తాడేపల్లి గడప దాటకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు భరోసా ఏం కనిపిస్తారని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. మంగళవారం తణుకులో ఆయన మాట్లాడారు. రైతులకు పంట నష్టం అందజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న తణుకులో పోరుబాట యాత్ర చంద్రబాబు నాయుడు చేపట్టడం జరుగుతుందన్నారు. ఇరగవరం నుంచి తణుకు వరకు జరిగే ఈ పాదయాత్ర అనంతరం వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.
నల్లజర్ల రైతులకు పంట నష్ట పరిహారాన్ని ఇవ్వాలని కోరుతూ నల్లజర్ల తాసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం టిడిపి నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ మద్దిపాటి వెంకట రాజు హాజరయ్యారు. అనంతరం డిప్యూటీ ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఉండ్రాజవరంలో ప్రస్తుతం వర్షాలకు రైతులు ఎదుర్కుంటున్న ధాన్యం కొనుగోలు సమస్య మరియు పంట మునిగిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని ఉండ్రాజవరం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. అనంతరం వినతిపత్రం అందజేశారు.
భట్టిప్రోలులో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం భట్టిప్రోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మంగళవారం జరిగింది. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈరోజు మండల గ్రామం భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భట్టిప్రోలు మండల ఎమ్మార్వో కార్యాలయమునకు ర్యాలీగా విచ్చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాకా శేషు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, తూనుగుంట్ల సాయి బాబా, మాజీ అధ్యక్షులు కర్ణ శ్రీనివాసరావు, కుక్కల వెంకటేశ్వరరావు, వేములపల్లి జగన్నాధం, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, అనగాని ఏడుకొండలు, డోలా శివకుమార్, యడ్ల జయశీలరావు, బొర్రా సాంబయ్య, వామనపల్లి కోటేశ్వరరావు, దీపాల ప్రసాద్, పరుచూరి రఘు, వాకా వెంకట నారాయణ, భట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
కొల్లూరులో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని జాతీయ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు మంగళవారం మండల కేంద్రం కొల్లూరు లో మాజీ ఎంపీపీ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కనగాల మధు సూదన్ ప్రసాద్ ఆధ్వర్యంలో కొల్లూరు మండల ఎమ్మార్వో కార్యాలయమునకు ర్యాలీగా విచ్చేసి ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని, ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.