• వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతల జెసినగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మాకు శ్మశాన వాటికలు లేక వాగుల్లో మృతదేహాలను ఖననం చేస్తున్నాం.
• శ్మశాన వాటిక స్థలం కోసం ఎంతలా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
• ఇళ్ల పట్టాల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు.
• స్థలాలు లేక ఇళ్లు నిర్మించుకోవాలంటే భారంగా ఉంది.
• ఖాళీ ప్రభుత్వ భూములను వ్యవసాయం చేసుకునేందుకు కేటాయించాలి.
• ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. దీంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది.
• ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక బయట నుండి కొనుగోలు చేస్తున్నాం.
• చేపలు పట్టుకునేందుకు వలలు, ఐస్ బాక్సులు అందించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిస్కీమ్ లోనూ ఒక స్కామ్ ఉంటుంది.
• సెంటుపట్టాల పేరుతో పనికిరాని స్థలాలను కేటాయించి రూ.7వేల కోట్లు దోచుకున్నారు.
• టిడిపి అధికారంలోకి రాగానే ప్రతిపేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.
• జెసినగర్ లో శ్మశానవాటికకు స్థలాన్ని కేటాయిస్తాం.
• జగన్ దివాలాకోరు ప్రభుత్వం కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో దూది, గాజుగుడ్డ కూడా లేని దుస్థితి నెలకొంది.
• ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలను మెరుగుపరుస్తాం.
• ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు సబ్సిడీపై అందిస్తాం.