అమరావతి(చైతన్యరథం): దెందులూరు నియోజకవర్గంలో బీసీ యువకులపై వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ఆయన అను చరులు చేసిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఇటీవల పేదలకు, పెత్తం దారులకు మధ్య యుద్ధమంటూ ప్రతి పక్షాలపై జగన్ అండ్ కో విమర్శలు గుప్పి స్తున్నారని..దెందులూరులో జరిగిన ఘటన తో పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా? అంటూ ఎద్దేవా చేశారు. తనలో ఉన్న ఫ్యూడలిస్ట్ అవలక్షణాలన్నింటినీ ఎదుటివారికి అంటగట్టి బురదజల్లడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతోపెట్టిన విద్య అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనీసం తమ ఎదుట నిలబడినా సహించలేని జగన్, ఆయన బ్యాచ్ ఈ మధ్య పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ ప్రతిపక్ష నేతలపై ఎదురు దాడి చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
దెందులూరు నియోజకవర్గం తిమ్మన గూడెంలో వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ప్రచారానికి వెళ్లిన సమయంలో బీసీ యువకులు పిప్పర దుర్గాప్రసాద్, ఆయన స్నేహితులు పంచాయతీ బెంచ్‌పై కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకుంటున్నారు. మేం ప్రచారానికి వస్తే లేచి నిలబడి గౌరవించ కుండా దర్జాగా కూర్చుని చేతులు ఊపుతా రా అంటూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోపంతో ఊగిపోతూ విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. నాకు తెలిసి శతాబ్దాల క్రితం రాచరికంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు. ఎవరు అసలు సిసలైన పెత్తందారులో ఇప్పుడైనా అర్థమవుతోందా రాజా.. అంటూ లోకేష్ విమర్శలు గుప్పించారు.