అద్దంకి మాస్ జాతర అదిరిపోయింది. రెడ్డి రాజులు పాలించిన నేల అద్దంకి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయాలు ఉన్న పుణ్యభూమి అద్దంకి. దేశం కోసం పోరాడిన ప్రకాశం పంతులు గారు నడిచిన నేల అద్దంకి. వరుసగా నాలుగు సార్లు మన పులి రవి గారిని గెలిపించిన నేల అద్దంకి. ఎంతో ఘన చరిత్ర ఉన్న అద్దంకి గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం. యువగళం.. మనగళం.. ప్రజాబలం. జగన్ బీసీల పాలిట సైతాన్ గా మారాడు. మన జయహో బీసీ కార్యక్రమం చూసి జగన్ గజ గజా వణికిపోయాడు. గల్లీ నుండి ఢిల్లీ వరకూ వైసిపి బీసీ నేతల్ని రంగంలోకి దింపి నన్ను తిట్టించాడు. సంతోషం, నన్ను తిట్టడానికైనా వైసిపి లో ఉన్న బీసీ నేతలకి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. 15 ఏళ్ల పిల్లాడు అమర్నాధ్ గౌడ్ ని కాళ్లు,చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెడితే వైసిపి బీసీ నాయకులు ఎం అయ్యారు? 5 వ తరగతి చదువుతున్న బాలిక పై అత్యాచారం జరిగితే వైసిపి లో ఉన్న బీసీ నేతలు గొంతు విప్పలేదు. జగన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్లు కట్ చేస్తే వైసిపి లో ఉన్న బీసీ నేతలు ఎక్కడ ఉన్నారు.
26 వేల మంది బీసీ ల పై అక్రమ కేసులు పెడితే వైసిపి బీసీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు? కార్పొరేషన్ల ద్వారా బీసీలకు ఒక్క రూపాయి రుణం ఇవ్వకపోయినా, బీసీ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసినా వైసిపి బీసీ నేతలు మాట్లాడలేదు. ఇప్పుడు ఏకంగా బీసీ సమాజాన్నే అవమానించాడు సైకో జగన్. బిడ్డని కోల్పోయిన ఒక తల్లిని, తమ్ముడ్ని కోల్పోయిన ఒక అక్క ని, భర్తని కోల్పోయిన భార్యని, తండ్రిని కోల్పోయిన కొడుకుని జగన్ పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానించాడు. ఆఖరికి కార్యక్రమం హోస్ట్ చేసిన బీసీ బిడ్డ ఉదయభాను గారిని కూడా ట్రోల్ చేసింది పేటీఎం గ్యాంగ్. ఆవిడ చేసిన తప్పేంటి ఒక బీసీ బిడ్డ గొంతు విప్పి మాట్లాడటం కూడా తప్పేనా? ఎవరి హయాంలో బీసీలకి న్యాయం జరిగిందో చర్చకు నేను సిద్దం వైసిపి నాయకులు సిద్దమా బీసీ బాధితులను పెయిడ్ ఆర్టిస్టులు, డ్రామా ఆర్టిస్టులు అనడానికి మనస్సు ఎలా వచ్చింది సైకో జగన్. జగన్ ది సిగ్గులేని జన్మ. ఒక్క బీసీ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఒక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించావా? బీసీల జోలికి ఎవ్వడైనా రావాలి అంటే భయపడేలా చేస్తా. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం. మీకో చిన్న క్విజ్ పెడతాను. జగన్ రోజూ ఎం తింటాడు? ఆప్షన్1. బిర్యానీ, ఆప్షన్2. అన్నం. ఆప్షన్3. ఇసుక.
