అమరావతి: అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డు కునే హక్కు పోలీసులకు ఎక్కడిదని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీకి వచ్చేముందు సచివాల యం అగ్నిమాపక కేంద్రం వద్ద ‘బైబై జగన్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని తెదేపా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. బారికేడ్లు అడ్డు పెట్టి పోలీసులు వారిని అడ్డుకోవడంతో నేతలు వాగ్వాదానికి దిగారు. జాబ్ క్యాలెండర్ విడుదల ఎప్పుడు? పోలవరం పూర్తి ఎక్కడా? అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాల కృష్ణ మాట్లాడుతూ పనైపోయిన వైకాపా ప్రభు త్వం గురించి ప్రత్యేకంగా చెప్పేందుకు ఏముం టుందని వ్యాఖ్యానించారు. తమను చూసి సీఎం జగన్ భయపడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చే నేతలను అడ్డుకునే కొత్త సంప్రదాయానికి వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుయ్య బట్టారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.