- ప్రతిరోజూ 500 లారీల ఇసుక పొరుగు రాష్ట్రానికి తరలింపు
- శాండ్ శంకర్ పోగేసిన పాపపు సొమ్ము రూ.2500 కోట్లు
- విభాగాల వారీగా వసూళ్లకు కొడుకు నేతృత్వంలో బ్రోకర్లు
- 400 ఎకరాల అటవీభూములను మింగేసిన అనకొండ
- బ్యాంకు తనఖాలో ఉన్న భూములను అమ్మేసిన ఘనుడు
- పెదకూరపాడులో ఏ పనికావాలన్నా ఎస్-ట్యాక్స్ కట్టాల్సిందే
- అక్రమాలను ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులతో వేధింపులు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికో సామంత రాజును ఏర్పాటుచేసుకొని రాష్ట్రంలో విలువైన భూములు, సహజ వనరులను అడ్డంగా దోచేస్తుంటే, తాడేపల్లి ప్యాలెస్ నిర్ణయించిన కప్పాన్ని ఠంచనుగా చెల్లిస్తూ దేవతల రాజధాని అమరావతిని మాఫియాల రాజ్యంగా మార్చేశాడు పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరి శంకర్రావు అలియాస్ శాండ్ శంకర్. పెదపరిమి అనే కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శంకర్రావు… 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక వందలకోట్లరూపాయలు పాపపు సొమ్ము పోగేసి అవినీతి అనకొండలా మారారు. తమ అడ్డగోలు దోపిడీని ప్రశ్నించే వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనాయించడం గొంతునొక్కేయడం ఇసుక శంకర్ కు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలు తోసిరాజని కృష్ణానది ఇసుకను ఇష్టారాజ్యంగా మింగేయడమేగాక ప్రకృతిసంపద, విలువైన భూములను కొల్లగొడుతున్న ఎమ్మెల్యే శాండ్ శంకర్ అవినీతి లీలలు చైతన్యరథం పాఠకుల కోసం…
– చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నియోజకవర్గానికో సామంతరాజును ఏర్పాటుచేసుకొని రాష్ట్రంలో విలువైన భూములు, సహజవనరులను అడ్డంగా దోచేస్తుంటే, తాడేపల్లి ప్యాలెస్ నిర్ణయించిన కప్పాన్ని ఠంచనుగా చెల్లి స్తూ దేవతల రాజధాని అమరావతిని మాఫియాల రాజ్యంగా మార్చేశాడు పెదకూరపాడు శాసనసభ్యుడు నంబూరి శంకర్రావు అలియాస్ శాండ్ శంకర్. పెద పరిమి అనే కుగ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన శంకర్రావు… 2019లో ఎమ్మెల్యేగా ఎన్నిక య్యాక వందలకోట్లరూపాయలు పాపపు సొమ్ము పోగేసి అవినీతి అనకొండలా మారారు. తమ అడ్డగోలు దోపిడీ ని ప్రశ్నించే వారిపై పోలీసులతో తప్పుడు కేసులు బనా యించడం గొంతునొక్కేయడం ఇసుక శంకర్‌కు వెన్నతో పెట్టిన విద్య. నిబంధనలు తోసిరాజని కృష్ణానది ఇసుక ను ఇష్టారాజ్యంగా మింగేయడమేగాక ప్రకృతి సంపద, విలువైన భూములను కొల్లగొడుతున్న ఎమ్మెల్యే శాండ్ శంకర్ అవినీతి లీలలు చైతన్యరథం పాఠకుల కోసం…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెప్పిందే చట్టం!
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుంచి దోచుకోవడమే పని గా పెట్టుకున్న శంకర్రావు అవినీతికి అడ్డూఅదుపు లేదు. ఇసుక, మట్టి ద్వారా ఆకాశమేహద్దుగా అవినీతికి తెరలే పి వందలకోట్లు పోగేశాడు. ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టు కుని ఒకవైపు రియల్‌ఎస్టేట్, మరోవైపు అక్రమ మైనింగ్ చేస్తూ అయిదేళ్లలో రూ.2,500కోట్ల సొమ్మును వెనకేశా డు. పెదకూరపాడు నియోజకవర్గంలో శంకర్రావు అండ్ కో చెప్పిందే చట్టంగా అరాచక విధానాలకు తెరలేపారు. నియోజకవర్గ పరిధిలో పదవులు, కాంట్రాక్టులు, ఇసుక రీచ్‌లు.. ఏవైనా సరే శంకర్రావు చెప్పిన వారికే దక్కా ల్సిందే. వీటితోపాటు గుట్కా వ్యాపారం, పేకాట క్లబ్‌లు, కల్తీసారా యధేచ్ఛగా సాగుతున్నా అధికారులు ఆవైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. పెదకూరపాడును ఒక చంబల్ లోయగా మార్చాడు. ఒకవైపు కొండలు, గుట్టలు ఆక్రమిస్తూ.. మరోవైపు ఇసుక దోపిడీని మూడు ట్రక్కులు, ఆరు లారీల్లా రాత్రింబవళ్లు యధేచ్ఛగా కొన సాగిస్తున్నారు. కృష్ణానదిలో తట్ట ఇసుకైనా, చెరువులో ట్రాక్టర్ మట్టి అయినా శంకర్రావుకు తెలియకుండా బయటకు వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్లే సాహసం చేస్తే వారిపై క్షణాల్లో తప్పుడు కేసులు నమోదై కటకటాలు లెక్కపెట్టాల్సిందే.
అడగడుగునా ఇసుక కొండలే
కృష్ణాతీరంలో ఇసుక అక్రమ తవ్వకాలకు ఇక్కడ కొండల్లా కనిపించే ఇసుక నిల్వలే నిదర్శనం. పెదకూర పాడు యథేచ్ఛగా నది నుంచి ఇసుకను సుదూర ప్రాం తాలకు తరలిస్తూ భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నా రు. ఇసుక మాఫియాకు సాక్షాత్తు ఎమ్మెల్యేనే నేతృత్వం వహిస్తుండటంతో అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తుండడంతో తీరప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడి పోతున్నాయి. ఇప్పటికే బోర్లలో నీటిమట్టం గణనీయం గా తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2019 నుంచి ఇటీవల వరకు నియోజకవర్గంలోని ఇసుక రీచ్‌లను పైకి ఎపిఎండిసి, జేపీ వెంచర్స్ నిర్వహించినా ఇసుక రీచ్‌లలో ఉండే వసూళ్లు చేసేదంతా ఎమ్మెల్యే మనుషు లే. విచ్చలవిడిగా తవ్వకాలు జరపడం ద్వారా సంపాదించిన మొత్తంలో వాటాలను తాడేపల్లి ప్యాలెస్‌కు మోయడంలో కీలకపాత్ర శంకర్రావుదే. వారానికి ఒకసారి లెక్కలు చూసి శంకర్రావుకు సూట్‌కేసులు అప్పగిస్తే ఆయన నెలకోసారి ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు తరలిస్తుంటారు.
ఏ పనికావాలన్నా ఎస్-టాక్స్ కట్టాల్సిందే!
నియోజకవర్గంలో శంకర్రావు అనే అవినీతి వైరస్ గ్రామగ్రామానికి విస్తరించింది. పెదకూరపాడు పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన కాంట్రాక్టర్ అయినా ముందుగా ఎమ్మెల్యే శంకర్రావుకు కప్పం కట్టా కే పనులు ప్రారంభించాలి. శంకర్ గ్యాంగ్ నియోజక వర్గంలో ఇసుక, మట్టి, కొండలు, గుట్టలతోపాటు రేషన్ షాపుల్లో బియ్యం కూడా మిగలనీయడం లేదు. ప్రభుత్వ స్థలాలను చెరువులుగా మార్చడం, అటవీ భూమిని మాయం చేయడం, కొండల్ని సైతం మింగేయడంలో శంకర్ గ్యాంగ్ సిద్ధహస్తులు. తమ అనుచరులతో అంది నకాడికి కమిషన్లు దండుకోవడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడాన్ని శాండ్ శంకర్ అలవాటుగా మార్చుకున్నారు. నియోజకవర్గాన్ని కేకు ముక్కలమాదిరి చేసి ఒక్కో అనుచరుడికి ఒక్కో విభాగం అప్పజెప్పారు. ఈ వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునే బాధ్యతను తన పుత్రరత్నం కళ్యాణ చక్రవర్తికి అప్పగించారు. ఇతనే దగ్గరుండి నియోజకవర్గీలోని ఎస్-ట్యాక్స్ వసూలు లెక్క లు చూస్తారు. ఈ లెక్కల్లో ఏమైనా తేడాలు వస్తే శంకర్రా వు ఆగ్రహానికి గురి కావాల్సిందే. తన అక్రమాలను ప్రశ్నించినందుకు ఇటీవలకొందరు వైసిపి వారిని కూడా పార్టీ నుంచి బహిష్కరించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తు న్నారు. నియోజకవర్గంలో వసూళ్లకోసం నియమి తులైన శంకర్రావు గ్యాంగ్ వివరాలిలా ఉన్నాయి.
1.కృష్ణారెడ్డి: నియోజకవర్గంలో అధికారులను బెది రించడం, ఇసుక, మట్టి వంటి కార్యకలాపాలను దగ్గ రుండి చూసేది ఇతనే. సాయంత్రంకల్లా సూట్‌కేసులు పుత్రరత్నానికి అప్పగించే బాధ్యతలు నిర్వర్తిస్తారు.
2.గంగాధరరెడ్డి: ఇతను ఎమ్మెల్యే శంకరరావు పుత్రరత్నానికి ముఖ్య అనుచరుడు. రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ పోలీసులను సైతం బెదిరిస్తుంటారు. ఖాళీ భూములు కబ్జా చేయడం, సెటిల్మెంట్లు బాధ్యతలు నిర్వహిస్తుంటారు.
3.రవిచౌదరి: ఎమ్మెల్యే పుత్రరత్నానికి ఇతను కుడి భుజం లాంటి వాడు. ఇసుక, రేషన్, భూసెటిల్మెంట్లు చక్కబెడుతుంటారు. అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేసే కోడిగుడ్లు, ఇతర వస్తువుల్లో కూడా జె`ట్యాక్స్ వసూలు చేసేది ఇతనే.
చెప్పిన పనులు చేసేవారికే పోస్టంగులు
కోట్లాది రూపాయలు ఆదాయం చూపించే ఇసుక రీచ్‌లు ఒకవైపు… రాజధాని ఆనుకుని కోట్ల రూపాయల విలువ చేసే భూములు మరోవైపు… దీనికితోడు ఇక్కడ ఎమ్మార్వో, పోలీసు పోస్టింగ్‌లకు ఏరియాకో రేటు నిర్ణ యించారు. ఎమ్మార్వో పోస్టింగ్‌కు రేటుతోపాటు తాము చెప్పింది మారుమాట్లాడకుండా చేయాలని కండీషన్ పెట్టారు. తమ పరిధో ఏ అధికారి వచ్చినా ఎమ్మెల్యే చెప్పింది చేసి, ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అయితే ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరీ పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఖాళీ స్థలాలకు పట్టాలు సృష్టించి సొంతం చేసుకోవడం, అసైన్డ్ భూము లు సైతం పేర్లు మార్చి అన్యాక్రాంతం చేయడం వంటి సంఘటనలు కోకొల్లలు చోటుచేసుకున్నాయి. అంతులేని భూదందాలకు పెదకూరపాడు కేంద్ర బిందువుగా మారింది. ఈ వ్యవహారం మొత్తాన్ని ఎమ్మెల్యే అనుచరు లు కృష్ణారెడ్డి దగ్గరుండి చూసుకుంటారు. పోరంబోకు భూములనే కాదు, పంట కాలువలను సైతం శంకర్రావు అనుచరులు మింగేశారు. బెదిరింపులకు, ముడుపులకు తలొగ్గి వైసీపీ నేతలు సూచించిన పేర్ల మీద ఆఘ మేఘాల మీద రిజిస్ట్రేషన్లు జరిగిపోతుంటాయి. శంకర్రావు అండ్ కో ఆగడాలు భరించలేక అయిదేళ్లలో 18 మంది ఎమ్మార్వోలు బదిలీ పెట్టుకుని వెళ్లిపోయారు.
