టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మాదిరి పెళ్లికానుకలను పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగాగురువారం నందికొట్కూరు నియోజకవర్గం, మండ్లెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించారు.
మండ్లెం, తంగడంచ గ్రామ పొలిమేరల్లో 300 బావులు ఉన్నాయి. ఈ బావులను గతంలో ఎన్టీఆర్ తవ్వించారు.
అప్పటి నుండి మేము ఒక పంట వేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం.
నాగటూరు లిఫ్ట్ ఇరిగేషన్ నుండి మండ్లెం గ్రామ చెరువులకు నీరు నింపాలి.
రైతులకు 12 గంటలకు విద్యుత్ ఇవ్వాలి… కొత్త కనెక్షన్లు సత్వరమే ఇవ్వాలి.
మా గ్రామంలో డి.ఫారం పట్టా పొలాలకు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలి.
మండ్లెం, తంగడంచ గ్రామాల్లోని పోరంబోకు పొలాలను రైతులకు పూర్తి హక్కు ఉండేలా పట్టా పుస్తకాలు అందించాలి.
మండ్లెం గ్రామం నుండి లక్ష్మాపురం తారు రోడ్డు వేయాలి. మండ్లెం నుండి కొణిదెలకు మెటల్ రోడ్డు వేయాలి.
చంద్రన్న పెళ్లి కానుకలు ఎస్సీలకు లక్షన్నర, బీసీ, మైనారిటీలకు లక్ష చొప్పున అందించాలి.
మహిళలకు చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు 75శాతం రాయితీ ఇవ్వాలి.
డిగ్రీ చదివిన వారికి భృతి అందించాలి.
ఎస్సీ వర్గీకరణ చేసి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి అని వారు విజ్ఞప్తి చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టిన జగన్, రైతుల మోటార్లకు మీటర్ల పెట్టి ఉరితాడు బిగించాలని చూస్తున్నాడు.
టిడిపి అధికారంలోకి వచ్చాక రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగు,తాగునీరు అందజేస్తాం.
యేటా జాబ్ కేలండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ మోసం చేయడంతో యువత పెడతారి పట్టే ప్రమాదం పొంచి ఉంది.
ఇప్పటికే పలువురు గంజాయి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.
టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగుపర్చి నిరుద్యోగాన్ని అరికడతాం.
డి.ఫారం పట్టాలకు రిజిస్ట్రేషన్ అంశాన్ని..కర్నాటక రాష్ట్ర విధానాలను పరిశీలించి పరిష్కరిస్తాం.
మహిళలకు ప్రోత్సాహకాలు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.
ఎస్సీల సామాజిక న్యాయానికి టిడిపి కట్టుబడి ఉంటుంది అని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.