న్యాయం ఎలా చేయాలో చూపిస్తా
రైతుల వద్దకు సిఎం ఎందుకు రారు?
ఎర్రిపప్పా అన్న మంత్రి నోరు మూయించటానికే పోరుబాట
నోరు మూయాల్సింది సిఎం, మంత్రులే
గతంలో తుఫాను వచ్చినప్పుడు రాజమండ్రిలో సచివాలయం పెట్టాను
రైతులతో చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం
……
అకాల వర్షాల కారణంగా పంటంతా కోల్పోయిన రైతాంగానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటాను. న్యాయం చేయమని చెప్పటమే కాదు. ఈ విధంగా చేయాలో చేసి చూపేందుకు నేనే వచ్చా. అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం లో గురువారం రాత్రి రైతులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెప్పారు. రైతుల వద్దకు ముఖ్యమంత్రి ఎందుకు రావటం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి ఎర్రి పప్పా, బుజ్జి నాన్నా అంటూ రైతుల్ని నోరు మూయాలని తిట్టారు. నోరు మూయాల్సింది ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యే లేనని చంద్రబాబు విమర్శించారు.
రైతుల్ని నోరు మూయమన్న మంత్రి నోరు మూయించటానికే రైతు పోరుబాట తలపెట్టినట్టు చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు నష్టపోయారని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఇప్పుడు నాకు అధికారం లేదు. నాకు అధికారం వుంటే మీరు పండించిన ధాన్యాన్ని ఇక్కడే కొనుగోలు చేసేవాడిని అని చంద్రబాబు చెప్పారు. రైతులందరికీ తక్షణమే నష్ట పరిహారం చెల్లించే విధంగా చర్యలు చేపట్టే వాడినన్నారు. విశాఖలో హుదూద్ వచ్చినప్పుడు అక్కడే పదిరోజులు వున్నాను. తిత్లీ తుఫాను సమయంలోనూ అందరూ విరామం లేకుండా పనిచేశారని చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం రైతుల పంట అంతా పొలాల్లోనే ఉన్నదన్నారు. పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారో సిఎం చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏమాత్రం వదలి పెట్టినా తప్పించుకుంటారు అని చంద్రబాబు రైతుల్ని హెచ్చరించారు.
ఎన్నికలకు ముందు జగన్ రైతులకు చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తోంది ఏంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. ధాన్యం ఏమిల్లుకు వెళ్లాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మొదట్లో మిల్లు ఆడించడానికి బస్తాకు కొంత మొత్తం తీసుకున్నారు. ఇప్పుడు లెక్కలో చూపకుండా అదనంగా తూకం వేయిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తుఫాను వచ్చిన సమయంలో రాజమండ్రిలో సచివాలయం పెట్టి సహాయ చర్యలు చేపట్టాను. నాయకుడు అంటే కష్టం వచ్చినప్పుడు నిలబడాలి అని వివరించారు. ఈ ప్రభుత్వం మన పంటలకు ఎందుకు బీమా కట్టలేదు. దీనికి సమాధానం లేదు. దీంతో పరిహారం వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎందుకు రైతు వద్దకు రాలేదో చెప్పాలి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ధాన్యం కొంటున్నామని కబుల్లు చెబుతున్నారు అని విమర్శించారు.
సైకోలకు మందు నాదగ్గర వుంది
తాడేపల్లిలో ఒక పిచ్చోడు ఉన్నాడు. అతనొక సైకో. సైకో లకు మందు నా దగ్గర ఉంది, వాళ్లకు ట్రీట్మెంట్ చేసే బాధ్యత నాది. ఏడాదిలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు వైసీపీ నేతలు, సైకో ఎక్కడికి పోవాలో చూసుకోండి అని చంద్రబాబు హెచ్చరించారు. సిఎం ఇడుపుల పాయ పోతాడా? చంచల గూడ జైలుకు పోతాడా? చూడాలన్నారు. రైతును మోసం చేస్తే చర్యలు తీసుకుంటాం అని ప్రభుత్వం చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అదనంగా వసూలు చేస్తున్న 2 కేజీలు ఎవరి ఖాతాలో పోతుంది? తాడేపల్లి ప్యాలెస్ కే కదా? అని ప్రశ్నించారు.
గతంలో రైతులు తమకు నచ్చిన మిల్లువద్దకు ధాన్యం తీసుకువెళ్లేవారు. కానీ ఇప్పుడు కొత్త విధానం వల్ల ప్రభుత్వం చెప్పిన మిల్లుకే ధాన్యం తోలాల్సి వస్తుంది. దీని వల్ల రవాణా భారం రైతులపై పడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చైతన్య వంతులు కావాలి. ఎకరాకు రూ.10 వేలు పోతుంది. ఈ డబ్బు అంతా ఎవరు తింటున్నారు. రైతులు నాశనం అవుతున్నాడు, జగన్ మాత్రం రైతుల దగ్గర కమీషన్లు తీసుకుని ఆనందంగా ఉన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో మళ్లీ రేపు జగన్ ఓట్లు కొంటాడు అని హెచ్చరించారు.
హోదా కోసమే విబేధించా
నాడు ప్రత్యేక హోదా ఇవ్వలేదనే బిజెపితో విభేదించాను. హోదా కోసం పోరాడాను. అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్షానికి కనీసం మైక్ కూడా ఇవ్వడం లేదు. అందుకే దాన్ని కౌరవ సభ అని అన్నాను. బయటకు వచ్చాను. గౌరవ సభగా చేసే అసెంబ్లీకి అడుగు పెడతా అని చంద్రబాబు వెల్లడించారు. సైకో జగన్ ని చూసి ఊరికొక సైకో తయారయ్యారు. రాష్ట్రానికి విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ విద్వంస పాలనతో జరిగిన నష్టమే ఎక్కువ. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు, అమరావతిని నిర్వీర్యం చేశారు. కౌలు రైతుల ఆత్మహ్యతల్లో ఏపీ రెండో స్దానంలో ఉంది, దీనికి సీఎం సిగ్గుపడాలి అని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశంలో ఒక రైతుపై రూ. 75 వేలు తలసరి అప్పుంటే మన రాష్ట్రంలో ఒక్కో రైతుపై రూ.2.40 లక్షలు ఉంది. వైసీపీ ప్రభుత్వ విధానా వల్ల రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రైతులు పొలాల్లోనే ధాన్యం ఆరబెట్టుకునేందుకు సిమెంట్ కాంక్రీట్ తో కల్లాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా తయారయ్యాయన్నారు. మన సభలకు ఇబ్బందులు సృష్టించాలి అని కొందరు వైసీపీ వాళ్లు వస్తున్నారు. నేను మీటింగ్ పెడితే వైసీపీ కార్యకర్తలను పంపి మీటింగ్ ను చెడగొట్టే ప్రయత్నం చేశారు అని ఆరోపించారు.
జగన్ సిఎం స్ధానంలో ఉన్నాడు కాబట్టి తిరగాలి అంటున్నా. అప్పుడు అధికారులు కదులు తారు. సాయం అందుతుందన్నారు. ముఖ్యమంత్రికి మానవత్వం లేదా? రైతుల ఇబ్బందుల్లో ఎందుకు రాడు ? నేను రాకపోయి ఉంటే ప్రభుత్వం రైతుల మోహం చూసేదా? అని ప్రశ్నించారు. భయపడితే మనమే నష్టపోతాం, ప్రజలల్లో చైతన్యం రావాలి, సైకో భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.