- టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ
- ప్రజల్ని పిచ్చివాళ్లను చేసేలా సుబ్బారెడ్డి మాటలు
- అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయం మేరకే రాజధానిగా అమరావతి నిర్ణయం
- వాస్తవాలకు ప్రతిరూపం ‘రాజధాని ఫైల్స్’
- జగన్‌ను రాష్ట్రంలోనే లేకుండా తరిమేయాలి
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు
కోటబొమ్మాళి: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి ఎకరాకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చే బాధ్యతను అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభు త్వం తీసుకుంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజ రాపు అచ్చెన్నాయుడు చెప్పారు. రానున్న 58 రోజుల పాటు ప్రతి నిమిషం గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని కార్యకర్తలకు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. శ్రీకా కుళం జిల్లా కోటబొమ్మాళి తెలుగుదేశంపార్టీ కార్యాల యంలో అచ్చెన్నాయుడి సమక్షంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కుటుంబసభ్యులతో సహా బుధవా రం టీడీపీలో చేరారు. ఈసందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినాన చిన్నసాన ఎంపీటీసీ సభ్యుడు రాజశేఖర్, చినసాన మాజీ సర్పంచ్ నాగేశ్వరరావులతో పాటు వందలాది కుటుంబాలు టీడీపీలో చేరడం నిజంగా శుభపరిణామం అన్నారు. టీడీపీ కుటుంబంలోకి వస్తున్న ప్రతిఒక్కరికీ హృదయ పూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. టెక్కలి నియోజక వర్గంలో ప్రత్యేక పారిశ్రామికవాడ ఏర్పాటుచేయిస్తాను. ఉద్యోగాలు రానివారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి స్వయం ఉపాధి పొందేలా చూస్తానన్నారు.
టెక్కలిని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ఎన్నికలు 58 రోజులే ఉన్నాయి. ఇక నుంచి ప్రతి నిమిషం ఎన్నికల కోసమే పనిచేయాలి. అందరం ఒకే మాటపై నిలబడి, గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం. టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తాను. టెక్కలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నా శక్తియుక్తులు వెచ్చిస్తాను. 2014-19లో చేయాల్సినంత అభివృద్ధి చేసి చూపించాను, మరలా అధికారంలోకి వచ్చి ఉంటే టెక్కలి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా నిలిచేది. కొత్తగా టీడీపీలో చేరిన వారిని అభినందిస్తున్నాం. రాజశేఖర్, నాగేశ్వరావులతోపాటు పార్టీలో చేరిన వారందరం కలసికట్టుగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేద్దాం.
ఇక్కడి జనం కరువు బారిన పడి వలస పోతున్నారని గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను జగన్ ప్రభుత్వం నడపలేని దుస్థితికి తీసుకొచ్చి, చివరకు దొంగలకు అప్పగించింది. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు.. రాష్ట్రం గురించిన ఆలోచన లేదు. మాట్లాడితే బూతులు తిట్టడమే. మనకు బూతులు రావా..తిట్టడం తెలియదా? కానీ ప్రజల కోసం పనిచేసేవాళ్లం కాబట్టి, సంయమనంతో ఓర్పుతో వ్యవహరించాం. ఐదేళ్లపాటు ఎన్నో ఒడిదొడుకులు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు తట్టుకొని నిలబడ్డామని అచ్చెన్నాయుడు అన్నారు.
రాజధాని ఫైల్స్ సినిమా వాస్తవాలకు ప్రతిరూపం
టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే రాజధాని అమరావతి రూపురేఖలే మారిపోతాయి. రాజధాని ఫైల్స్ అనే సినిమా వచ్చింది. అమరావతి రాజధానిగా ఎందుకు ఏర్పడిరది.. ప్రజలు ఎంతగా సహకరించారు.. భూములిచ్చిన రైతులు ఎంతగా రాజధాని కోసం పాటుపడ్డారనే వాస్తవాలన్నీ ఆ సినిమాలో ఉన్నాయి. ఆ వాస్తవాలు ప్రజలకు తెలియకూడదు.. అమరావతిని నాశనం చేయడానికి తాను చేసిన దుర్మార్గాలు ప్రజలకు తెలియకూడదని జగన్ రెడ్డి ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. సినిమా ప్రదర్శిస్తే థియేటర్లు మూసేస్తామని యజమానుల్ని బెదిరిస్తున్నాడు.