పందికొక్కులా ఇసుక తింటుంది ఎవరు? జగన్. టిడిపి హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత రూ. 1500, జగన్ హయాంలో ట్రాక్టర్ ఇసుక ఎంత రూ.5000. రోజుకి ఇసుక దోపిడీ లో జగన్ వాటా ఎంతో తెలుసా రూ. 3 కోట్లు, నెలకి రూ.90 కోట్లు, సంవత్సరానికి రూ.1080. ఐదేళ్లలో జగన్ ఇసుక ఆదాయం ఎంతో తెలుసా రూ.5,400 కోట్లు. జగన్ బటన్ వీక్ అయ్యింది. ఆయన బటన్ కి పవర్ లేదు. అమ్మఒడి బటన్ నొక్కి నెల అయ్యింది అయినా డబ్బులు పడలేదు. తల్లిని చెల్లిని గెంటేసినవాడు రాష్ట్రంలో ఉన్న అమ్మల బాధలు తెలుస్తాయా? ఎన్నికల ముందు ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మఒడి అన్నాడు. దానిని అర్ద ఒడి చేసాడు. అధికారంలోకి వచ్చాకా కండిషన్స్ అప్లై అంటూ ఒక బిడ్డకే అని అర్ద ఒడి చేసాడు. రూ.15 వేలు ఇస్తానని అన్నాడు. మెయింటెనెన్స్ పేరుతో రూ.2 వేలు కోసి రూ.13 వేలు ఇస్తాను అన్నాడు. డబ్బులు లేకుండానే బటన్ నొక్కాడు. నెల రోజులు అవుతున్నా డబ్బులు పడటం లేదు. అమ్మకి అన్నం పెట్టని వాడు రాష్ట్రంలో ఉన్న అమ్మలకు అమ్మఒడి వేస్తాడా? నాయుడు గారికి నియంత కి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసా? కియా, ఫ్యాక్స్ కాన్, హెచ్సిఎల్ నాయుడు గారి బ్రాండ్లు…నియంత బ్రాండ్లు ఏంటి ? కోడి కత్తి, గొడ్డలి పోటు.
పోలవరం, పట్టిసీమ నాయుడు గారి బ్రాండ్లు… నియంత బ్రాండ్లు ఏంటి? ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, ఆంధ్రా గోల్డ్ నాయుడు గారు ఏపీ ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేస్తే నియంత ఏపీ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా మార్చాడు. నాయుడు గారి పాలనలో పెట్టుబడులు…నియంత పాలనలో అప్పులు. నాయుడు గారి పాలనలో అభివృద్ధి…నియంత పాలనలో విధ్వంసం. జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది. అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.
జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను. అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ జగన్. జగన్ మహిళల్ని నమ్మించి మోసం చేసాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అన్నాడు. పెన్షన్ దేవుడెరుగు పాపం మహిళలు దాచుకున్న అభయహస్తం డబ్బులు 2500 కోట్లు కొట్టేసాడు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అని మోసం చేసాడు. 2,200 కి.మీ.ల పాదయాత్రలో మీ కష్టాలు చూసాను… కన్నీళ్లు తుడుస్తాను . భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. మహాశక్తి పథకం కింద… 1) ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు. 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం 4) ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం.
జగన్ యువత భవిష్యత్తు పై దెబ్బకొట్టాడు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నాడు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు. ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సర్కిల్స్ మూసేసాడు. జిఓ77 తీసుకొచ్చి ఉన్నత విద్య చదువుతున్న వారికీ ఫీజు రీయింబర్స్మెంట్ పధకం రద్దు చేసాడు. యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం. పెండింగ్ పోస్టులు అన్ని భర్తీ చేస్తాం.అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. జగన్ రైతులు లేని రాజ్యం తెస్తున్నాడు. జగన్ పరిపాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులతో రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ 3, కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2. రైతుల్ని ఆదుకోకపోగా ఇప్పుడు మోటార్లకు మీటర్లు పెడుతున్నాడు. ఆ మీటర్లు రైతులకు ఉరితాళ్లు. మీటర్లు బిగిస్తే పగలగొట్టండి. టిడిపి మీకు అండగా ఉంటుంది. రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. ఇన్పుట్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం.
జగన్ ఉద్యోగస్తులను వేధిస్తున్నాడు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా సీపీఎస్ రద్దు చెయ్యలేదు. ఇప్పుడు జిపిఎస్ అంటూ కొత్త డ్రామా మొదలు పెట్టాడు. పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని దివాలాకోరు ప్రభుత్వం ఇది. డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు. ఆఖరికి సీఐ ఆనందరావు గారిని వేధించి చంపేశారు వైసిపి నేతలు. వైసిపి నాయకులు ఒత్తిడి వలనే ఆనందరావు గారు ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకొనే బాధ్యత నాది. నిందితులను టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. దళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.
జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హజీరా. ఇలా ఎంతో మంది బాధితులు. మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు జిల్లా ప్రజలు 2019లో టిడిపి గౌరవాన్ని నిలబెట్టారు. 4 సీట్లు గెలిపించారు. 2024 లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లా ని గుండెల్లో పెట్టుకొని అభివృద్ధి చేస్తాం. 2019 లో వైసిపి 8 సీట్లు గెలిచింది. టిడిపి ఎమ్మెల్యే ని కూడా పార్టీలో చేర్చుకున్నారు. మొత్తం 9 ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే జిల్లా ఎలా అభివృద్ధి చెందాలి? అభివృద్ధి లో దూసుకెళ్ళాలి. కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లా కి జగన్ పీకింది ఏంటి? వెలిగొండ ప్రాజెక్ట్ పనులు ఏడాదిలో పూర్తి చేస్తా అన్నాడు. పూర్తి చేసాడా ? 6 సార్లు తేదీలు మార్చాడు. నడికుడి – కాళహస్తి పనులు రైల్వే పనులు పూర్తి అయ్యాయా? నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు కోసం టిడిపి హయాంలో భూసేకరణ చేసాం. ఆ ప్రాజెక్ట్ జగన్ పాలనలో ఎత్తిపోయింది.
రాయల్టీ, కరెంట్ ఛార్జీలు పెంచి గ్రానైట్ పరిశ్రమను దెబ్బతీసాడు. దొనకొండ వద్ద ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చెయ్యాలని టిడిపి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ ప్రాజెక్టు ని అటక ఎక్కించింది జగన్ ప్రభుత్వం. గుండ్లకమ్మ ప్రాజెక్టును నాశనం చేసాడు. గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు లోని నీరు మొత్తం ఖాళీ చేసారు. జగన్ అసమర్ధత కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. 12 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ పరిశ్రమను తీసుకొస్తే జగన్ తన్ని తరిమేసాడు. అది వచ్చి ఉంటే ఇక్కడ సుబాబుల్, జామాయిల్ రైతులకు ఎంతో మేలు జరిగేది. ఉమ్మడి ప్రకాశం జిల్లా అభివృద్ధి పై ఓపెన్ ఛాలెంజ్ నేను చర్చకు సిద్ధం ఇద్దరు ఎంపీలు, 9 మంది ఎమ్మెల్యేలు సిద్దామా? జగన్ పీకింది ఏంటో చెప్పే దమ్ముందా? అద్దంకిని అభివృద్ధి చేసింది టిడిపి. ప్రకాశం పులి గొట్టిపాటి రవి గారు రూ.2000 వేల కోట్లతో అద్దంకిని అభివృద్ధి చేసారు. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేసాం. సింగరకొండలో ఐటిఐ కాలేజ్, ఇండోర్ స్టేడియం నిర్మించాం. అద్దంకి ప్రజల దాహం తీర్చేందుకు 80 కోట్లతో శాశ్వత తాగునీటి పధకం ఏర్పాటు చేసాం.
రైతులు పండించిన పంట దళారుల చేతికి వెళ్లకుండా రైతులే అమ్ముకునే విధంగా అన్న గారి సంత ఏర్పాటు చేసాం. రాష్ట్రంలోనే ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చింది అద్దంకికే. సాగు నీరు అందించడం కోసం లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసాం. ఎస్సి, ఎస్టీ మత్స్యకారులకు 90 శాతం సబ్సిడీతో మోపిడ్ లు, ఆటోలు, వలలు అందజేశాం. నియోజకవర్గంలో ఎక్కువుగా ఎన్టీఆర్ జలసిరి బోర్లు వేయించాము. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత అద్దంకి పరిస్థితి ఏంటి? అద్దంకి ప్రజలంటే జగన్ కి కోపం అందుకే అద్దంకి ని అనాధ గా వదిలేసాడు. పెద్ద సైకో ని చూసి పిల్ల సైకోలు రెచ్చిపోతున్నారు. అద్దంకిని అడ్డగోలుగా దోచుకున్నారు. పిల్ల సైకోల ఇసుక దోపిడీ ఏ రేంజ్ లో ఉందో తెలుసా గుండ్లకమ్మ డ్యామ్ గేట్లు కొట్టుకుపోయి ఏడాది అయ్యింది. గేట్లు బిగిస్తే ఇసుక దోపిడీ సాధ్యం కాదని గేట్లు పెట్టడం లేదు. పిల్ల సైకోల కక్కుర్తి వలన గుండ్లకమ్మ నదిపై ఆధారపడిన 13 గ్రామాల మత్స్యకారులు రోడ్డున పడ్డారు. సెంటు స్థలాల్లో భారీ స్కాం చేసారు పిల్ల సైకోలు. ఎకరం రూ. 10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.27 లక్షలకు అమ్మేసారు. చేపల చెరువులు మొత్తం పిల్ల సైకోలు కబ్జా చేసారు.