రోడ్డువేయాలంటే కప్పం కట్టాల్సిందే!
నియోజకవర్గంలో ఏ మూల్కెనా సరే రోడ్డు పడాలం టే ముందుగా ఎమ్మెల్యే పుత్రరత్నం కళ్యాణ చక్రవర్తిని ప్రసన్నం చేసుకోవాలి. లేకపోతే అంగుళం కూడా పనులు ముందుకు సాగవు. కోసూరు పాలిటెక్నికల్ కాలేజీ వద్ద చేపట్టిన రోడ్డులో అక్షరాలా రూ.50 లక్షలు ఎమ్మెల్యే కుమారుడు కళ్యాణ చక్రవర్తి వసూలు చేశాడని సొంత పార్టీ నేతలే బహిరంగంగా విమర్శించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోసూరు నుండి దొడ్లేరు వరకు వేస్తున్న రోడ్డును సైతం వదల్లేదు. నాబార్డు నిధులతో చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంలో అవక తవకలకు పాల్పడి సుమారు రూ.50 కోట్లు అవినీతికి పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ నాణ్యతను పరిశీలించడానికి వచ్చిన అధికారులను సైతం శంకర్రావు అండ్ కో మేనేజ్ చేసింది.
అటవీ భూములను మింగేసిన ఘనుడు
రియల్ ఎస్టేట్ నుంచి రాజకీయాల్లో వచ్చిన శంక ర్రావు ఆ వైరస్‌ను నియోజకవర్గం అంతటా అంటించా డు. ఏ ఖాళీ జాగా కనిపించినా తన అనుచరులను పం పించి రాత్రికి రాత్రి రికార్డులు సృష్టించి చేజిక్కించు కుంటున్నాడు. అచ్చంపేట మండలంలో ప్రసిద్ధిగాంచిన అడవులను సైతం ఆక్రమించారు. 400 ఎకరాల అటవీ భూమిని శంకర్రావు అనుచరులు ఆధీనంలో ఉంది. దీని పై స్థానిక ప్రజలు ఆందోళన చేసినాగానీ పట్టించుకో లేదు. వైకుంఠపురం నుంచి నకిరేకల్లు వరకు చేపట్టిన భూసేకరణలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. అమరావతిలో 40 ఎకరాలు, క్రోసూరు లో 27 ఎకరాలు, అచ్చంపేటలో 62 ఎకరాలు దొంగ పత్రాలతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ఆధీనంలోకి తీసు కున్నారు. శాండ్ శంకర్, ఆయన అనుచరులు సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరకి రైతుల దగ్గర భూములు కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేసారు. ఏకంగా బ్యాంక్ తనఖాలో ఉన్న భూమిని కూడా ప్రభుత్వానికి అమ్మిన ఘనుడు శ్యాండ్ శంకర్. దీనిపై సంబంధిత బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు సీబీఐకి ఫిర్యాదు చేసారు. వీళ్ల ధనదాహానికి ఇంఛార్జ్ తహసీల్దార్‌గా ఉన్న మహిళా అధికారి సస్పెండ్ అయ్యారు.
ఖాళీస్థలాలపై కన్నుపడితే కబ్జానే!
ఖాళీ స్థలాలు కబ్జా చేస్తూ ఊరికో బకాసురుడిని శంకర్రావు పెంచి పోషిస్తున్నాడు. చిన్న పిల్లలు చాక్లెట్ చప్పరించిన తేలికగా వైసీపీ నేతలు ప్రజల భూములను మింగేస్తున్నారు. రహదారుల పక్కనుండే భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేసి, వెంచర్లు వేసి అమ్మడం సర్వసాధారణం. పెదకూరపాడు నియోజకవర్గంలో రైతు లను బెదిరించి తక్కువరేటుకు వారి వద్ద నుంచి భూము లు సేకరించి ప్రభుత్వ నిధులతో వెంచర్లు వేసి అమ్మడం శంకర్రావు ప్రత్యేకత. ఎవరైనా తక్కువ రేటుకు భూమిని అమ్మబోమని చెబితే అంతుచూస్తామని బెదిరిస్తున్నారు. అధికార పార్టీ నేతలు వేసే ఏ లేఅవుట్‌కు నియోజక వర్గంలో అనుమతులు ఉండవు.
