లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన మహిళలు, యువత, వృద్దులు.
రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేసిన ప్రజలు.
అందరినీ ఓపికగా కలుస్తూ, ఆప్యాయంగా పలకరించి జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న లోకేష్.
విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు, నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు భారం తగ్గించాలని లోకేష్ ని కోరిన మహిళలు.
నాయుడుపేట లో స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు లోకేష్ దృష్టికి తెచ్చిన ప్రజలు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాం.
విద్యుత్ బిల్లులు జగన్ 9 సార్లు పెంచాడు. అర్దం లేని పేర్లు పెట్టి ప్రజల్ని దోచేస్తున్నాడు.
దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఏపి నంబర్ 1 గా ఉంది. అన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించినా జగన్ మనస్సు కరగలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తాం.
తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు లాంటి నాయుడుపేట స్థానిక సమస్యలు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాం.