యువగళం పాదయాత్ర చారిత్రాత్మక 2వేల కి.మీ. మైలురాయి చేరుకున్న సందర్భంగా టిడిపి విభిన్న ప్రతిభావంతుల విభాగం నాయకుడు గోనుగోంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యాన యువనేత లోకేష్ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు.
దివ్యాంగులకు ఉపయోగపడే ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మిషన్లు అందజేశారు. పులివెందులకు చెందిన వీరారెడ్డికి ఈ సందర్భంగా లక్షరూపాయల ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, కావలి ఇన్ ఛార్జి సుబ్బానాయుడు తదితరులు పాల్గొన్నారు.
రూ.5వేల విరాళమిచ్చిన దివ్యాంగుడు
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్ కుమార్ రెడ్డి తమకు వచ్చే పెన్షన్ తోపాటు కొంత సొంత డబ్బు కలిపి రూ.5వేల విరాళాన్ని యువనేతకు లోకేష్ అందజేశారు. గతంలో కూడా జీవన్ పార్టీకి విరాళమిచ్చారు. 1998లో తనకు చంద్రబాబునాయుడు కాలిశస్త్రచికిత్స చేయించారని, బాబును సిఎంగా చూడాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపాడు. ఈ సందర్భంగా జీవన్ ను లోకేష్ అభినందించారు.