అటవీ ప్రాంతంలో నారా లోకేష్ ని కలిసిన సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ ప్రతినిధులు. ఇండియా వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ సొసైటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇమ్రాన్ సిద్ధిఖీ, సీనియర్ జర్నలిస్ట్ పులిపాక బాలు.
అటవీ ప్రాంతంలో నడుస్తూ పులుల సంరక్షణకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
ఇమ్రాన్ సిద్దిఖీ, పులిపాక బాలు మాట్లాడుతూ సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం అయినందుకు కృతజ్ఞతలు. పులుల సంరక్షణ కోసం ఎంతో కాలంగా మేము కృషి చేస్తున్నాం. భావి తరాలకు ప్రకృతి ని అందించాలి అనే లక్ష్యంతో మేము పని చేస్తున్నాం. బెటర్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అనే కాన్సెప్ట్ తో అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటమే లక్ష్యంగా అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో టైగర్ ఏకో టూరిజం సర్క్యూట్స్ అభివృద్ది చెయ్యడం ద్వారా అడవులు, పులుల సంరక్షణ కోసం ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు వలన అటవీ ప్రాంతాల్లో నివసించే వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటానికి అనేక ప్రోటోకాల్స్ రూపొందించాలి.
అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనుల స్థితి గతులు, మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం కోసం టైగర్ ఏకో టూరిజం ఎంత గానో ఉపయోగపడుతుంది. మృగాల కారణంగా అటవీ ప్రాంతం బయట మనుషులు ఎదుర్కునే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. అటవీ ఉత్పత్తులకి ప్రత్యేక బ్రాండింగ్ తీసుకురావడం వలన అడవుల పై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మారతాయి. కర్నూలు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న నన్నారి ఉంది. దీనిని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తే స్థానికులకు ఉపయోగం ఉంటుంది.
లోకేష్ మాట్లాడుతూ
అడవులను, పులులు, ఇతర వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. అడవులు తరిగిపోవడం వలనే విపరీత వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి హయాంలో అడవుల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నాం. మియావాకి మోడల్ లో ప్రతి నియోజకవర్గం లో మినీ అడవులు తయారు చెయ్యాలి అని టిడిపి హయాంలో పైలట్ ప్రాజెక్టులు కూడా చేసాం. అరకు కాఫీ కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాం. గిరిజన్ ఉత్పత్తులను ఎంత గానో ప్రోత్సహించడం జరిగింది. నాకు అడవులు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడటం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, సింగపూర్ లాంటి దేశాలు ఏకో టూరిజం పట్ల ఎంతో శ్రద్ద పెట్టారు. నేను కుటుంబంతో కలిసి అనేక టైగర్ రిజర్వ్ ఏకో టూరిజం ప్రాజెక్టులు సందర్శించాను.
రాష్ట్రంలో టైగర్ ఏకో టూరిజం ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి అనే ఆలోచన తోనే మీతో మాట్లాడాలి అని అనుకున్నాను. ఏకో టూరిజం వలన అనేక లాభాలు ఉన్నాయి అడవులను కాపాడటం తో పాటు, పులులు, ఇతర వణ్య ప్రాణులను కాపాడుకోవచ్చు. భవిష్యత్తు తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడం లక్ష్యంగా పనిచేస్తాం. అడవులను, పులుల సంరక్షణ కోసం పనిచేస్తున్న మీలాంటి వారి సలహాలు తీసుకొని ప్రోటోకాల్స్ రూపొందించుకొని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం. సేవ్ ది టైగర్ క్యాంపెయిన్ లో మేము భాగస్వామ్యం అవుతాం. అడవుల సంరక్షణ కోసం టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే అధిక ప్రాధాన్యత ఇస్తాం. ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తాం. శ్రీశైలం టైగర్ రిజర్వ్ సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాం.