అమరావతి: అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో శనివా రం జరిగే రా..కదలిరా సభల్లో టీడీపీ అధి నేత చంద్రబాబు పాల్గొననున్నారు. ‘రా.. కదలిరా’ పేరుతో టీడీపీ అధినేత చంద్ర బాబు రాష్ట్రమంతా పర్యటిస్తూ బహిరంగ సభల్లో రాష్ట్రంలోని జగన్‌రెడ్డి అరాచక పాల నను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తెస్తు న్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈనెల 27న అన్నమయ్య జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో చంద్ర బాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం పీలేరు, సాయంత్రం ఉరవకొండ బహి రంగ సభల్లో పాల్గొంటారు. శనివారం ఉద యం ఉండవల్లి నివాసం నుండి బయలు దేరి 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11:15 గంటలకు తిరుపతి ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి హెలీకాప్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకుంటా రు. పీలేరులో 11:50 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభను నిర్వహించనున్నారు. ఈ సభ అనంతరం అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో బయలుదేరి అనంతపురం జిల్లా ఉరవ కొండమండలం లాతవరం చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుండి 5:30వరకూ రా..కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు.
‘రా.. కదలిరా!’ అన్న పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బహి రంగ సభలు నిర్వహిస్తోంది. పార్టీని స్థాపిం చిన సమయంలో దివంగత ఎన్టీ రామా రావు ‘తెలుగుదేశం పిలుస్తోంది.. రా కదలి రా’ అని ఇచ్చిన నినాదానికి అశేష తెలుగు ప్రజానీకం మంత్రముగ్ధులయ్యారు. టీడీపీ ని అక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆ నినాదాన్ని పేరుగా మార్చు కుని ఎన్నికల రణరంగంలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది.