- చంద్రబాబును కలిసిన పలువురు నేతలు
- ఆయన సమక్షంలో భారీగా పార్టీలో చేరికలు
- వైసీపీ గొంతులో పచ్చి వెలక్కాయ..
అమరావతి (చైతన్యరథం): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద గురు వారం సందడి వాతావరణం కనిపించింది. ఆశావహు లు, పార్టీలో చేరడానికి వచ్చిన వారితో చంద్రబాబు నివాస ప్రాంతం కోలాహలంగా మారింది. పార్టీలో చేరేందుకు చంద్రబాబు నివాసానికి వచ్చిన నరసరావు పేట నేత అట్లా చిన్న వెంకటరెడ్డి 100 కార్ల భారీ కాన్వాయ్‌తో చేరుకున్నారు. టీడీపీలో చేరనున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తల తో కోలాహలం కనిపించింది. చంద్రబాబును కలిసిన వారిలో సీనియర్ నేతలు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిలప్రియ తదితరులు ఉన్నారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న రాజకీయాలపై పార్టీ ఇన్‌చార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో చంద్రబాబు మంత నాలు సాగించారు.
రజకులను ఎస్సీల్లో చేర్చాలంటూ నరసరావుపేట టీడీపీ రజక నేతలు చంద్రబాబును కోరారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి భారీఎత్తున వైసీపీ నుంచి తెదేపాలో చేరికలు సాగాయి. ఇదిలావుంటే `టీడీపీ అధినేత చంద్రబాబును నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కలిశారు. ఇటీవల ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన, త్వరలో టీడీపీలో చేరనున్నారు. చంద్రబాబు సమక్షంలో బాచిన గరటయ్య కుమా రుడు కృష్ణచైతన్య, బాలినేని ముఖ్య అనుచరుడు అద్దంకి వైసీపీ నేత చినవెంకటరెడ్డి తెదేపాలో చేరారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. వివిధ నియోజకవర్గాల్లో నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ టీడీపీలో చేరుతున్నారు. బుధ వారం శ్రీకాళహస్తి, కుప్పం నియోజకవర్గాలకు చెందిన ముగ్గరు జడ్పీటీసీలు, పలువురు నేతలు టీడీపీలోకి రాగా… గురువారం కర్నూలు, కదిరి, రాయదుర్గం, కోవూరు, అద్దంకి నియోజకవర్గాలకు చెందిన నేతలు ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో చేరారు.
కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు జిల్లా వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు సూరా శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం జడ్పీటీసీ సూరా దీప, కౌన్సిలర్ అందె ప్రత్యూష, అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అట్లా చిన్నవెంకటరెడ్డి, సంతమాగులూరు ఎంపీపీ ఏనుబర్ల యలమంద, కర్నూలు నియోజకవర్గానికి చెందిన మైనార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ ఖాసీ, వాసవీ పైపుల కంపెనీ అధినేత సత్రశాల జగన్నాథ్ గుప్తా, కదిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు పుల్ల విజయారెడ్డి, ఆవుల మనోహర్ రెడ్డి, లక్ష్మీ నారాయణ రెడ్డి, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన కాటన్ బోర్డు మాజీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ నీలకంఠారెడ్డి, సహా ఆయా నియోజకవర్గాల మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు, సీనియర్ నాయకులు టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే సిపి తిమ్మారెడ్డి మనవడు, కేంద్ర కాటన్ బోర్డు మాజీ డైరెక్టర్ చింతకుంట శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు శుక్రవారం టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును కలిసి, తమ అనుచరులతో టిడిపిలో చేరారు. చంద్రబాబునాయుడు ఆయనను స్వాగతించి పార్టీ కండువాతో సత్కరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి తన శాయ శక్తుల కృషి చేస్తానని టిడిపి నాయకుడు వాసు తెలిపారు. వైసీపీకి ఎన్నో సేవలందించినప్పటికి తగిన గుర్తింపు లేదన్నారు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడనై టీడీపీలో చేరానని వెల్లడిరచారు.