• బద్వేలు నియోజకవర్గం రాజుపాలెం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి, సుబ్బారెడ్డి అనే రైతులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలోని 6.50ఎకరాల భూమిలో మేము 20ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నాం.
• వాటిని తొలగించాలంటూ గత ఏడాది ఆగస్టులో అర్థరాత్రి 40మంది మా పొలంలోకి వచ్చారు.
• మాపై కర్రలు, పెట్రోల్ తో దాడి చేయడానికి ప్రయత్నం చేసి, భౌతిక దాడికి పాల్పడ్డారు.
• గాయాలతో మేం ఆసుపత్రికి వెళితే, పోలీసులు మమ్మల్ని బలవంతంగా స్టేషన్ కు తరలించారు.
• మాపై దాడిచేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
• రెవెన్యూ, పోలీసు అధికారులు పక్షపాత వైఖరితో మాకు అన్యాయం చేశారు.
• మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం చేయండి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది.
• రాష్ట్రంలో ప్రజల ఆస్తులు, మాన,ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.
• వైసిపి గూండాల పెట్రేగిపోతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
• బాధితులపైనే ఎదురుకేసులు పెట్టడం వైసిపి ప్రభుత్వం ప్రత్యేకత.
• టిడిపి అధికారంలోకి వచ్చాక వైసిపి రౌడీ మూకలను ఉక్కుపాదంతో అణచివేస్తాం.
• ప్రజలను భయబ్రాంతులను చేసే అసాంఘిక శక్తులను గ్రామాలనుంచి బహిష్కరించి, కఠినచర్యలు తీసుకుంటాం.