టిడిపి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటించి, టీచర్ ఉద్యోగాలు భర్తీచేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్ర సందర్భంగా సోమవారం శ్రీశైలం నియోజకవర్గం పెదదేవలాపురం శివార్లలో మిరపచేలో పనిచేస్తున్న కూలీలను కలిసిన యువనేత లోకేష్ వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు.
రైతుకూలీ మరియమ్మ మాట్లాడుతూ నా కొడుకు సునీల్ ఎంఎ చదివాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం రావడంలేదు. జగన్ ఉద్యోగాలిస్తానని మోసం చేశాడు. మీరు వచ్చాక ఉద్యోగాలు ఇప్పించాలని కోరింది.
శాంతమ్మ మాట్లాడుతూ మా పిల్లలు నలుగురు డిగ్రీ పూర్తిచేసి బి.ఇడి చదివారు, డిఎస్సీ లేకపోవడంతో ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు. మెగా డిఎస్సీతో ఉద్యోగాలివ్వాలని విన్నవించింది.
మరికొందరు మహిళా కూలీలు మాట్లాడుతూ 45ఏళ్లకే పెన్షన్ ఇస్తానని చెప్పి జగన్ మోసం చేశాడు. కొంతమందికి ఎప్పటినుంచో ఇస్తున్న పెన్షన్ తీసేశారని వాపోయారు.
పొలంపనులకు చేసుకుంటున్న తమకు గతంలో చంద్రన్న బీమా ఉండేది, జగన్ ప్రభుత్వం వచ్చాక తీసేశారని చెప్పారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యువకులు, రైతులు, రైతుకూలీలు అందరూ బాధితులే.
జగన్ మాయమాటలు నమ్మిన లక్షలాది యువత అప్పులు చేసి కోచింగులు తీసుకున్నారు.
45ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న జగన్ రాష్ట్రవ్యాప్తంగా 6లక్షల పెన్షన్లు పీకేశాడు.
టిడిపి అధికారంలోకి రాగానే జగన్ రద్దుచేసిన పెన్షన్లన్నీ పునరుద్దరిస్తాం.
వ్యవసాయ కూలీలకు చంద్రన్న బీమా వర్తింపజేస్తామని లోకేష్ వెల్లడించారు.