జగన్ నాలుగేళ్ల పాలనపై.. టీడీపీ మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. ప్రజలకు ఏదో మేలు చేస్తానని.. సంక్షేమ ఫలాలు అందిస్తున్నానని జగన్ రెడ్డి మాయ మాటలు చెబుతున్నారని నక్కా ఆనందబాబు అన్నారు. సంక్షేమం పేరుతో.. రాష్ట్రాన్ని దోచుకోవడానికే.. జగన్ రెడ్డి.. బటన్ నొక్కుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. జగన్ కేవలం బటన్ నొక్కడమే కాదు .. ఆ నిధులనూ.. బొక్కుతాడని అన్నారు. చివరకు ఇసుకను కూడా సీఎం వదిలిపెట్టడం లేదని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటే నియోజకవర్గాలను వైసిపి ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారని ఆనంద్ బాబు ఆరోపించారు.
బాపట్ల జిల్లా వేమూరులో జరిగిన “ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి ” కార్యక్రమ ముగింపు బహిరంగ సభ జరిగింది. ఆ సభకు ముఖ్య అతిథిగా నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టిడిపిని గెలిపించడానికి ప్రజలు సిద్దంగా వున్నారని నక్కా ఆనందబాబు అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం కూడా ఆనందంగా లేదని… 2019లో.. నమ్మి ఓట్లేసిన ప్రజలందరికీ.. జగన్ నమ్మకద్రోహం చేశాడన్నారు. 2024 రానున్న ఎన్నికల్లో వైసిపిని చిత్తు చిత్తుగా ఓడించాలని.. ప్రజలకు నక్కా ఆనందబాబు పిలుపు నిచ్చారు.
ఇంటి, వృత్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపడమే కాదు.. చివరకు చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సిఎం జగన్ రెడ్డి అంటూ నక్కా ఆనందబాబు మండిపడ్డారు. మరుగుదొడ్ల మీద కూడా పన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అంటూ ఎద్దేవా చేసారు. జగన్ ప్రజలకు ఇచ్చింది నవరత్నాలు కాదు.. నవ మోసాలు అని ఆనంద్ బాబు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్ హామీ.. ఏమైందన్నారు. అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు .. చేరుతున్నాయని.. పేదల రక్తం తాగే జలగ జగన్ రెడ్డి అంటూ ఆనంద్ బాబు మండిపడ్డారు.
దేశంలోని ఏ రాష్ట్రానికైనా.. ఒక్కటే రాజధాని ఉంటుంది… మూడు రాజధానుల పేరుతో.. జగన్నాటకాలు ఆడుతున్నరని.. నక్కా ఆనందబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరిట.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూశాడన్నారు. అందుకే ఇప్పుడు పేదలు, ధనికులు అంటున్నారని.. నక్కా ఆనందబాబు విమర్శించారు. రూ.9 లక్షల కోట్ల అప్పుచేసి .. ఆంధ్రప్రదేశ్ ను.. దివాళా తీయించారని.. ఈ అప్పులన్నీ ఎవరు కట్టాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా .. వైసీపీ నేతల అవినీతి తాండవం చేస్తోందని.. జగన్ దుర్మార్గ పాలన పోవాలంటే .. టీడీపీ రావాలన్నారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అని యువత కోరుకుంటున్నారని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆపేదే లేదని.. మరింత మెరుగైన సంక్షేమం ఇస్తామని.. మాజీ మంత్రి ఆనంద్ బాబు అన్నారు.