యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 161వరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసంద్రాన్ని తలపించింది. కనిగిరి నియోజకవర్గంలో పూర్తిచేసిన పెద్దారికట్ల శివార్లలో మార్కాపురంలోకి ప్రవేశించిన పాదయాత్రకు కనీవినీ ఎరుగనిరీతిలో ఘనస్వాగతం లభించింది. మార్కాపురం ఇన్ చార్జి కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలలతో యువనేతను సత్కరించారు. వేలాదిగా తరవచ్చిన ప్రజలతో పెద్దారికట్ల రోడ్లు కిటకిటలాడాయి. పాదయాత్ర దారిలో యువనేతను అభిమానులు పూలవర్షంతో ముంచెత్తారు. భారీ స్వాగత ద్వారాలు, బాణా సంచామోతలతో పెద్దారికట్ల హోరెత్తింది. మహిళలు హారతులు పడుతూ, దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేష్ తో ఫోటోలు దిగేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.
వివిధవర్గాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. మరో ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలను పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చి ముందుకు సాగారు. పాదయాత్రకు బయలుదేరే ముందుకు ఎర్రఓబునపల్లి క్యాంప్ సైట్ లో కమ్మసామాజిక వర్గీయులతో సమావేశమై వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. ఎర్రఓబునపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర పెద్దారికట్ల, చిన్నారికట్ల, కంభాలపాడు మీదుగా పొదిలి శివారు పోతవరం విడిది కేంద్రానికి చేరుకుంది.
161వరోజు యువనేత లోకేష్ 16.4 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2136.7 కి.మీ. మేర పూర్తయింది. శనివారం పొదిలి పాతబస్టాండులో నిర్వహించే బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగిస్తారు.