- రాయలసీమను రాళ్లసీమ చేశారు
- ఐదేళ్లలో సాగునీటి రంగం విధ్వంసం
- సంపద సృష్టితో ప్రజల ఆదాయం పెంపు నా విజన్
- సీమను సస్యశ్యామలం చేస్తా
- యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- ప్రజల ఆదాయం పెంపే లక్ష్యంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా
- జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచే జలగ
- రూ.10 ఇచ్చి రూ.10 వేల మేర మేలు చేసేది టీడీపీ
- 160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు మన లక్ష్యం
పలమనేరు (చైతన్యరథం): రాష్ట్ర యువత ఆశలను వమ్ముచేసి, వారి భవిష్యత్‌ను జగన్‌రెడ్డి చిదిమేశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అయిదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చా డని విమర్శించారు. యువతకు బంగారు భవిష్యత్ కావాలన్నా, రాయలసీమలో నీళ్లు పారించి సస్యశ్యామ లం చేయాలన్నా టీడీపీతోనే సాధ్యమన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి మంచిరో జులు రావాలంటే ఐదేళ్ల తరువాత పరదాలు దాటి బయటకు వస్తున్న ముసుగువీరుడు జగన్‌ను ఓడిరచి ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపుఇచ్చారు. త్వర లో జరిగే ఎన్నికలకు ప్రచారభేరిని ప్రజాగళం సభల ద్వారా పలమనేరులోనే శ్రీకారం చుట్టానన్నారు. పలమ నేరు ప్రజాగళం సూపర్ హిట్. భగభగమంటే ఎండలో సైతం ఇంతమంది వచ్చారంటే మీ మనసంతా టీడీపీ వైపే ఉందని, జగన్‌పై ఎంత కసిగా ఉన్నారనేది తెలిసి పోతోంది. అన్నిరంగాలను సైకో జగన్ నాశనం చేశా డు. సిద్ధం సభలకు బలవంతంగా జనాన్ని తరలిం చాడు… జగన్‌ను ఇంటికి పంపడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వైసీపీని చిత్తుగా ఓడిరచి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు ఉద్ఘాటించారు.
ఇక్కడ తిరిగే అర్హత లేదు
నిన్నటి దాకా పరదాలతో వచ్చిన ముసుగు వీరుడు ఈ రోజు నుండి మీ ముందుకు వస్తున్నాడు…జగన్‌కు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలి. జగన్‌కు స్వాగతం పలికినా… మద్దతు తెలిపినా మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లే. రాయలసీమ ద్రోహికి ఇక్కడ తిరిగే అర్హత లేదు. సీమ ప్రజలు జగన్‌ను నిలదీయాలి. జగన్ ఐదేళ్ల లో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102మినీ ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీది. టీడీపీ వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రతనాల సీమగా మార్చుతాం. గోదావరి జలాలు కూడా సీమకు తెచ్చి వెలుగులు ఇస్తాం. సీమలో కరువే లేనట్లుగా పనికి మాలిన పత్రిక సాక్షి.. తప్పడు రాతలు రాస్తోంది. సీమను రతనాల సీమగా మార్చాలని లక్ష్యం పెట్టుకు న్నా. హంద్రీనీవా పూర్తి చేసి వి.కోటకు నీళ్లు ఇచ్చాను. గాలేరు నగరి పూర్తికి ప్రయత్నించా. గండికోటను పూర్తి చేసి పులివెందులకు కూడా నీళ్లిచ్చాను. సీమలో మంచి పంటలు పండుతాయి…సెరీ కల్చర్, కూరగాయలు, పూల సాగు లాభసాటిగా ఉంటాయి.నీటి లభ్యత తక్కువగా ఉందని 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇచ్చాం. హార్టికల్చర్ హబ్‌గా సీమను తయా రు చేయాలన్నది తన కల అని చంద్రబాబు అన్నారు.
10 శాతం పూర్తి చేయలేని అసమర్థుడు
జగన్ పాలనలో రైతులకు సబ్సిడీలు, గిట్టుబాటు ధరలు రావడంలేదు. టీడీపీ హయాంలో అమలుచేసిన డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసి సీమ రైతులను ముంచేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. నీళ్లు లేక పొలాలను బీడుపెట్టే పరిస్థితికి తెచ్చారు. నేను హంద్రీ నీవా నీళ్లు తెచ్చి వి.కోటలో నిలబెట్టా. కానీ ఈ ప్రభు త్వం వచ్చాక ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిందా? సీమలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ భ్రష్టు పట్టాయి. సాగునీటి రంగానికి ఊతం ఇచ్చింది ఎన్టీఆర్. కృష్ణా జలాలను సీమకు తెచ్చిసస్యశ్యామలం చేయాలనుకున్నది ఎన్టీఆర్. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరిని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులకు తరువాతి కాలంలో ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. విభజ న వల్ల నష్టం ఉన్నా ప్రాజెక్టులపై డబ్బులు ఖర్చు పెట్టాం. రాష్ట్రంలో ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిగెత్తించాం. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఐదేళ్లలో 62ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32లక్షల ఎకరాల ఆయ కట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇచ్చాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క హంద్రీనీవాపైనే రూ.4,200 కోట్లు ఖర్చు చేశాం. 90 శాతం పనులు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు 10శాతం పూర్తి చేయలేక కరువు పరిస్థితు లు తీసుకొచ్చారు. ఐదేళ్లలో రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.2,125 కోట్లు మాత్రమే జగన్ ఖర్చు చేశాడు. ఒక్కసాక్షి పత్రికకే వందల కోట్ల ప్రకటనలు ఇచ్చాడు. వారిజీతాల చెల్లింపులకు ఇచ్చినన్ని డబ్బులు కూడా సీమ ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదని చంద్రబాబు దుయ్యబట్టారు.
అన్ని వర్గాలకూ అన్యాయమే
జగన్ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. అధి కారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇప్పి స్తాం. ఈ ప్రభుత్వంలో కార్మికులకు, కూలీలకు ఉపాధి కూడా దొరకటం లేదు.కనీసం ఉద్యోగులకు నెలజీతం, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ కూడా సరిగా రావటం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు కూడా ఇవ్వటం లేదు. టీడీపీ తెచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు.సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది లేనట్లు చూపిస్తున్నాడు. అప్పట్లో బుగ్గలు నిమిరిన దుర్మార్గుడు..అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దు తున్నాడని చంద్రబాబు విమర్శించారు.
సంపద సృష్టించి పంచుతా
టీడీపీకి సంపద సృష్టించడమే తెలుసు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి…ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగునీరు వస్తే పంటలు వేస్తారు.. పంటలు అమ్ముకుంటే లాభాలు వస్తాయి. దీంతో మీ భూముల విలువ, కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంప ద సృష్టించి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతాం. జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచే జలగ. రూ.10 ఇచ్చి రూ.10 వేల మేర మేలు చేసేది టీడీపీ.ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నుండి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహి ళకు రూ.15 వందలు ప్రతినెలా అందిస్తాం. తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు అందిస్తాం.ఇద్దరుంటే రూ.30వేలు… నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తాం. పిల్లలకు చదువు అందిస్తే తరువా త ప్రపంచాన్ని జయిస్తారు. మన పిల్లలే మన సంపద వారిని కాపాడుకుంటా. దీపం పథకం ద్వారా ఏడాదికి 3గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రైతు దెబ్బతిన్న రోజున రాజ్యం కూలిపోతుంది. రైతే రాజు.. ఆ విధంగా రాజును చేసే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి రైతుకు అన్నదాతతో ఏటా రూ.20 వేలు ఇస్తా. రైతులకు సబ్సిడీలుకూడా అందిస్తాం.రాబోయే ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే దాకా నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు అందిస్తాం.పరిశ్రమలుతెచ్చి సొంతూరిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కల్పిస్తామని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రం కోసమే పొత్తు
టీడీపీ,జనసే, బీజేపీ కలిశాయంటే ఇది మాస్వార్థం కోసం కాదు. పొత్తుపై ప్రశ్నించేవారికి చెబుతున్నా. అభివృద్ధిలో వెనకబడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, పురోభివృద్ధి సాధించేందుకే పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. దివాళా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశాం. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలంటే జగన్ దిగిపోవాలి. ఒక అవినీతి, సైకో పాలనతో ఎంత నష్టపోయారో జనం గుర్తు చేసుకోవా లి. రూ.12లక్షల కోట్లు అప్పులు చేశాడు. కేంద్రంలోని ఎన్డీఏతో కలసి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తా, పరిశ్రమ లు స్థాపించి తీరుతా. వైసీపీ విముక్త రాష్ట్రమే లక్ష్యంగా పవన్‌కల్యాణ్ ప్రకటించారు. అందుకే ఆయనతో కలిసి ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో గాడితప్పిన పాలనను గాడిలో పెట్టితీరుతా. 2014లో మనం అధికారంలోకి వచ్చి విభజన గాయాలను చెరుపు కుంటూ అభివృద్ధి బాటలో నడిపించాను. 2019లో కూడా అధికారంలోకి వచ్చి ఉంటే..రాష్ట్రాన్ని తెలంగాణకు దీటుగా మార్చుకు నే వాళ్లం. అందరినీ ఆదుకునేందుకు భరోసా ఇస్తున్నా. కుల మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతా. రాష్ట్రంలో సంపద సృష్టి నిలిచిపోయిం ది… రాష్ట్ర ఆదాయం తగ్గి పోయింది. ఇవన్నీ సజావుగా సాగాలంటే కేంద్రసాయం కావాలనే మూడుపార్టీలు కలిసి వస్తున్నాయని చంద్ర బాబు తెలిపారు.