సినిమా రిలీజ్ చేయవద్దని డిస్ట్రిబ్యూటర్లను భయపెడుతున్నాడు. రాజధాని ఫైల్స్ సినిమా ప్రజలు చూసేలా నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేయాలి. థియేటర్ల యాజమాన్యాలకు అండగా నిలిచి వాస్తవాలు ప్రజలకు తెలిసేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణ పనులు మొదలెట్టింది. రాజధాని నిర్మాణంతో రాష్ట్రవ్యాప్తంగా భూములధరలు పెరిగాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. జగన్ ప్రభుత్వం పోతోందని తెలిసే రాజధాని ప్రాంతంలో మరలా భూముల ధరలు పెరుగుతున్నాయి. మూడు నెలల ముందు రాజధాని ప్రాంతంలో గజం రూ.12వేలు ఉంటే, మొన్నటికి మొన్న రూ.30 వేలకు పెరిగిందని అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రాంతాల మధ్య చిచ్చురేపాడు
రాష్ట్రప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండటం జగన్‌రెడ్డికి ఇష్టం లేదు. ప్రజల ఆనందాన్ని జగన్‌రెడ్డి సహించలేడు.అందుకే 2019ఎన్నికల్లో కులాలు, మతా ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి జగన్ లబ్ధి పొందాడు. ఈ సారి ఆ పాచిక పారదని ప్రాంతాల మధ్య రాజ ధానుల పేర్లతో చిచ్చురేపాడు. అప్పుడు, ఇప్పుడు ఒకే మాట చెప్పాను… జగన్‌రెడ్డి పచ్చిమోసగాడని, అతని మాటలు నమ్మవద్దని. ఉత్తరాంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టి, ఈ ప్రాంతంలోని సహజసందను కొల్లగొట్టాడు.
విశాఖపట్నం కేంద్రంగా రూ.40వేలకోట్ల విలువైన భూముల్ని దోచేశాడు. ఎంతోమంది పారిశ్రామికవేత్తల్ని బెదిరించి వారి ఆస్తులు దోచేశారు. ఆఖరికి ప్రజలు కూడా తమ ఆస్తులకు కాపలా కాసుకునే పరిస్థితి తీసు కొచ్చారు. ఉత్తరాంధ్ర కేంద్రంగా జగన్‌రెడ్డి, విజయ సాయిరెడ్డి, వైసీపీ నేతలు సాగించిన దోపిడీపై ప్రశ్నిం చామని విశాఖను రాజధాని చేయడం అచ్చెన్నాయుడి కి, టీడీపీకి ఇష్టం లేదని అప్పుడు పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడారు. ప్రజల్ని రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారు. చివరకు రాష్ట్రానికి రాజధాని ఏదంటే సమాధానం చెప్పలేని దుస్థితికి వచ్చారు. ఇప్పుడేమో సిగ్గులేకుండా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించాలంటున్నారని అచ్చెన్నాయుడు తప్పుబట్టారు.
ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడానికే..
రాజ్యసభ సభ్యుడిగా వెళ్లబోతున్న వైవీ సుబ్బారెడ్డికి నిజంగా సిగ్గుందా? భవిష్యత్‌లో హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరతాం అని సుబ్బారెడ్డి చెప్పడం ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడమే. తెలివిఉండే మాట్లాడాడా లేక పిచ్చిపట్టి మాట్లాడాడా? తన కుటుంబానికి పిచ్చి ఉందని ప్రజలు కూడా పిచ్చివాళ్లు అనుకొని సుబ్బారెడ్డి మాట్లాడాడా? ప్రజల్ని పిచ్చివాళ్లను చేయడానికే సుబ్బారెడ్డితో జగన్ అలా మాట్లాడిరచాడా? తొలుత మూడు రాజధానులు అనుకున్నాం..కానీ చేయలేకపోయాం. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేయండి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటాడా. ఇవి మతిలేని వాళ్లు మాట్లాడే మాటలు. 5 కోట్ల మంది ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. జగన్ రెడ్డి… వైసీపీ నేతలు రాజకీయాలకు అనర్హులు. భూతద్దంలో వెతికినా కనిపించని విధంగా వారిని తరిమికొట్టి ప్రజలు గట్టిగా బుద్ధిచెప్పాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.
