అమరావతి, చైతన్యరథం: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ)కు భారత క్రికెటర్‌కంటే వైకాపా నాయకుడే ముఖ్య మా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిలదీశారు. గాయాలను లెక్కచేయకుం డా భారతజట్టు కోసం, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జట్టు కోసం హనుమ విహారి… తన క్రీడా శక్తినంతటినీ ధార పోశారని పవన్ కొనియాడారు. ఏపీ రంజీ జట్టు నాకౌట్ చేరడంలో అతడిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ‘‘వైకాపా నేత కారణంగానే అతడు కెప్టెన్సీకి రాజీ నామా చేశాడు.విహారి పట్ల ఏసీఏ చూపించిన తీరుకు చింతిస్తున్నా.
మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ను రాష్ట్ర క్రికెట్ సంఘం దారుణంగా అవ మానించినప్పుడు.. ‘‘ఆడుదాం ఆంధ్రా’ లాంటి కార్యక్ర మాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి లాభమేంటి?’’ అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హనుమ విహారికి భవి ష్యత్తులో మంచి జరగాలని పవన్ ఆకాంక్షించారు. ఆట గాళ్లను గౌరవించడం తెలిసిన స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌తో అతడు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.