సూళ్లూరుపేట యూత్ పవర్ సూపర్. చెంగాళమ్మ దేవాలయం ఉన్న పుణ్య భూమి సూళ్లూరుపేట స్పేస్ రీసెర్చ్ లో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇక్కడ ఉంది. నేలపట్టు లో పక్షులు, పులికాట్ సరస్సు లాంటి ప్రకృతి అందాలు సూళ్లూరుపేట సొంతం. పవిత్ర నేల సూళ్లూరుపేట గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం… మనగళం… ప్రజాబలం. యువగళం దెబ్బకి సైకో షేక్ అయ్యాడు. యువగళం ప్రారంభం అయ్యి 137 రోజులు అయ్యింది. ఈ 137 రోజుల్లో జగన్ అర డజన్ కార్యక్రమాలు ప్రకటించాడు. ఏదీ సక్సెస్ కాలేదు. మా నమ్మకం నువ్వే కార్యక్రమం అన్నాడు. తల్లి, చెల్లి నమ్మని వాడిని మేము ఎలా నమ్ముతాం అంటూ ప్రజలు ఛీ కొట్టారు. వెంటనే స్కీం మార్చాడు మా భవిష్యత్తు నువ్వే కార్యక్రమం స్టార్ట్ చేసాడు. ప్రతి ఇంటికి స్టిక్కర్లు అతికించాడు. నాలుగేళ్లుగా ఈయన పీకింది ఏమి లేదని ఆ స్టిక్కర్లు ప్రజలు పీకి డ్రైనేజ్ లో పడేసారు. అది ఫెయిల్ అయ్యే సరికి జగన్ కి చెబుదాం అని కొత్త కార్యక్రమం ప్రకటించాడు.
నాలుగేళ్లుగా చెప్పి చెప్పి అలిసిపోయాం ఇక చెప్పేది ఏమీ లేదు అంటూ జనాలు చెప్పులు చూపించారు. అదీ ఎత్తిపోయింది. అప్పుడు గడప గడపకు ప్రభుత్వం అన్నాడు. గడప గడప కు వెళ్లిన ఎమ్మెల్యేలు, జనాలు జగన్ ని తిట్టే తిట్లు వినలేక పారిపోయారు. అది సక్సస్ కాలేదు ఇప్పుడు సురక్ష కార్యక్రమం మొదలుపెట్టాడు. 99 శాతం హామీలు నెరవేర్చాను, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి అని బిల్డప్ ఇచ్చాడు. నాలుగేళ్లు కాలక్షేపం చేసి ఇప్పుడు కొత్తగా లబ్దిదారులను గుర్తిస్తాం అనడం మోసం కాదా? ఫైనల్ గా వై ఏపీ నీడ్స్ సైకో అని ఇంకో కొత్త కార్యక్రమం ప్రకటించాడు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే అర గుండు కొట్టాడు. ఇంకో ఛాన్స్ ఇస్తే పూర్తిగా రాష్ట్రానికి గుండు కొడతాడు అని భయపడి ప్రజలు వీ డోంట్ నీడ్ సైకో అంటున్నారు. ప్రజలు సైకో పోవాలి… సైకిల్ రావాలి అంటున్నారు. జగన్ భయపడుతున్నాడు, జగన్ టెన్షన్ లో ఉన్నాడు, జగన్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అందుకే లోకేష్ పై కోడిగుడ్డు వెయ్యమని సైకో సైన్యాన్ని పంపాడు. కోడి గుడ్డు వేసిన సైకో సైన్యానికి ఆమ్లెట్ వేసి పంపారు మన పసుపు సైన్యం. క్లేమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాది కోడిగుడ్డు కి భయపడతామా? జగన్ కార్యక్రమాలకి జనం రావడం లేదు. అన్ని కార్యక్రమాలు ఫెయిల్ అవుతున్నాయి. అందుకే జగన్ వారానికో కొత్త స్టిక్కర్ అతికిస్తున్నాడు.
జగన్ ఏపీని పాత బీహార్ లా మార్చేసాడు. గంటకో మర్డర్..పూటకో రేప్. 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తే సీఎం స్పందించలేదు. అమర్నాధ్ గౌడ్ చేసిన తప్పేంటి? తన అక్కని వేధిస్తున్న వైసిపి కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి ని అడ్డుకున్నాడు. వైసిపి సైకో గ్యాంగ్ అమర్నాధ్ పై దాడి చేసి కాళ్ళు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. అమర్నాధ్ గౌడ్ బీసీ కాబట్టే జగన్ కుటుంబాన్ని పరామర్శించాడనికి కూడా వెళ్లలేదు. బీసీలు అంటే జగన్ కి చిన్నచూపు. ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన జగన్ తాను తియ్యబోయే సినిమా పై రామ్ గోపాల్ వర్మ తో సమీక్ష పెట్టుకున్నాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. అమర్నాధ్ గౌడ్ ని చంపిన వారిని కఠినంగా శిక్షిస్తాం. చంద్రబాబు గారిది పోలవరం రేంజ్… జగన్ ది పిల్ల కాలువ రేంజ్. బాబు అంటే బ్రాండ్… జగన్ అంటే జైలు. సీబీఎన్ అంటే డెవలప్మెంట్… జగన్ అంటే డిస్ట్రక్షన్. బాబు గారిని చూస్తే కియా గుర్తొస్తుంది… జగన్ ని చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్.
బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. జగన్ దొంగ చూపులు చూసేది వంద కొట్టేయడం కోసమే. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి. జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.
అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి ముంచేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్ లాంటి జే బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తా అని మోసం చేసాడు. మీ కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం.
మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ముగ్గురు పిల్లలు ఉంటే రూ.45 వేలు.3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ యువత కు అనేక హామీలు ఇచ్చి చీట్ చేసాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం.
జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మీటర్లు పెడుతున్నాడు. మీటర్లు రైతులకు ఉరితాళ్లు. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. సబ్సిడీ లో డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. జీతం ఒకటో తారీఖున వచ్చే దిక్కు లేదు.
పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, విధుల్, కుర్చీలు లేని కార్పొరేషన్లు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.
డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డ్రైవర్ సుబ్రమణ్యం వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం. జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. బిజెపి తో పొత్తులో ఉన్నా మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట వేసింది టిడిపి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం. రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.
సింహపురి లో నేను సింహం లా అడుగుపెట్టాను. యువగళం కి వస్తున్న ప్రజాదరణ చూసి పిల్ల సైకోలు రోడ్ల మీదకి వచ్చి మొరుగుతున్నారు. 2014 లో మాకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టిడిపి కి మూడు సీట్లే ఇచ్చారు. అయినా నెల్లూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసాం. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, టిడ్కో ఇళ్లు నిర్మించాం. ఒక్క నెల్లూరు సిటీ ని అభివృద్ధి చెయ్యడానికే 4,500 కోట్లు ఖర్చు చేసాం. ఇది నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్. నెల్లూరు సిటీ లో వెయ్యి కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తే. నాలుగేళ్లలో 100 కోట్లు ఖర్చు చేసి పూర్తి చెయ్యలేని వేస్ట్ ప్రభుత్వం మీది. ఒక్క నెల్లూరు టౌన్ లోనే 17 వేల టిడ్కో ఇళ్లు కట్టాం. నెల్లూరు బ్యారేజ్ 90 శాతం, సంగం బ్యారేజ్ 70 శాతం, ఎస్ఎస్ కెనాల్ పనులు ప్రారంభించాం. కోపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న 70 వేల ఎకరాల్లో రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చాం. తెలుగుగంగ ప్రాజెక్టు కింద 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే అటవీ అనుమతులు లేక కేవలం లక్ష ఎకరాలకు మాత్రమే సాగునీరు అందేది. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం తో పోరాడి అటవీ అనుమతులు తీసుకోని అదనంగా జిల్లాలో మరో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం.
టిడిపి హయాంలో నెల్లూరు జిల్లాకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. 73 పరిశ్రమలు వాటి ద్వారా 18 వేల కోట్ల పెట్టుబడి, 32 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. గమేషా విండ్ టర్బైన్స్, ధర్మల్ పవర్ టెక్, సీపీ ఆక్వాకల్చర్, ఫెడోరా సీ ఫుడ్స్, అంజని టైల్స్, ఇండస్ కాఫీ ప్రై.లి, సౌత్ ఇండియా కృష్ణా ఆయిల్ అండ్ ఫాట్స్ ప్రై.లి, జెల్ కాప్స్ ఇండస్ట్రీస్, యూపీఐ పాలిమర్స్, పిన్నే ఫీడ్స్, బాస్ఫ్ ఇండియా లి., దొడ్ల డెయిరీ, పెన్వేర్ ప్రొడక్ట్స్ ప్రై.లి, అమరావతి టెక్స్ టైల్స్,అరబిందో ఫార్మా, ఓరెన్ హైడ్రోకార్బోన్స్ లాంటి ఎన్నో కంపెనీలు వచ్చాయి. నెల్లూరు జిల్లా కి చంద్రబాబు గారు చేసింది జగన్ చెయ్యాలంటే నాలుగు జన్మలెత్తాలి. 2019 లో ప్రజలు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 కి 10 సీట్లు వైసిపి కి ఇచ్చారు. ఈ పది మంది ఎమ్మెల్యేలకు ఛాలెంజ్ చేస్తున్నా మీరు చేసిన అభివృద్ది, తెచ్చిన కంపెనీ ఒక్కటి ఉంటే చెప్పండి. నెల్లూరు జిల్లా ని వైసిపి నేతలు నాశనం చేసారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్, క్రికెట్ బెట్టింగ్ మాఫియాలకు అడ్డాగా మార్చేసారు. మూడు కీలక పోస్టులు నెల్లూరు జిల్లాకి వచ్చాయి.
