• కనిగిరి చెక్ పోస్టు వద్ద 12వవార్డు దళితులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
• మా వార్డులు 250 దళిత కుటుంబాలు ఉన్నాయి.
• అందరం చేతివృత్తి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం.
• మాకు జగనన్న కాలనీల్లో కేటాయించిన ప్లాట్లు రద్దు చేశారు.
• మా కాలనీకి సరైన రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
• మా కాలనీలో చనిపోయిన వారికి వాగులో అంత్యక్రియలు చేయాల్సివస్తోంది. వాగుమొత్తం ముళ్లచెట్లతో నిండి ఉంది. మీరు అధికారంలోకి వచ్చాక మాకు శ్మశానాన్ని అభివృద్ధి చేయాలి.
• మా కాలనీలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డికి దళితుల ఓట్లపై ఉన్న శ్రద్ధ వారి సంక్షేమంపై లేదు.
• దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన 27సంక్షేమ పథకాలు రద్దు చేశాడు.
• ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.28,147కోట్లు దారిమళ్లించి, తీరని అన్యాయం చేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులకు పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం.
• రోడ్లు, డ్రైనేజీలు, శ్మశాన వాటికను అభివృద్ధి చేస్తాం. అంబేద్కర్ పేరిట కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు చేపడతాం.