• కావలి వైకుంఠపురం సర్కిల్ లో పట్టణ ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.
• వైకుంఠపురం వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోయాయి.
• దీంతో కావలి ట్రంక్ రోడ్డుకు వెళ్లాలంటే జనతాపేట వైపు మెయిన్ రోడ్డుకు వెళ్లాల్సివస్తోంది.
• చుట్టూ తిరిగి వెళ్లాలంటే 6కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తోంది.
• సంవత్సరాల తరబడి మేం ఈ విధంగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాం.
• మీరు అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనిని పూర్తిచేయాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధికి తావులేదు.
• రకరకాలపేర్లతో పన్నుల బాదుడు తప్ప పట్టణాల్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు.
• పట్టణాల్లో రోడ్లన్నీ గోతులమయమైన తట్టమట్టి పోసే దిక్కులేకుండా పోయింది.
• కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి ప్రభుత్వం 1.30లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టింది.
• దివాలాకోరు ప్రభుత్వాన్ని చూసి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి పనులను పూర్తిచేస్తాం.
• కావలిలో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం.