- ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
- హిందూపురం, మడకశిరలో నారా భువనేశ్వరి వ్యాఖ్య
- ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం
- పోటెత్తిన అభిమానం, సంఫీుభావం
- హిందూపురం పార్లమెంటులో ముగిసిన నిజం గెలవాలి పర్యటన
హిందూపురం, చైతన్యరథం: తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు, దానికి గ్యారెంటీ ఉం టుందని నారా భువనేశ్వరి అన్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో నిజం గెలవాలి పర్యటన సంద ర్భంగా హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో గురువారం పర్యటించారు. మొదటగా హిందూపురం టౌన్, 8వ వార్డులో పార్టీ కార్యకర్త యు.అంజినప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు.చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అంజినప్ప(80),23-09 -2023న గుండెపోటుతో మృతిచెందారు. అంజినప్ప భార్య అంజినమ్మ, కుమారుడు హనుమప్ప, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చారు. వారి యోగక్షేమాల డిగి తెలుసుకుని రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందించారు.
అనంతరం మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప(63), 16-09-2023న గుండెపోటుతో మృతిచెందారు. భార్యలు తిప్పమ్మ, తొణసమ్మ, కుమా రుడు, మాలింగప్ప, కుమార్తె మహాలక్ష్మి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. మడకశిర నియోజకవర్గంలో భువనేశ్వరికి అడుగడుగు నా కార్యకర్తలు, మహిళలు బ్రహ్మరథం పట్టారు. తనకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో భువనేశ్వరి మాట్లాడుతూ…జగన్ నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశా లు లేకుండా పోయాయని తెలిపారు. ప్రభుత్వ విధా నాలను ప్రశ్నిస్తు న్నారనే కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టారని పేర్కొన్నారు.
చంద్రబాబు రూ.3వేల కోట్లు దోచుకున్నా రని ఒకసారి, రూ.300కోట్లు దోచు కున్నారని మరో సారి, రూ.3కోట్లు దోచుకున్నారని మరోసారి పూటకో మాట మార్చిన వైసీపీ ప్రభుత్వం, చంద్రబాబు తప్పు చేశారని ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు చూపలేక పోయిందని గుర్తుచేశారు. చంద్ర బాబును అక్రమంగా అరెస్టు చేసి 53రోజులు జైల్లో పెట్టారన్నారు. కానీ అంతిమంగా నిజమే గెలిచిందని తెలిపారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపా నికి గురై చనిపోయిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవడం తన కర్తవ్యమని, కార్యకర్తల కుటుంబాల ను ఆదుకుంటానని స్పష్టం చేశారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఏ వర్గమూ సంతో షంగా లేదన్నారు. జగన్ పాలనలో కనీసం మౌలిక సదుపాయాలకు కూడా ప్రజలు నోచు కోలేదని గుర్తు చేశారు.
రాష్ట్రం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, సంతోషంగా ఉండాలంటే చంద్ర బాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. చంద్రబాబును ముఖ్య మంత్రిని చేసుకోవాలంటే ప్రతి పౌరుడు తన ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడుతోందని,టీడీపీ అభిమానులు, కార్యకర్తల ఓట్లను అడ్డగోలుగా జాబితా నుండి తీసేస్తోందన్నారు. ఎప్పటికప్పుడు ఓటరు జాబితాలో ఓటు ఉందో, లేదో చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటే రాష్ట్ర ప్రజల ఆయుధమని వివరించారు. కార్యక్రమం ముగి సిన అనంతరం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుని తిరుగుపయనమయ్యారు