హాఫ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఇరిగేషన్ మంత్రి అయ్యాడు. ఆయనకి పని తక్కువ తక్కువ… డైలాగులు ఎక్కువ. జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసాడా? ఈ సిల్లీ బచ్చా నాకు ఛాలంజ్ చేస్తాడట. నీ సీటు జగన్ ఆల్రెడీ చింపేసాడు బ్రదర్. చర్చ అంటూ సరదా పడుతున్నాడు అంట. రా..రా..రా వచ్చేయ్. నాయుడుపేటలోనే తిరుగుతున్నా. ఇక్కడే నువ్వు దోపిడీ సొమ్ము, బినామీల పేరుతో వేసిన రూ.100 కోట్ల అక్రమ లే అవుట్ ఉంది కదా. షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న నీ వంద కోట్ల లే అవుట్ లో చర్చించుకుందాం. చర్చకి జగన్ ని కూడా తీసుకురావాలి. భయం మా బయోడేటా లో లేదు… జగన్ లా నేను పరదాలు కట్టుకొని తిరగడం లేదు. దమ్ము, ధైర్యం తో ప్రజల్లో తిరుగుతున్నా. జగన్ ని కూడా చర్చకి తీసుకొచ్చి దమ్ముంటే నీకు సీటు ఉందని చెప్పించు. కోర్టు దొంగ వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాడు. ఆయన 8 కేసుల్లో నిందితుడు. రైతుల సమస్యలు పట్టించుకోడు.
కల్తీ మద్యం మీద ఆయనకి ఫుల్లు అవగాహన ఉంది. కల్తీ విత్తనాల మీద అవగాహన లేదు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే ఈయన కల్తీ లిక్కర్ తయారీ లో బిజీగా ఉంటాడు. ఈయన వలన జిల్లాలో ఒక్క రైతుకి న్యాయం జరగలేదు. ఇక మరో కీలక శాఖ పరిశ్రమల శాఖ మంత్రిగా గౌతమ్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆయన మన మధ్య లేరు. పాపం ఆయన కంపెనీలు తేవాలి అని ప్రయత్నం చేసినా జగన్ పరిపాలన చూసి ఎవరూ రాలేదు. నెల్లూరు జిల్లా కి ఒక్క పరిశ్రమ రాలేదు. మూడు కీలక శాఖలు నెల్లూరు జిల్లాకి వచ్చింది గుండు సున్నా. 2019 లో వైసిపి ఇచ్చిన పది సీట్లు మాకు ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తాం. 2019 ఎన్నికల్లో సూళ్లూరుపేటని సూపర్ గా అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీ తో సంజీవయ్య గారిని గెలిపించారు. సూళ్లూరుపేట ఏమైనా మారిందా? మీ జీవితాలు మారాయా? ఒక్క సమస్య అయినా పరిష్కారం అయ్యిందా? నియోజకవర్గం లో ఒక్క దళితుడి జీవితం అయినా బాగుపడిందా? అక్రమ ఇసుక రవాణా, గ్రావెల్ దందా, అక్రమ బియ్యం రవాణా, లిక్కర్ దందా, గంజాయి, క్రికెట్ బెట్టింగ్ కి సూళ్లూరుపేట ని అడ్డాగా మార్చేసారు సంజీవయ్య గారు. ఆయన్ని నియోజకవర్గం లో ముద్దుగా కమల్ హాసన్ అని పిలుస్తారట. బయట నటన అంత బాగుంటుంది అంట. కానీ ఇంట్లోకి వెళ్లగానే అపరిచితుడు లా మారిపోయి ఇచ్చిన హామీలు అన్ని మర్చిపోతారట. సుళ్లూరుపేట కమల్ హాసన్ గారి నటనకి పడిపోయి అప్పులు చేసి మరీ 2 సార్లు గెలిపించుకున్న కార్యకర్తలు, నాయకులు గెలిపించుకున్నారు. ఇప్పుడు ఆయన నిజస్వరూపం తెలుసుకొని అందరూ జంప్ అవుతున్నారు.
సంజీవయ్య గారి అనుచరుడు అనిల్ కుమార్ రెడ్డి క్రికెట్ బెట్టింగ్, గంజాయి మాఫియాని నడుపుతున్నాడు. ఇతను గతంలోనే క్రికెట్ బెట్టింగ్ లో 6 నెలలు జైల్లో ఉన్నాడు. సూళ్లూరుపేట కమల్ హాసన్ గారు అనుచరులతో కలిసి శ్రీ సిటీ బార్డర్ లో పేకాట క్లబ్బులు కూడా నిర్వహిస్తున్నారు. సూళ్లూరుపేట కమల్ హాసన్ కరోనా ని కూడా క్యాష్ చేసుకున్నారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్ ల్లో ఉన్న కంపెనీల దగ్గర డబ్బులు వసూలు చేసి మింగేసారు. సూళ్లూరుపేట కమల్ హాసన్ సొంత రైస్ మిల్లు నుండే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. స్వర్ణముఖి, కాళింగనది ని ఏటిఎస్ లా ఎనీ టైం శాండ్ గా మార్చుకున్నారు. ఇసుక ను అక్రమంగా తమిళనాడుకి తరలిస్తున్నారు. శిరసనంభేడు కొండ కి గుండు కొట్టారు. కోట్ల రూపాయల గ్రావెల్ దోచేసారు. జగన్ జే బ్రాండ్లు దింపితే సూళ్లూరుపేట కమల హాసన్ కే బ్రాండ్లు దింపాడు. కర్ణాటక మద్యం తెచ్చి అనుచరులు అమ్మేస్తున్నారు. అనుచరుడి బార్ కోసం ఏకంగా జగన్ లిక్కర్ షాపులనే మూయించేసాడు సూళ్లూరుపేట కమల హాసన్ నియోజకవర్గం లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలి అన్నా సూళ్లూరుపేట కమల హాసన్ కి కప్పం కట్టాల్సిందే. కాంట్రాక్టర్లు పర్శంటేజి ఇవ్వాల్సిందే. నాయుడుపేట లో హాఫ్ నాలెడ్జ్ మాజీ మంత్రి, బెట్టింగ్ రాజు రూప్ కుమార్ తో కలిసి 100 కోట్లు విలువ చేసే అక్రమ లే అవుట్లు వేసారు.
సూళ్లూరుపేట ముంపు ప్రాంతాల్లో కరెంట్ పోల్స్ సైతం మునిగిపోయే ప్రాంతాల్లో అక్రమ లే అవుట్లు వేస్తున్నారు. పులికాట్ సరస్సులో తెలుగు జాలర్ల పై దాడులు చేస్తుంటే కనీసం పట్టించుకోలేదు. పైగా న్యాయం చెయ్యమని అడిగిన మత్స్యకారులను కుక్కలతో పోల్చి అవమానించాడు సూళ్లూరుపేట కమలహాసన్. కాళంగి, స్వర్ణముఖి నదులు ఉన్నా నియోజకవర్గం ప్రజల దాహం తీర్చడం వీళ్లకి చేతకాలేదు. సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి గుండుసున్నా. టిడిపి హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదవారిని వేధించారు. సూళ్లురూపేటలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తామని మోసం చేసారు. కాళంగి నదిలోకి సముద్రపు బ్యాక్ వాటర్ వచ్చి నీరు ఉప్పుగా మారడంతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. సూళ్లూరుపేట నియోజకవర్గానికి జగన్ అనేక హామీలు ఇచ్చాడు. తెలుగుగంగ కాలువలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చాడు.
పులికాట్ సరస్సు లో పూడిక తీస్తామని హామీ ఇచ్చాడు. చెంగాళమ్మ దేవాలయం వద్ద కాళంగి నది పై బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈ సమస్యలు అన్ని టిడిపి ప్రభుత్వం వచ్చిన పరిష్కరిస్తాం పులికాట్ ముఖద్వారం వద్ద పూడిక తియ్యాలని మత్స్యకారులు కోరుతున్నారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూడిక తీస్తాం. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం. టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను. సూళ్లూరుపేటలో ఉన్నా సింగపూర్ పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా. సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర. తగ్గేదే లేదు… అడ్డుకోవడానికి వచ్చిన వారిని నాలుగు తన్ని పంపించాం. వెధవ పనులు చేస్తున్న వైసిపి నాయకుల్ని వదిలి పెట్టను. వడ్డీ తో సహా చెల్లిస్తాం.