- జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది
- ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాడు
- బటన్ నొక్కుడు పేరుతో జగన్ బొక్కుడు సాగింది
- రాష్ట్రంలో ఓట్ల దొంగలు… ప్రజలారా మీ ఓటు జాగ్రత్త
- జగన్ పాలనలో నలుగురు రెడ్లు తప్ప ఏ రెడ్డీ బాగుపడలేదు
- కుప్పం నియోజకవర్గం రామకుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
రామకుప్పం: గాడితప్పిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడమే తన లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సంక్షేమ పథకాలకు బటన్ నొక్కు డు కార్యక్రమం పేరుతో జగన్ ఇన్నాళ్లూ బొక్కుడు కార్యక్రమాన్ని సాగించారని మండిపడ్డారు. ప్రకటనల తో సాక్షి పత్రికకు దోచిపెడుతున్నారని అరోపించారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలతో పాటు ప్రజల ఆస్తులు కొట్టే సే దొంగలు కూడా తయారయ్యారని విమర్శించారు. జగన్ సినిమా అయిపోయిందని.. ఓడిపోతున్నాడని ఆయనకు కూడా అర్థమైందన్నారు.సామాజిక న్యాయం అంటున్నారని, రెడ్లలోనూ పెద్దిరెడ్డి, సజ్జలరెడ్డి, సుబ్బా రెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప ఏరెడ్డీ బాగుపడలేదన్నారు. ఈ నలుగురు రెడ్లు బాగుపడితే రెడ్లంతా బాగు పడిన ట్లేనా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో బలహీన వర్గా లు బాగుపడ్డాయా అని ప్రశ్నించారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో.. జగన్ సామాజిక న్యాయంలో కూడా న్యాయం అంతే అని చురకలు అంటించారు. మార్చాల్సింది మంత్రులు, ఎమ్మెల్యేలను కాదని..జగన్ ను మార్చాలని తెలిపారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం బహిరంగ సభలో చంద్రబాబు శుక్రవారం మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పుడూ చూడని అభి మానాన్ని నేడు రామకుప్పంలో చూశానన్నారు. 40 ఏళ్లుగా రామకుప్పం వస్తున్నా… గత 35ఏళ్లలో ఎన్నో సార్లు సీఎంగా కూడా వచ్చాను.. కానీ ఇంతటి ఘన స్వాగతం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరి గుండెల్లో తెలుగుదేశంపార్టీ ఉంది…అది నా అదృష్టం. చంద్రన్నా మీరే మమ్మల్ని కాపాడాలని ఆడబిడ్డలంతా బయటకు వచ్చారు.పదేళ్ల వయసున్న చిన్నారులు కూడా హుషారు గా వస్తుండటంతో నావయసు కూడానేను మర్చిపోయా ను. వయసు నాకు ఒక నంబర్ మాత్రమే. మీ ఉత్సా హం చూశాక, మా ఆడబిడ్డల ఉత్సాహం చూశాక..లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్న నమ్మకం ఉంది. ఓటర్ల జాబితాలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా రు. ప్రజలు మీ ఓట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు గ్రామగ్రామానికి వెళ్లి ఈవంద రోజులు పని చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
పది వేలు ఇచ్చి లక్షలు దోచేస్తున్నారు
నాలెడ్జ్ ఎకనామీతో కుప్పం యువత మారాలని కలగన్నా.. అందుకే మెడికల్,ఇంజనీరింగ్, డిగ్రీ, జూని యర్, యూనివర్సిటీ కూడా తీసుకొచ్చాను. రామ కుప్పంలో పిల్లలు నా కోసం స్కూలు నుండి బయటకు వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. వారిని అడ్డుకోవచ్చు కానీ వారి మనసులను అడ్డుకోలేరు. టీచర్లకు కూడా జీతాలు సరిగా ఇచ్చే పరిస్థితి లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా సరిగా ఇవ్వడం లేదు. పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొడుతున్నారు. ప్రకటనల పేరుతో ఇష్టారీతిన దోచుకుంటున్నారు. రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ బాధితులు పోలీసులే.అందరు రోడ్ల మీద ఉంటే జగన్ మాత్రం ప్యాలెస్‌లో ఉన్నాడు. జనాన్ని మోసం చేశాడు. జాబ్ కేలండర్ ఉందా.? పరిశ్రమలు పెట్టా లంటే వచ్చేవారు లేరు.. ఎవరన్నా రావాలన్నా వాటాల డగడంతో రావడం లేదు. అమర్ రాజా కంపెనీ కూడా వెళ్లిపోయింది. లులూ, అదానీ డేటా సెంటర్లు పోయా యి. రేపు జరిగే ఎన్నికలు మీ పిల్లల భవిష్యత్తును నిర్ణ యిస్తాయి. పదివేలు ఇచ్చి లక్షలు దోచేస్తే మీ జీవితాల్లో ఎలా వెలుగులు వస్తాయి.? ఇది మోసం కాదా.? అం గన్ వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తా మని చెప్పి.. నేను ఎప్పుడు అన్నానని ఇప్పుడు మాట మారుస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు.
కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది
వైసీపీ నేతలు కూడా ఈ ప్రభుత్వంలో బాధితులే. ఈ ప్రభుత్వాన్ని చూసి మోసపోయాం.. నష్టపోయాం.. మేము కూడా రెడ్లమే, సామాన్య రెడ్లు ఎవరూ బాగుపడ లేదు అని శాంతిపురంలో ఓ తల్లి చెప్పింది. సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. ఆస్తులకు రక్షణ ఉండద ని. సర్వే చేసి మీకు చెప్పకుండా రికార్డులు రాసేశారు. కొత్త చట్టం ప్రకారం ప్రైవేటు వ్యక్తుల దగ్గర సమాచా రం పెట్టుకుంటాడు. ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వ లేని వ్యక్తి జగన్.ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. కుప్పంలో ఇలాంటివి జరుగుతాయని అనుకోలేదు. ఒక్కొక్కరిపై పది కేసులు పెట్టారు..బానిసలుగా చూసి ఆనందం పొందాలని చూస్తున్నారు. అన్యాయానికి గురై న కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత నాది. పోలీసు లను కూడా కోరుతున్నా.. వచ్చేది టీడీపీనే..దౌర్జన్యాలు చేసే వారు గుర్తుంచుకోండి.. సైకో చెప్పిన పనులు చేయొద్దని చంద్రబాబు హెచ్చరించారు.
నేను తలచుకుంటే రోడ్లమీదకు కూడా వచ్చేవారు కాదు
ప్రజల కోసం సూపర్ సిక్స్ తెచ్చాను. మహాశక్తి పథ కం ద్వారా ప్రతి మహిళకు రూ.1500, తల్లికి వంద నం ద్వారా ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి రూ.15వేలు, దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. పేదరిక నిర్మూలన కోసం పేదలను భాగస్వాములుగా చేర్చి పీపీపీపీ విధానం అమలు చేస్తాం. మంత్రి పెద్దిరెడ్డి కప్పం కోసం కుప్పం తరచూ వస్తున్నాడు. నువ్వు మంత్రివా..దళారివా.? దళారివైతే వ్యాపారం చేసుకో..మంత్రివైతే సేవ చేయ్. నా మీద దాడి చేయిస్తే భయపడతాననుకుంటున్నారా? నేను తలచుకుంటే వాళ్లు రోడ్లమీదకు కూడా వచ్చేవారు కాదు. 175కు 175 మనమే గెలిచి వైసీపీని ఇంటికి పంపుదాం. జగన్ ప్రతిపక్షానికి కూడా పనికిరాడు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే పీఏ వాటాల్లో తేడా వచ్చి చని పోయాడు. సాక్షి విలేకరి ఎందుకు ఆత్మహత్య చేసుకు న్నాడో చెప్పండి. విశాఖలో మొన్న కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకుంది..రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఉంది మనో నిబ్బరం ఇవ్వడానికి..కానీ ఇదొక రాక్షస ప్రభుత్వం అని చంద్రబాబు పేర్కొన్నారు.