అమరావతి: రోజులు గడిచే కొద్దీ చంద్ర బాబు అక్రమ అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని టీడీపీ జాతీయ కార్య దర్శి నారా లోకేష్ అన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాటలతో చంద్రబాబు అరెస్టు వెనుక ఎంతటి భయంకరమైన కుట్ర ఉందో వెల్లడ యిందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ అనంత పురం జిల్లాలో ఓ కార్యక్రమంలో మాట్లాడు తూ, 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు చస్తాడు… ఇది గ్యారెంటీ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతు న్నాయి. దీనిపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. గోరంట్ల మాధవ్ కుండబద్దలు కొట్టినట్టు చంద్రబాబుకు మరణ హెచ్చరిక జారీ చేశాడని, ఇటీవలి ప్రసంగంలో ఎంపీ మాటలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న కుట్ర పొరలు ఒక్కొక్కటీ విడిపోతున్నాయని స్పష్టం చేశారు. తనకు హాని తలపెడతారంటూ చంద్రబాబు నుంచి దిగ్భ్రాంతికర లేఖ వచ్చిందని, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాటలతో దీని వెనుక ఎంతటి దుష్ట పన్నాగం ఉందో ఆవిష్కృతమైందని, చంద్రబాబు లేఖలోని అంశాలు నిజమేనని తేలాయని తెలిపారు. జరుగుతున్న పరి ణామాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వం చంద్రబాబును కాపాడుతుందన్న నమ్మకం వారిలో ఏ మాత్రం లేదని లోకేశ్ ట్వీట్ చేశారు.