- ఫైనల్ మ్యాచ్‌ను తిలకించి బహుమతులు అందజేసిన లోకేష్
- ముఖ్య అతిథులుగా పాల్గొన్న టీడీపీ-జనసేన నాయకులు
- ప్రథమ బహుమతి రూ. 2 లక్షలు, ద్వితీయ బహుమతి రూ. లక్ష, తృతీయ బహుమతి రూ. 50 వేల నగదు ప్రోత్సహకం
- పాల్గొన్న 100 జట్లకు లోకేష్ సహకారంతో క్రికెట్ కిట్లు అందజేత
- పోటీలను విజయవంతం చేసిన నేతలను అభినందించిన లోకేష్
మంగళగిరి టౌన్, చైతన్యరథం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్స వాన్ని పురస్కరించుకోని నారా లోకేష్ క్రీడా ప్రాంగ ణం (భోగి ఎస్టేట్స్)లో జరుగుతున్న మంగళగిరి ప్రీమియర్ లీగ్-2 పోటీలలో తాడేపల్లికి చెందిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు విజేతగా నిలిచిం ది. ఆదివారం మధ్యాహ్నం వల్లభనేని వెంకట్రావు యూత్ వర్సెస్ అన్‌స్టాపబుల్ మధ్య ఉత్కంఠ బరితం గా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టు గెలు పొందింది. నియోజకవర్గ నాయ కులు ఇరు జట్ల క్రీడా కారులను పరిచయం చేసుకో గా, జాతీయ గీతాలాపన తో ఫైనల్ మ్యాచ్‌ను ప్రారం భించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇతర మఖ్య అతిథుల తో కలిసి ఉత్కంఠ బరితంగా జరిగిన మ్యాచ్‌ను వీక్షించి అనంతరం బహుమ తులు అందజేశారు. వందలాది మంది క్రీడాకారులు, అభిమాను లతో నారా లోకేష్ ఫోటోలు దిగారు. నియోజకవర్గ స్థాయిలో 20 రోజుల పాటు జరిగిన ఈ పోటీ లకు విశాలమైన మైదా నంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ఈ పోటీలలో 1500 మంది క్రీడాకారులు పాల్గొన్నా రు. ఫైనల్ మ్యాచ్ 15 ఓవర్లకు నిర్వహించగా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వల్ల భనేని వెంకట్రావు యూత్ 10వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అన్‌స్టాప బుల్ క్రికెటర్స్ జట్టు 8వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఎంపీఎల్ ఫైనల్స్ సందర్భంగా నారా లోకేష్ క్రీడా ప్రాంగణం ఆది వారం సందడిగా మారింది. పోటీలను తిలకించేందుకు యువత, క్రీడాభిమాను లు, మహిళలు, టీడీపీ జనసేన పార్టీ నాయకు లు, కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్య లో వచ్చారు. ఎంపీఎల్ విజేతగా నిలిచిన వల్లభనేని వెంకట్రావు యూత్ జట్టుకు నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి మరియు మాలపాటి పుల్లయ్య చౌదరి సహకారంతో రూ.2 లక్షలు ప్రైజ్ మనీ అందించారు. ద్వితీయ స్థానంలో నిలిచిన అన్ స్టాపబుల్ క్రికెటర్స్ జట్టుకు సీనియర్ నాయకులు ఇట్టా పెంచ లయ్య సహకారంతో రూ.లక్ష, తృతీయ స్థానంలో నిలిచిన డీజే 2023జట్టుకు యర్ర బాలెం టీడీపీ గ్రామ కమిటీ సహకారంతో రూ.50వేల నగదు బహుమతులు అందిం చారు. అన్ని మ్యాచ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన క్రీడాకారులకు తెలుగు యువత రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి జవ్వాది కిరణ్ చంద్ సహకారంతో రూ.రెండు వేల నగదు బహు మతి, ట్రోఫీ, క్రీడాకారులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశా రు. అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మరియు బెస్ట్ బ్యాట్స్ మెన్‌గా నిలిచిన మూకా సురేష్‌కు రూ.15 వేలు, బెస్ట్ బౌలర్‌గా నిలిచిన ఫణింద్ర కు రూ.5వేల నగదు బహుమతిని జవ్వాది కిరణ్ చంద్ ఆర్థిక సహకా రంతో అందించారు. టోర్నీలో పాల్గొ న్న 100 జట్లకు నారా లోకేశ్ సహకారంతో క్రికెట్ కిట్లు, ప్రతి జట్టుకు కాసరనేని కిషోర్‌కుమార్, జాలాది రఘురాం సహకారంతో హెల్మెట్‌లను, పోటీల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి టీషర్ట్స్‌ను టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ సహకారంతోస్థానిక టీడీపీ జనసేన నాయకులు అంద జేశారు. సిక్స్ కొట్టిన ప్రతి క్రీడాకారుడికి నియోజ కవర్గ తెలుగుయువత కార్య నిర్వాహక కార్యదర్శి తిరువీధుల సతీష్ సహకారంతో రూ వెయ్యి, బుల్లా మహేష్ సహకారంతో రూ.500 నగదు బహుమతి అందజేశారు. పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన పలువురు క్రీడాకారులకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు బహూ కరించారు. ఎంపీఎల్లో ఎంపైర్లుగా సేవలందించిన వారిని, 20 రోజుల పాటు నిరం తరాయంగా క్రికెట్ పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన నియోజకవర్గ తెలుగు యువతను, నియోజకవర్గ నాయకులను నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా క్రీడా కారులు మాట్లాడుతూ నియో జకవర్గ స్థాయిలో రూ.2 లక్షలు, రూ లక్ష, రూ.50 వేల ఫ్రైజ్‌మనీతో అద్భుతంగా క్రికెట్ పోటీలను నిర్వంచడం అభినంద నీయం అన్నారు. నారా లోకేష్ నియోజక వర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం వాలీ బాల్ కిట్స్, క్రికెట్ కిట్స్ అందించడంతో పాటు విశాల వంతమైన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేసి క్రీడా కారులను ఆకట్టుకున్నారని అన్నారు. వచ్చే ఎన్ని కలలో నారా లోకేష్‌ను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పోలిట్‌బ్యూరో సభ్యులు వంగల పూడి అనిత, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జన సేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వ రరావు, మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు,పి.గన్నవరం నియోజ కవర్గ టూ మెన్ కమిటీ కన్వీనర్ గంటి హరీష్ మధూర్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులు యం.ఎస్ బేగ్, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మి శెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్య దర్శి పోతినేని శ్రీనివాస్,నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు, క్రీడాభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.