వైసీపీకి ఓటెయొద్దు
జగన్‌రెడ్డి బీసీల పథకాలు కూడా రద్దు చేశాడు. ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేసింది.. బీసీల భూము ల కబ్జాను చేసింది వైసీపీ నేతలే. వైసీపీ నేతల వేధిం పులతో ఒంటిమిట్టలో చేనేత వర్గానికి చెందిన సుబ్బా రావు కుటుంబం, నంద్యాలలో మైనారిటీవర్గానికి చెంది న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పలమనేరులోనే బాలిక మిస్బా ఉదంతం నా కళ్ల ముందు తిరుగుతూనే ఉంది. ఒక మైనారిటీ అమ్మాయి చదువుకోవడానికి అవకాశం లేదా.? వైసీపీ నాయకు లు మిస్బాను వేధించి చదువుకోకుండా చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. మళ్లీ వైసీపీకి ఓటేస్తే మిస్బాకు ఏం జరిగిందో అదే మీ పిల్లలకు కూడా జరుగుతుందని చంద్రబాబు అన్నారు.
అన్ని సీట్లు గెలిచేలా పనిచేయాలి
మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను ఒకటే కోరు తున్నా… 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలిచేలా పనిచేయాలి. ఎన్డీఏ లక్ష్యం 400కు పైగా ఎంపీ స్థానాలు. రాష్ట్రంలో 24 ఎంపీ స్థానాలు రావాలి. రాష్ట్రంలో 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తు న్నాం. కడప కూడా మనదే. వైనాట్ పులివెందుల మన నినాదం కావాలి. చిత్తూరు ఎంపీగా దగ్గుమళ్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యేగా అమర్నాథ్‌రెడ్డిని గెలిపించాలి. మీ అందరి బంధువు అమర్నాథ్‌రెడ్డి. దోపిడీ విధానాన్ని అరికట్టాలంటే అమర్నాథ్‌రెడ్డిని గెలిపించాలి. మామిడి మార్కెట్ లేక ఇక్కడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మోడల్ మార్కెట్ ను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం. టీడీపీ హయాంలో వి.కోటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, మహిళా ఉర్దూ కాలేజీకి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం నిలిపేసింది. మన ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం. కౌండిన్య నదిపై చెక్ డ్యాములు నిర్మిస్తాం. ఇక్కడి ఏనుగుల సమస్య ఉంది..ఆ సమస్య పరిష్కారం కావాలంటే టీడీపీ గెలవాలని చంద్రబాబు అన్నారు.
15 శాతం కమీషన్ ఎమ్మెల్యే
ఇక్కడ పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు..ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేదు. హంద్రీనీవా నీళ్లు తేలేదు కానీ, ఇసుకంతా తవ్వుకుని బెంగళూరు తరలించాడు. క్వారీల యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తాడు. ఏ పని చేయాలన్నా 15 శాతం కమీషన్ కట్టాలి..అందుకే ఆయన్ను 15 శాతం కమీషన్ ఎమ్మెల్యే అంటారు. రూ.5 కోట్ల విలువ చేసే శివాలయం భూమిని మాయం చేశాడు. మసీదుల భూమలు కూడా కొట్టేస్తాడు. గంగమ్మతోపు వద్ద గంగవరంలో కోట్లు విలువ చేసే భూముల్ని కొట్టేశాడు. జనార్థన్ నాయుడుకు చెందిన క్వారీని కబ్జా చేసి దోచుకుని రూ.35 లక్షల కరెంట్ బిల్లులు కూడా కట్టాలని బెదిరించాడు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన ముగ్గురు విలేకరులపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టారని చంద్రబాబు విమర్శించారు.
దుర్మార్గులతో పోరాడుతున్నాం
అన్ని సర్వేలు మనమే గెలుస్తామని చెబుతున్నాయి. మొన్నటిదాకా వైనాట్ కుప్పం అని జగన్ అన్నాడు… నేను సవాల్ విసురుతున్నా వైనాట్ పులివెందుల? వివేకాను ఎవరు చంపారో సమాధానం చెప్పి వైసీపీ నేతలు ఓట్లు అడగాలి. మీ బాబాయిల గతి కూడా ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలి. ఓటుకు రూ.10 వేలు ఇస్తాడు…ఆ అవినీతి డబ్బులు మాకొద్దు అని ఛీ కొట్టండి. కాకినాడ శివాలయంలో పూజారిపై దాడి చేశారు. కొట్టడం, తిట్టడం, దూషించడం.. బయట పడ్డాక రాజీ చేయడం…ఇదీ వారి నైజం. మళ్లీ వైసీపీ వస్తే మీ భూమి రికార్డులకు కూడా రక్షణ ఉండదు.. ప్రాణాలకు రక్షణకు ఉండదు. దుర్మార్గులతో పోరాడు తున్నాం… మే 13వ తేదీ వరకూ అందరూ పోరా డండి. అందరినీ కాపాడుకునే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
పార్టీలో చేరిక: ప్రజాగళం సభలో పలమనేరు నియోజకవర్గానికి చెందిన… ఈడిక సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, కౌన్సిలర్ బీఆర్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీరాములు రెడ్డి, సీనియర్ నేతలు గోవిందరెడ్డి, నందకుమార్, తదితరులు పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.