- చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల నిర్ణయం
- చిలకలూరిపేట వద్ద భారీ బహిరంగ సభ
- సభలో సూపర్-6, ఉమ్మడి కార్యక్రమాలపై కీలక ప్రకటనలు
- సభను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు, మనోహర్‌ల పిలుపు
- జగన్ పాలనలో ప్రతి బాధితునికి భరోసా ఇచ్చేందుకే పొత్తు
- జనసేన సిబ్బంది ఇళ్లపై అర్ధరాత్రి దాడులను ఖండిరచిన నేతలు
అమరావతి: రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడిన తెలుగుదేశం-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ఈ నెల 17న చిలకలూరిపేట వద్ద 10 లక్షల మంది ప్రజల సమక్షంలో విడుదల చేస్తామని ఇరు పార్టీలు గురువారం నాడు ప్రకటించాయి. తెదేపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, జనసేన పొలిటి కల్ అఫైర్స్ కమిటీి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిన్న తెదేపా కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడిరచారు. బుధవారంనాడు జరిగిన భేటీలో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వారు వెల్లడిరచారు.
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాలు పీడనకు గురయ్యాయని, ప్రతి బాధితునికి భరోసా ఇచ్చేందుకే ఇరుపార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఎవ రు ఎన్ని కుట్రలు పన్నినా ఈ కూటమి విజయపథం వైపు దూసుకుపోతుందని ఇద్దరునేతలు స్పష్టం చేశారు. రెండు పార్టీల అగ్ర నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చ లు జరిపి కూటమిని విజయం వైపు నడిపించే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారని, వారి ఉమ్మడి ప్రయ త్నంలోని ఉన్నత లక్ష్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ కోరారు. ఇరు పార్టీల నాయకులు, శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున కదలివచ్చి చిలకలూరిపేట సభను భారీగా విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
కీలక ప్రకటనలు
చిలకలూరిపేట వద్ద ఈనెల 17న నిర్వహించనున్న భారీ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని, 10 లక్షల మంది ప్రజల సమక్షంలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయడంతోపాటు భవి ష్యత్ కార్యక్రమాల ప్రణాళిక, ఇప్పటికే ప్రకటించిన సూపర్-6 పథకాలపై ఇరు పార్టీల అగ్రనేతలు ఆ సభలో కొన్నికీలక ప్రకటనలుచేస్తారని అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ తెలిపారు.
కూటమి అడుగులతో వైసీపీలో గుబులు
గత నెల 24న కూటమి విడుదల చేసిన 99 మంది అభ్యర్థుల జాబితా, తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభ, మంగళవారం నాడు చారిత్రాత్మక రీతిలో ఇరు పార్టీలు నిర్వహించిన ‘జయహో బీసీ’ సభ, అం దులో వెల్లడిరచిన బీసీ డిక్లరేషన్‌లతో జగన్‌రెడ్డి బృం దంలో కలవరం ఏర్పడిరదని, కూటమిని భగ్నం చేయ డానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.
బీసీ డిక్లరేషన్ పై విస్తృత ప్రచారం
తెదేపా-జనసేన కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేష న్ వెనుకబడిన తరగతులవారి తలరాతలు మారుస్తుం దని, ఈ డిక్లరేషన్‌లోని అన్ని అంశాలపై రాష్ట్ర వ్యాప్తం గా విస్తృత ప్రచారం చేసి ప్రతి బీసీ వ్యక్తిలో చైతన్యం కలిగిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు 2000కు పైగా గ్రామాల్లో ప్రత్యేక సభలు, సమావేశా లు నిర్వహిస్తామని అన్నారు.
కుట్రలు, దమనకాండ
రాష్ట్ర ప్రజానీకాన్ని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పూర్తి గా అంధకారంలోకి నెట్టేస్తే.. ప్రజల్లో ఉత్సాహం నింప టానికి తెదేపా, జనసేనలు పొత్తు పెట్టుకుని, ప్రణాళికా బద్ధంగా ముందుకు నడుస్తుంటే, దీనికి వ్యతిరేకంగా వైసీపీ కుట్రలు పన్నుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెంలో ఇటీవల నిర్వహించిన ‘జెండా’ సభను భగ్నం చేయడా నికి భారీ కుట్రలు జరిగాయని, సభను నిర్వహించిన జనసేన నాయకత్వం దృఢంగా నిలబడడంతో ఆ కుట్ర విఫలమైందని ఆయన తెలిపారు. కలిసికట్టుగా పనిచేసి ఇరు పార్టీల శ్రేణులు చిలకలూరిపేట సభ విజయం కోసం కృషి చేయాలని మనోహర్ ఆకాంక్షించారు.
బుధవారం రాత్రి మంగళగిరిలోని జనసేన కార్యాల యంలోని పార్టీ సిబ్బంది ఇళ్లపై గోడలు దూకి మరీ అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు దాడులు చేయ టాన్ని ఇరువురు నేతలుతీవ్రంగా ఖండిరచారు. తుపాకీ లతో వాచ్‌మెన్‌లను బెదిరించి ఇళ్లల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టించటం రాజకీయ కక్షలో భాగమని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలంటూ ఏవో కొన్ని వస్తువులు పెట్టి కేసులు బనాయించాలనే దుర్బు ద్ధితోనే ఈ దమనకాండకు రాష్ట్ర ప్రభుత్వం దిగజారిం దని.. ఈ వైఖరిని చూస్తూ ఊరుకోమని ఆయన అన్నా రు. రాజకీయ ఒత్తిడితో అరాచకంగా వ్యవహరించే అధికారులపై భవిష్యత్తులో తగు చర్యలుంటాయిని మనోహర్ హెచ్చరించారు.
ఆర్టీసీకి హెచ్చరిక
ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర ఆర్టీసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని.. అధికార పార్టీ సభలకు విచ్చలవిడిగా బస్సులను ఏర్పాటుచేస్తూ ప్రత పక్ష పార్టీలకు నిరాకరిస్తోందని అచ్చెన్నాయుడు ఆగ్ర హం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట సభకు బస్సుల కోసం వెంటనే దరఖాస్తు చేస్తామని, నియమాల ప్రకారం ఆర్టీసీ వ్యవహరించాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ తీరుపట్ల సంస్థను హెచ్చరిం చామని, తీరు మారకపోతే ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
తెదేపా, జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని, ఫోన్లు చేసి మరీ బైండోవర్ కేసులు పెడతామని బెదిరి స్తున్నారని, ఈ దమనకాండపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు తెదేపా ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిందని, సమాచారం అందిన వెంటనే పార్టీ యంత్రాంగం తగు సహాయక చర్యలు చేపడుతుందని అచ్చెన్నాయుడు వివరించారు. పోలీసు బాధితులు 7306299999 నెంబరుకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.