రేషన్ బియ్యాన్ని కూడా వదలలేదు పిల్ల సైకోలు. కస్యపురం గ్రామంలో శివారెడ్డి రైస్ మిల్లు ద్వారా వందల టన్నుల రేషన్ బియ్యాన్ని అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. దేవుడ్ని కూడా వదలలేదు సింగరకొండ పుణ్యక్షేత్రంలో కాంట్రాక్టు పోస్టుల దగ్గర నుండి, షిఫ్ట్ ఆపరేటర్, వాచ్మెన్, అంగన్వాడీ పోస్టుల వరకూ ప్రతి ఉద్యోగానికి ఒక రేటు పెట్టి అమ్మేస్తున్నారు పిల్ల సైకోలు. గ్రానైట్ యజమానులను బెదిరించి లారీకి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు పిల్ల సైకోలు. మల్లాయపాలెంలో ఎస్టీలు నివసిస్తున్న 15 ఎకరాల్లో గ్రానైట్ ఉండటంతో వారిని ఖాళీ చేయించి 15 ఎకరాలు కబ్జా చేసారు ఈ పిల్ల సైకోలు. భూకబ్జాలకు లెక్కేలేదు, వెంచర్ వెయ్యాలంటే వైసిపి పిల్ల సైకోలకు కప్పం కట్టాల్సిందే. జగన్ పనైపోయింది. 2024 లో గెలిచేది టిడిపి నే. అద్దంకి లో భారీ మెజారిటీ తో మన పులి రవి గారిని గెలిపించండి. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అద్దంకి ని ప్రకాశం జిల్లాలో కలుపుతాం. వైవి సుబ్బారెడ్డి గారి తండ్రి పేరు మీద ఏర్పాటు చేసిన పోలిరెడ్డి కోరిశపాడు లిఫ్ట్ ప్రాజెక్ట్ జగన్ పూర్తి చెయ్యలేదు. టిడిపి గెలిచిన వెంటనే పూర్తి చేస్తాం. ఆపేసిన భవనాశి రిజర్వాయర్ పనులు పూర్తిచేస్తాం. వాటర్ గ్రిడ్ పధకం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందిస్తాం.
గుండ్లకమ్మ బ్రిడ్జ్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. కొత్త బ్రిడ్జ్ నిర్మిస్తాం. గుండ్లకమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామల ప్రజలకు అన్ని మౌలిక వసతులతో కాలనీలు ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలోని సాగర్ మైనర్, మేజర్ కాలువలను పూర్తిస్థాయిలో రిపేర్ చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తాం. వరి, సుబాబులు, జామాయిల్, రైతుల కష్టాలు నేను చూసాను. టన్నుకి 5 వేలు ఇస్తానని జగన్ మోసం చేసాడు. మీ పెట్టుబడి తగ్గించి గిట్టుబాటు ధర అందిస్తాం. అద్దంకి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇటుక పరిశ్రమ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రోత్సాహకాలు ఇచ్చి బ్రిక్ ఇండస్ట్రీ ని మరింతగా అభివృద్ధి చేస్తాం. రాయల్టీ, విద్యుత్ ఛార్జీలు తగ్గించి గ్రానైట్ పరిశ్రమను కాపాడతాం. ప్రకాశం జిల్లా ని ఫార్మా హబ్ గా తయారు చేసే బాధ్యత నాది అద్దంకి ప్రజల కోసం పోరాడినందుకు రవి గారిని వేధించారు. సమస్యలు పరిష్కరించమని ప్రశ్నించినందుకు వెంటాడారు. అయినా మన పులి తగ్గుతుందా? ఒక్కటే చెప్పాడు ఫ్లూటు జింక ముందు ఊదు.. పులి ముందు కాదని.
వైసిపి నాయకులు చెత్త నాయకులు. ఎందుకో నేను చెబుతా. యువగళం పాదయాత్ర ఉందని తెలిసి ఫ్లెక్సీలు చింపుతారు. పాదయాత్ర ను అడ్డుకుంటాం అని సవాళ్లు విసురుతున్నారు అంట. వైసిపి ఆల్రెడీ వెంటిలేటర్ పై ఉంది… మీరు సవాళ్లు విసరడం సిల్లీగా ఉంది. పసుపు జెండా చూస్తే పోసుకునే మీకు సవాళ్లు అవసరమా? గుడ్డు వేసిన వాడికి ఆమ్లెట్ వేసి పంపాం. సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే వైసిపి కి అంతిమయాత్ర. పార్టీ కోసం పోరాడుతున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను. పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టే అందరి పేర్లు ఎర్ర పుస్తకం లో రాస్తున్నా. చట్టాన్ని అతిక్రమించి కేసులు పెట్టిన వారిని వదిలి పెట్టను. కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించిన వైసిపి నాయకులకి వడ్డీతో సహా చెల్లిస్తాం.