కొండలను కూడా మింగిన అనకొండ
నియోజకవర్గంలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడి రమణీ యంగా ఉండే కొండలను సైతం శంకర్ గ్యాంగ్ వదల్లేదు. భారీ ప్రొక్లెయిన్లతో నియోజకవర్గంలోని కొండ లన్నింటినీ మాయం చేశారు. వైకుంఠపురంలోని పవిత్ర మైన కొండకు గుండు కొట్టించాడు శాండ్ శంకర్. ఈ కొండపై ఉన్న దేవాలయాన్ని టిటిడిలో కలపాలని టిడిపి ప్రభుత్వం ఆలోచిస్తే ఇప్పుడు ఏకంగా కొండనే మింగేస్తు న్నాడు. కోసూరు మండలంలోని కొండలను అడ్డగోలు గా తవ్వేసి మాయం చేశారు. అమరావతిలో దేవాల యానికి ఆనుకుని ఉన్న కొండలను సైతం యథేచ్ఛగా తొలిచేస్తున్నారు. శ్యాండ్ శంకర్ క్రమం తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్‌కు కప్పం కడుతుండటంతో ఈయన అడ్డగోలు దోపిడీని అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. శ్యాండ్ శంకర్ అడ్డగోలు ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ ఎన్ జిటికి ఫిర్యాదుచేశాడని కంచేటి సాయి అనే కాపు నాయ కుడిపై అక్రమ మద్యం కేసు బనాయించారు. తాజాగా క్రోసూరులో ఎమ్మెల్యే అక్రమాలపై ప్రెస్ మీట్ పెట్టేందు కు వెళుంటే పోలీసులతో అడ్డగించారు. పనితీరు సరిగా లేదంటూ బిసి, ఎస్సీ ఎమ్మెల్యేలను బలిపశువులను చేస్తు న్న జగన్మోహన్‌రెడ్డికి శంకర్రావు లాంటి వాడిని మార్చేసే దమ్ములేదు. ప్రజలు చైతన్యవంతులై తిరగబడితే తప్ప నియోజకవర్గంలో అరాచకాలు అగే పరిస్థితులు కన్పించ డం లేదు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఇటువంటి దోపిడీ దారులను సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.
శాండ్ శంకర్ దెబ్బకు కృష్ణమ్మ విలవిల
రాష్ట్రంలో లక్షలాదిమంది భవన నిర్మాణ కార్మి కుల ఉపాథి కల్పిస్తున్న ప్రకృతి సంపద ఇసుకను నిబంధనలను తోసిరాజని యథేచ్చగా తవ్వేస్తూ ఇసు కాసురుడు అవతారమెత్తారు ఎమ్మెల్యే శంకర్రావు. ఈయన దెబ్బకు కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో వందలకోట్ల ఇసుకతోపాటు అమాయకుల ప్రాణాలు కూడా అనంతవాయువుల్లో కలిసి పోతున్నాయి. అయిదేళ్లలో నియోజకవర్గంలో ఇసుక లారీల కింద పడి 60మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నదీతీర ప్రాంతాల్లో మైనింగ్ కోసం తీసిన గుంతల కారణంగా మరో 23 మంది ప్రాణాలు పోగొట్టు కున్నారంటే ఏవిధంగా ఇసుక దోపిడీ జరుగు తుందో అర్థంచేసుకోవచ్చు. నియోజకవర్గంలోని కోసూ రు, ధరణికోట, అమరావతి, వైకుంఠపురం వంటి గ్రామాల్లో రీచ్ లనుంచి పెద్దఎత్తున ఇసుక తవ్వకాలు జరుపుతూ అక్రమంగా పొరుగు రాష్ట్రా లకు తరలించేస్తున్నారు. అమరావతి సమీపం లోని రీచ్ నుంచి నందిగామ డివిజన్ మీదుగా సరిహద్దుల మీదుగా రోజుకు 500 లారీల ఇసుక హైదరాబాద్ తరలిపోతోంది.