• సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట నక్కల సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• మేము ఎస్టీ నక్కల సామాజికవర్గానికి చెందిన వాళ్లం.
• మేం నాయుడుపేట పట్టణ ప్రభుత్వ స్థలంలో 40ఏళ్లుగా ఉంటున్నాం.
• వైసీపీ పాలనలో మాపై దాడులు చేసి, రోడ్డమీదకు ఈడ్చారు.
• గిరిజనులమైన మాకు బ్రతకడమే కష్టతరంగా మారింది.
• మీరు అధికారంలోకి వచ్చాక మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.
• మాకు రాజకీయ పదవుల్లో ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నాం.
నారా లోకేష్ స్పందిస్తూ…
• వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు ఎస్సీ, ఎస్టీలపైనే ఈ ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే నక్కల సామాజికవర్గీయులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• నక్కల సామాజికవర్గీయులు చిరువ్యాపారులు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందజేస్తాం.
• ఎస్సీ, ఎస్టీలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.