టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలన్నీ పునరుద్దరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రసందర్భంగా శనివారం బనగానిపల్లె నియోజకవర్గం కొత్తపేట గ్రామరైతులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. మా గ్రామంలో శనగపంట ఎక్కువగా పండిస్తాం. మా పంటలకు గిట్టుబాటు
ధర రావడం లేదు.
గత ప్రభుత్వంలో అందించిన పెన్షన్లను ఈ ప్రభుత్వం రద్దు చేసింది.
టీడీపీ పాలనలో నీరు, చెట్టు పథకం కింద పొలాల్లో రస్తా చేశారు. వైసీపీ పాలనలో పట్టించుకునేవారు లేరు.
వైసీపీ పాలనలో నాణ్యమైన కరెంటు అందడం లేదు.
టీడీపీ హయాంలో సబ్సిడీపై రైతులకు ట్రాక్టర్లు, పైపులు, స్ప్రేయర్లు, స్ర్పింక్లర్లు, డ్రిప్ అందించేవారు. నేడు రావడం లేదు.
వైసీపీ పాలనలో వివిధ సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయానికి వెళితే పట్టించుకునేవారు లేరు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్యలపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రైతులేని రాజ్యంగా ఏపీని మార్చేస్తున్నాడు.
జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా దేశంలోనే ఏపీ రైతులు ఆత్మహత్యల్లో 3వస్థానంలో నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సగటు అప్పు రూ.70వేలు ఉంటే, ఇప్పుడు 2.5లక్షలకు చేర్చి, జాతీయస్థాయిలో అప్పుల్లో మొదటి స్థానానికి చేర్చాడు.
వైసీపీ అధికారంలోకి వస్తే ధరల స్థిరీకరణ నిధి రూ.3,500కోట్లు ఏర్పాటు చేస్తామన్న హామీని జగన్ గాలికొదిలేశాడు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి, వ్యవసాయ పెట్టుబడులను తగ్గిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.