- రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యంపై జగన్‌రెడ్డివి ఆర్భాటపు మాటలే
- ప్రభుత్వం కేటాయిస్తున్న వేలకోట్ల నిధులు ఏమవుతున్నాయి
- సిబ్బంది, పరికరాలు లేక కునారిల్లుతున్న జిల్లా ఆసుపత్రులు
- సిగ్గులేకుండా జగనన్న సురక్ష, విలేజ్ హెల్త్‌క్లినిక్‌లంటూ గొప్పలు
- ధ్వజమెత్తిన టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్
అమరావతి(చైతన్యరథం):శవాలపై చిల్లర ఏరుకున్న తీరుగా జగన్‌రెడ్డి సర్కార్ ప్రజారోగ్యాన్ని కూడా అవి నీతి వనరుగా మార్చుకుందని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు. రాష్ట్ర వైద్యరంగాన్ని తాకట్టు పెట్టి డబ్బులు దండుకునే దుస్థితికి దిగజారిం దని, ముఖ్యమంత్రి డబ్బాలు కొట్టుకుంటున్న ఆరోగ్యశ్రీ పథకం అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆసు పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ పతనావస్థకు చేరాయన్నారు. వైద్యరంగానికి తమ ప్రభుత్వం రూ.58 వేల కోట్లు కేటాయించిందని జగన్‌రెడ్డి గొప్పలు చెబు తున్నాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిరంజీలు.. దూది కూడా లేక సిబ్బంది ప్రజలకు వైద్యం అందించ లేక చేతులెత్తేస్తుంటే ప్రభుత్వం కేటాయించిన నిధులు ఏమయ్యాయి, ఎటుపోయాయి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతిరోగికి భోజనానికి రోజుకి రూ.100లు మాత్రమే ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఆ సొమ్ముతో పేదవాడికి మంచి పౌష్ఠికాహారం ఎలా లభి స్తుందో చెప్పాలని సప్తగిరి ప్రసాద్ నిలదీశారు.
అధ్వాన్నంగా జిల్లా ఆసుపత్రులు
జిల్లా కేంద్రాల్లో ఉండే ప్రధాన ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, వసతులు, పరికరాలు లేవు. పేరుకే జిల్లా ఆసుపత్రులు తప్ప వాటిలో కనీస వసతు లు కూడా లేవు. తగినంత మంది వైద్యులు, వైద్య సిబ్బంది లేరు. సీటీ స్కాన్, ఎమ్‌ఆర్‌ఐ, రేడియాలజీ వంటి పరీక్షలు అందుబాటులో లేవు.రూ.1000 నుంచి రూ.25లక్షల వరకు పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందిస్తున్నామనే ముఖ్యమంత్రి మాటలు పచ్చిఅబద్ధాలు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఏ ఆసుపత్రిలో పేదలకు రూ.25లక్షల విలు వైన వైద్యసేవలు అందాయో నిరూపించాలని సప్తగిరి ప్రసాద్ సవాల్ చేశారు.
ఆరోగ్యశ్రీ నిధుల్ని వైసీపీ పందికొక్కులు తినేశాయి
ఆరోగ్యశ్రీ కిందపేదలకు అందాల్సిన డబ్బుని కూడా జగన్‌రెడ్డి.. వైసీపీ వాళ్లు పందికొక్కుల్లా తినేశారు. నకిలీ రోగుల్ని సృష్టించి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రు లతో కుమ్మక్కై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా కోట్ల రూపాయల సొమ్ము స్వాహా చేశారు. ఈ విషయమై ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి ఒక్కసారి కూడా స్పందించలేదు. జగన్ రెడ్డి సిగ్గులేకుండా జగనన్న సురక్ష.. విలేజ్ హెల్త్ క్లినిక్ అని గొప్పులు చెప్పుకుంటున్నాడు. మందులు, వైద్యులు లేకుండా హెల్త్ క్లినిక్‌లు ఎందుకు? జగనన్న ఆరోగ్యసురక్ష పథకం కింద పేదలకు రూ.500ల రవాణా ఖర్చులు చెల్లిస్తున్నట్టు జీవోలిచ్చి మరీ ప్రచారం చేసుకున్నారు. ఎక్కడా పేదలకు రూపాయి ఇచ్చింది లేదని సప్తగిరి ప్రసాద్ విమర్శించారు.
బిల్లులు చెల్లించలేని దుస్థితి
ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు డబ్బులు చెల్లించలేని దుస్థితిలో ఉన్న జగన్‌రెడ్డి, అదే పథకంతో ప్రజల ఆరో గ్యాన్ని కాపాడుతున్నట్టు చెప్పడం వారిని వంచించడం కాదా? ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందించ డం లేదని నెట్‌వర్క్ ఆసుపత్రులు బోర్డులు పెట్టి, పేద రోగుల్ని బయటకు పంపిన దాఖలాలు అనేకం. టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రభుత్వంలో వైద్య సేవలు అందించిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు, సంచార చికిత్స వాహనాలు, 108 అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ వాహనాలు, ఫీడర్ అంబులెన్స్‌లు, బాలసురక్ష వాహనాలు, బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు నేడు ఎందుకు కనిపించడం లేదో, తాను ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన 108 వాహనాలు ఏమయ్యాయో ముఖ్యమంత్రి చెప్పాలి. ద్విచక్రవాహనాలపై రోగుల్ని.. మృతదేహాల్ని తరలించి న ఘటనలు జగన్‌రెడ్డికి కనిపించలేదా? 108, 104 వాహనాల కోసం రూ.341కోట్లకు పైగా ఖర్చు పెట్టి నట్టు చెప్పిన జగన్‌రెడ్డి.. ఆ వాహనాల పరిస్థితి ఏమిటో చెప్పాలని సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ వైద్యసేవ కింద టీడీపీ ప్రభుత్వం కోటి20 లక్షల మందికి వివిధరకాల ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయించింది. 14లక్షల మంది మహిళలకు మాస్టర్ చెకప్ పేరుతో వివిధరకాల వైద్యపరీక్షలు ఉచితంగా అందించింది. సీఎంఆర్‌ఎఫ్ కింద 10,500కోట్ల నగ దు సాయం చేసింది. ఇలాంటివేవీ జగన్ ప్రభుత్వంలో లేవు. ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సర ఫరా చేసిన కాంట్రాక్టర్లకు, రోగులకు భోజనం అందిం చేవారికి కూడా బిల్లులు చెల్లించలేని దుస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది.
ప్రపంచ ఆరోగ్యచరిత్రలోనే సంచలనంగా పేరొం దిన ప్రాణదానం ట్రస్ట్‌ను చంద్రబాబు ప్రారంభించారు. తిరుపతి స్విమ్స్ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రిలో ఈ ట్రస్ట్ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి టీడీపీ హయాంలో దేశంలో 29వ స్థానంలో నిలిస్తే, జగన్ హయాంలో 151స్థానానికి దాగజారింది. 4 ఏళ్ల 10నెలల జగన్ పాలనలో పేదలకు ఎక్కడా నాణ్యమైన వైద్యం అందడం లేదని ప్రసాద్ తేల్చిచెప్పారు.