటికినూరు శాతం జగన్మోహన్ రెడ్డే కారణమని కన్నా ధ్వజమెత్తారు.
చంద్రబాబు పర్యటించాకే ….
“టీడీపీఅధినేత చంద్రబాబుగారు గోదావరి జిల్లాల్లో వరిరైతులవద్దకు వెళ్లి, వారికష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆయనపర్యటనలో రైతుల్ని ఆదుకోలేని ప్రభుత్వడొల్లతనం, జగన్మోహన్ రెడ్డి చేతగానితనం
మరోసారి బట్టబయలయ్యాయి. చంద్రబాబుగారు రైతులవద్దకు వెళ్లకుండా ఉంటే, అసలు ఈముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు కనీసం నోటిమాటగాకూడా రైతుల ప్రస్తావనచేసేవారు కాదు. ఏంచేసినా చేయకపోయినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చాలు ఆదాయం అదేవస్తుంది అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నాడు.” అని కన్నా తీవ్రస్థాయిలో విమర్శించారు.
టిడిపి డిమాండ్ లు ..
రాష్ట్రప్రభుత్వానికి టిడిపి తరపున చేస్తున్న డిమాండ్ లను కన్నా విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
1. ధాన్యం కొనుగోళ్లలో తేమపేరుతో 75కిలోల ధాన్యంబస్తాకు 5 నుంచి 12కిలోల ధాన్యా న్ని అదనంగా సేకరిస్తున్నారు. ఆ విధంగా సేకరిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వమే తిరిగి రైతుకు ఇప్పించాలి.
2. మిల్లరు లారీ ధాన్యానికి వసూలుచేస్తున్న రూ.10వేలనుంచి రూ.20వేల సొమ్ముని వసూలుచేయకుండా చూడాలి. ఇప్పటికే వసూలుచేసినసొమ్ముని ప్రభుత్వం తిరిగి రైతులకు చెల్లించాలి.
3. రాష్ట్రంలోని ప్రతిధాన్యం గింజను ప్రభుత్వమే గిట్టుబాటుధరకు కొనాలి.
4. అపరాల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేలు, వాణిజ్యపంటల రైతులకు ఎకరాకు రూ.50వేలపరిహారం ఇవ్వాలి.
5. పంటల్ని కాపాడుకునేక్రమంలో పిడుగుపాటుకుగురై, ఇతరత్రాకారణాలతో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాల్ని ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల పరి హారంఇవ్వాలి.
6. తమకష్టం చెప్పుకోవడానికి వెళ్లిన రైతుల్ని ఎర్రిపప్ప అని తూలనాడిన మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. మంత్రి రైతుల్ని అవమానించినందుకు నైతికబా ధ్యత వహిస్తూ, ముఖ్యమంత్రి
అన్నదాతలకు క్షమాపణ చెప్పాలి.
కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ముఖ్యమంత్రి తక్షణమే ఆదుకోవాలి. ఆయనకు ఆ పని చేయడం చేతగాకుంటే, వెంటనే పదవినుంచి తప్పుకుంటే, తెలుగుదేశంపార్టీ అన్నదాత లకు న్యాయంచేస్తుంది. అని కన్నా స్పష్టంచేశారు.