అన్ని పార్టీలు, ప్రజల అభిప్రాయం మేరకే..
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా మనకంటూ ఒక రాజధాని ఉండాలి.. ఎవరూ మనల్ని హేళన చేయకూడదు.. తప్పుపట్టకూడదని భావించి ఆనాడు చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటు లో ఉండేలా, వారు మెచ్చేలా అన్నిపార్టీలు, ప్రజల అభి ప్రాయం ప్రకారం అమరావతిని రాజధానిగా ప్రక టించి, రాజధాని నిర్మాణ పనులు చేపట్టారు. మూడేళ్ల లోనే సచివాలయం.. శాసనసభ.. హైకోర్ట్ భవనాలతో పాటు, ఐఏఎస్, ఇతర అధికారుల నివాస భవనాలు కూడా నిర్మించారు. ఆనాడు ఆయన నిర్మించిన భవనా ల్లో ఉండే ఐదేళ్లుగా జగన్‌రెడ్డి, అతని ప్రభుత్వం దుర్మా ర్గమైనపాలన వెలగబెట్టిందని అచ్చెన్నాయుడు అన్నారు.
ఎంతో కష్టపడితేనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే, జగన్ రెడ్డి నేడు ఏపీ పేరు చెబితే దేశమంతా అసహ్యించుకునే పరిస్థితికి తీసుకువచ్చాడు. 30ఏళ్ల పాటు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకెళ్లాడు. రేపు చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయినా ఎంతో కష్టపడితే తప్ప రాష్ట్రానికి ఒక రూపు రాదు. జగన్ రెడ్డికి దగ్గరి వారే అతన్ని భరించలేక వేరేదారి చూసుకుంటున్నారు. తల్లిని, చెల్లిని రోడ్డున పడేసిన వాడు తమను పడేయడా అనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారు. నెల్లూరు జిల్లాలో గతంలో వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించి, ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తే, జగన్ రెడ్డికి దండం పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఎంతో మంది వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ రెడ్డికి ఎంతో దగ్గరివారు కూడా ఆయనకు గుడ్ బై చెప్పి వేరే దారి చూసుకుంటున్నారు. ఇవన్నీ చూశాక జగన్ రెడ్డిని నమ్ముకొని ఎవరైనా ఉంటారా?
ఆఖరికి తల్లి..చెల్లే జగన్‌రెడ్డి దుశ్చర్యలు, దుర్మార్గా లతో ఆయనకు ఎదురు తిరిగారు. ఎంత దుర్మార్గుడు అయినా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. ఎందు కంటే తనవాళ్లను బాగాచూసుకునే వ్యక్తి,తమను కూడా బాగా చూసుకుంటాడని అతనివెంట ఉండేవారు నమ్ము తారు. కానీ జగన్‌రెడ్డి కుటుంబాన్నే రోడ్డున పడేస్తే, తమను మాత్రం ఎందుకు రోడ్డున పడేయడనేది ఇప్పు డు వైసీపీ నేతలందరి ఆలోచన. తెలుగుదేశం-జనసేన కలిశాక వైసీపీ చాలా వరకు ఖాళీ అయ్యింది. చంద్ర ాబు గేట్లు ఎత్తితే వైసీపీలో జగన్ రెడ్డి తప్ప ఎవరూ ఉండరని అచ్చెన్నాయుడు అన్నారు.
జగన్‌ని రాష్ట్రంలో లేకుండా చేయాలి
రాష్ట్రాన్ని అప్పులమయం చేయడం తప్ప ఎక్కడైనా సరైన సంక్షేమం, నిజమైన అభివృద్ధి ఉన్నాయా? ఎవరి ని అడిగినా ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని, దిక్కుమాలిన నాయకుడిని చూడలేదని చెబుతున్నారు. తెలుగుదేశం-జనసేన కూటమి అత్యధిక సీట్లు, అత్యధిక మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందే హం లేదు. కానీ జగన్మోహన్‌రెడ్డి లాంటి నాయకుడు రాష్ట్రంలో లేకుండా చేయడమే మనందరి ధ్యేయం కావాలి. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలన ఎంత నష్టం కలిగిం చిందో ప్రతి ఒక్కరూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వారిమెదళ్లలో నాటుకునేలా జగన్‌రెడ్డి సాగించిన దారు ణాల్ని, వాస్తవాల్ని చెప్పాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.