అమరావతి: ఏపీ ప్రభుత్వం జారీ చేస్తున్న కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ బొమ్మ ముద్రించటం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తప్పుబట్టారు. అంతే కాకుండా ఇది నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండికొట్టడ మేనన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి (సీఎస్)కి శుక్రవారం వర్ల రామయ్య లేఖ రాశారు. రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు ఇస్తున్న కులధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బొమ్మ ముద్రిస్తున్నారు. కుల దృవీకరణ పత్రాలపై సీఎం బొమ్మ ముద్రించడం ఎన్నికల సంఘం తల పెట్టిన నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు గండి కొట్ట డమే. కుల ధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించి జగన్‌రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజాధనంతో రాజకీయ ప్రయోజ నాలను నెరవేర్చుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విలువలకు ప్రమాదకరం. ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా వచ్చే ఈ తరుణంలో రెవెన్యూ అధి కారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం తగదు. రెవెన్యూ అధికారులు కులధృవీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించడం అధికార పార్టీని బలపరచడమే. ఎన్నికల ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడరాదని ఎన్నికల నియమా వళి చాలా స్పష్టంగా చెబుతోంది. కావున, కుల ధృవీకరణ పత్రాలపై, భూమి హక్కు పత్రాలైన పాస్ పుస్తకాలపై ముఖ్య మంత్రి బొమ్మ ముద్రించకుండా చర్యలు తీసుకోగల రు. రాబోవు ఎన్నికలు నిష్పక్ష పాతంగా జరిపేందుకు తగు చర్యలు తీసుకోగలరు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.