- స్మగ్లర్లకు అసెంబ్లీ టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు
- ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరం
- వైసీపీ నేతల స్మగ్లింగ్‌కు అడ్డురాకుండా టాస్క్‌ఫోర్స్‌ను నిర్వీర్యం చేశారు
- వ్యవస్థలు గాడి తప్పితే అందరూ బాధితులే
- కానిస్టేబుల్ హత్యపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించా రు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకర న్నారు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడులకు పాల్పడ్డారు.. ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన పోలీసులను స్మగ్లర్లు తమ వాహనంతో ఢీ కొట్టారు. ఈ క్రమంలో వారిని అడ్డుకోబోయిన 14వ బెటాలియన్ కానిస్టేబుల్ గణేష్ మృతి చెంద డం బాధాకరం అని ఒక ప్రకటనలో చంద్రబాబు పేర్కొన్నారు.
స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చే సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలో ఉంటే… వ్యవస్థలు ఎలా మనగలుగుతాయన్నారు. స్మగ్లర్లు, గూండాలకు సీఎం ప్రాధాన్యమి స్తుంటే వాళ్లు పోలీసులను ఏం లెక్క చేస్తారని ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభు త్వంలో ఎర్రచందనం దొంగలపై నాడు కఠినంగా వ్యవహరించామన్నారు. ఎర్రచందనం వైపు స్మగ్లర్లు చూడాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నాడు స్మగ్లింగ్‌ను అరికట్టడం కోసం పటిష్టంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్‌ను ఈ ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా నిర్వీర్యం చేసిందని ఆరోపిం చారు.
వ్యవస్థలు గాడి తప్పినప్పుడు అందులో అందరూ బాధితులే అవు తారని… ఇప్పుడు గణేష్ మృతికి ఈఅధికారులు,ప్రభుత్వం ఏం సమాధానం చెపుతుందని ప్రశ్నించారు. పోలీసులపై ఎర్ర చందనం దొంగలు దాడులు చేయడం, ప్రాణాలు తీయడం రాష్ట్రంలో దారుణ పరిస్థితులకు అద్దం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధినిర్వహ ణలో ప్రాణాలు కోల్పో యిన గణేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని… ఎర్ర చందనం స్మగ్లర్లపై ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.