- టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
- సేవాలాల్ ఆశయాలు నీరుగారుస్తున్న జగన్ సర్కారు: ఎం.ఏ షరీఫ్
- బంజారాలు ఏకతాటిపైకి వచ్చి గద్దెదించాలి: ఎం ధారునాయక్
అమరావతి (చైతన్యరథం): బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ 285వ జయంతి వేడుకలు తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనం గా జరిగాయి. ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం.ధారు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించా రు. పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని బంజారాల అభివృద్ధికి సేవాలాల్ చేసిన సేవలు కొనియాడారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న శాసన మండలి మాజీ చైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ ‘బంజారా లకు తెదేపా ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది.
సేవా లాల్ మహరాజ్ బంజారాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన కృషి వల్లే నేడు బంజా రాలు ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నారు. సేవాలాల్ ఆశయాలను అమలు చేయగలిగేది రాష్ట్రంలో ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల్లోని ప్రతీ తెగ నష్టపోయింది. గుంటూరులో డయేరి యా సోకి ఇటీవల పద్మ అనే గిరిజన మహిళ మృతి చెందడం ఎంతో బాధాకరం. ఏజెన్సీలతో పాటు మైదాన ప్రాంతాల్లోని గిరిజన ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్రం లో గిరిజనుల సమస్యలు పోవాలంటే చంద్ర బాబు నాయుడిని సీఎం చేసుకోవాలి’ అన్నారు.
ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధారు నాయక్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జగన్ ప్రభు త్వం సేవాలాల్ ఆశయాలకు తూట్లు పొడుస్తోం ది. జగన్‌రెడ్డికి గిరిజనుల పేరు ఉచ్ఛరించే నైతిక అర్హత లేదు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతా ల్లో వందలాది డోలీ మరణాలు చోటుచేసుకుం టున్నా జగన్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదు. గిరిజన యువతను ఉన్నత విద్యకు దూరం చేసి గంజాయికి బానిసలుగా చేశాడు. జీవో నెం -3ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే జగన్‌రెడ్డి కనీసం కోర్టులో అప్పీల్ చేయలేదు. గిరిజనుల అటవీ హక్కుల చట్టం-2006ను ఉల్లంఘించి వంద లాది గిరిజనుల భూములను బడా పారిశ్రామిక వేత్తలకు ధారాదత్తం చేశారు. జగన్‌రెడ్డిని అధి కారం నుంచి దించకపోతే గిరిజన అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది. గిరిజనులంతా ఏకతాటిపైకి రావాలి. గిరిజనుల సత్తా జగన్ రెడ్డికి చాటాలి’ అన్నారు.
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి, నాలెడ్జ్ సెంటర్ చైర్మన్ గురజాల మాల్యాద్రి మాట్లాడు తూ ‘గిరిజనులు జగన్‌రెడ్డి నిజస్వరూపం తెలు సుకోవాలి. జగన్‌రెడ్డి ఐదేళ్లలో రూ.5వేల కోట్లు ట్రైబల్ సబ్ నిధులను దారిమళ్లించారు. గిరి జనులు సొంత కాళ్లపై నిలబడేలా సంక్షేమ పథ కాలు చంద్రబాబునాయుడు అమలు చేస్తే.. జగన్‌రెడ్డి గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా అమ లు చేయాల్సిన 16 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు’ అన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు మనోహర్ నాయక్, గోపీ నాయక్, హనుమంతు నాయక్,రమేష్ నాయక్, బాలాజీ నాయక్, సాంబా నాయక్, రాముడు నాయక్, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.