తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడైన టిడి జనార్ధన్.. చంద్రబాబు 74వ జన్మదినాన్ని పురస్కరించుకుని వెలువరించిన ‘అభివృద్ధి సంక్షేమ విజనరీ `మన చంద్రన్న’ పుస్తకం ఓక అరుదైన గ్రంథమని చెప్పాలి. గ్రంథ రచయిత సేకరించి అందించిన అశాలు చంద్రబాబునాయుడి అభివృద్ధి, సంక్షేమ విజన్‌ను ఆవిష్కరిస్తాయి. రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న సమయంలో, ప్రోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యంలోను, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్‌మీద ఆర్ధిక ఆంక్షలు విధించి అప్పు ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో చంద్రబాబునాయుడు ఏవిధంగా వివిధ రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వివరించారు.
‘అభివృద్ధి సంక్షేమ విజనరీ `మన చంద్రన్న’లో రచయిత టిడి జనార్ధన్ పలు అంశాలను ఒక క్రమపద్ధతిలో అందించారు.
చంద్రబాబునాయుడి రాజకీయ జీవితంలో.. ముఖ్యంగా తొలినాళ్లలో విద్యార్థి దశనుంచి ఆయన చేపట్టిన కార్యక్రమాలుÑ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన తరువాత సొంత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మొదలుకొని 2014`2019 మధ్య ఐదేళ్లకాలంలో అమరావతి రాజధానిగా ప్రకటించి చేపట్టిన పనులుÑ 5 గ్రిడ్లు `7 మిషన్ల ద్వారా రాష్ట్రాభివృద్ధికి వేసిన ప్రణాళికలుÑ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెచ్చిన పరిశ్రమల వివరాలు మొదలైన అంశాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటిరంగం, విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, ఉపాధి, మహిళా సంక్షేమం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వికలాంగుల సంక్షేమానికి చంద్రబాబునాయుడు చేపట్టిన విస్తృత పథకాల్ని ఈ పుస్తకంలో అందించారు. అలాగే ఓ విజన్ ద్వారా పరిపాలన రంగంలో చేసిన సమూల మార్పులుÑ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీల్ని తేవడం తదితర అంశాలను ఫొటోలతో సహా అందించారు.
ప్రధాన ప్రతిపక్ష నేతగా 15 సంవత్సరాలపాటు చంద్రబాబునాయుడు రైతాంగం, మహిళలు, బలహీనవర్గాల తరఫున నిలబడి చేసిన పోరాటాలు, ఉద్యమాల గురించి సమాచారం ఇవ్వడం చెప్పుకోదగ్గది. ఇక, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేసిన సాహసోపేత సేవా కార్యక్రమాల ప్రస్తావన ఉదాహరణలతో పొందుపర్చారు.
నారా చంద్రబాబునాయుడు ఏం చేశాడో చెప్పగలడా? ఆయన పేరు చెబితే ఏదైనా పథకం గుర్తుకొస్తుందా? అంటూ అధికార వైఎస్సార్ పార్టీ నేతలు దురుసుగా ప్రశ్నిస్తున్న తరుణంలో టిడి జనార్ధన్ ఈ పుస్తకం తేవడం విశేషం. దాదాపు 600లకు పైగా కార్యక్రమాల్ని చంద్రబాబునాయుడు చేపట్టారు. అందులో చరిత్రగతిని మార్చిన పథకాలు, కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన మహత్తరమైన నిర్ణయాలు అనేకం కనిపిస్తాయి. ఓ పరిశోధన గ్రంథం స్థాయిలో రూపొందిన ‘అభివృద్ధి సంక్షేమ విజనరీ `మన చంద్రన్న’ పుస్తకం అందంగా, చూడముచ్చటైన లేఅవుట్‌తో ఉంది. అరుదైన ఫోటోలు ఉన్నాయి. చాలామందికి కనువిప్పు కలిగించే వాస్తవాలు ఉన్నాయి. ఈ పుస్తకం తెలుగుదేశం కార్యకర్తలు, నేతలకే కాదు.. అధికారంలో ఉండగా చంద్రబాబునాయుడు ఏమిచేశడని ప్రశ్నించేవారు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.