- ఎన్నికల యుద్ధంలో 5 కోట్ల ప్రజలదే గెలుపు
- విధ్వంసం..అభివృద్ధికి మధ్య జరిగే ఎన్నికలివి
- సైకో వస్తే రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు..
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే మలి సంతకం
- ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు నాదీ పూచీ..
- మళ్లీ జన్మంటూవుంటే తెలుగుగడ్డపైనే పుడతా
నెల్లూరు (చైతన్యరథం): వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. బందిపోటు దొంగ, విధ్వంసకారుడిని తరిమేయడానికి సిద్ధంగా ఉన్నారా? యువత భవిష్యత్ బాధ్యత మా ఇద్దరిదీ. ఈ ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు గెలుస్తాం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరులో శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించిన అనంతరం పెద్దఎత్తున నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల సభలో అనర్ఘళంగా ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి, తెలుగుజాతి అభివృద్ధి సాధ్యమవ్వాలంటే సైకోను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇవి ధర్మాధర్మాలకు, విధ్వంసం అభివృద్ధి మధ్య జరిగే ఎన్నికలు. జగన్ అహంకారానికి జనం ఆశలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికల్లో కూటమితో గెలుపు. రాతియుగం పోతుంది. స్వర్ణయుగం రానుందని చంద్రబాబు ఉద్వేగంతో ప్రకటించారు. రేపటినుంచి ప్రారంభమవుతున్న పోస్టల్ బ్యాలెట్‌లో ఉద్యోగులంతా 100కి 100 శాతం ఎన్డీయే కూటమి అభ్యర్దులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. డబ్బులతో, కుట్రతో రాజకీయాలు చేయాలని చూస్తున్న దగాకోరు వైసీపీని చిత్తుగా ఓడిరచాలన్నారు. డబ్బు ప్రలోభాలకు పాల్పడుతున్న వైసీపీ ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్‌లో దోచుకున్నదేనని, ఆ పార్టీని రానిస్తే రాష్ట్రాన్ని మరోసారి దోచేస్తుందని హెచ్చరించారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం….
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మేంటి? జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చారు. ఈ చట్టం వస్తే పట్టాదారు పాసు పుస్తకం ఉండదు. పత్రాలు ఉండవు. భూముల రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి. ఆస్తులు అమ్మాలన్నా.. కొనాలన్నా జగన్ అనుమతి కావాలి. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమెందుకు? దుర్మార్గుడు మళ్లీ గెలిస్తే ప్రజలకు భవిష్యత్తు లేదు. ఆస్తులకు భద్రత లేదు. అధికారంకలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైన, రెండో సంతకం ల్యాంట్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనా పెడతానని చంద్రబాబు ప్రకటించారు.
ముస్లింల రిజర్వేషన్లు కాపాడే బాద్యత నాది…
ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడుతాం. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తాం. ముస్లింలకు హజ్‌హౌస్ నిర్మిస్తాం. మక్కా యాత్రకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తాం. రంజాన్ తోపా, దుల్హన్ పునరుద్ధరిస్తాం. మౌజన్, ఇమాంలకు గౌరవ వేతనం పెంచుతాం. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తుకు ముందుకొచ్చారు. రాష్ట్రం కోసం మూడు పార్టీలు త్యాగం చేశాయి. రాష్ట్రంలో వార్ వన్‌సైడ్ అయింది. ప్రజలు గెలబోతున్నారు. రాష్ట్రం నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తు బంగారమయమవుతుందని చంద్రబాబు ప్రకటించారు.
జగన్ కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తాం…
మేము వస్తే సంక్షేమ పధకాలు రద్దవుతాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. జగన్ ఇచ్చేది రూ.10, దోచేది రూ.100. మేం ఆదాయం సృష్టించి సంక్షేమం అమలు చేస్తాం. ఆడబిడ్డకి ప్రతినెల రూ.1500 ఇస్తాం. తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికీ రూ.15000 ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. కూటమి వచ్చాక మెగా డిఎస్సీపై తొలి సంతకం చేస్తా. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. నెలకు నిరుద్యోగ యువతకు రూ.3 వేలు భృతి అందజేస్తాం. రైతును రాజుగా చేస్తాం. ఏప్రిల్‌నుంచి 4 వేల పింఛన్ అందజేస్తాం. దివ్యాంగులకు రూ.6 వేల పింఛను. అని చంద్రబాబు ప్రకటించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నాడని, లక్షన్నర మంది సచివాలయం సిబ్బందితో పింఛన్లు ఇవ్వవచ్చు. పింఛన్ల పేరుతో 33 మంది వృద్ధులను చంపేశారు. పింఛన్లు బ్యాంకుల్లో జమ చేసి వృద్ధులకు ఇబ్బంది పెట్టారు. ఇది న్యాయమా? అని చంద్రబాబు నిలదీశారు. చంద్రన్న భీమా కింద ప్రమాద మరణానికి రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షలిసామన్నారు. ఆర్యోగ బీమా ప్రతి ఒక్కరికి రూ.25 లక్షలిస్తామని వెల్లడిరచారు. నాయి బ్రాహ్మణులకు న్యాయం చేస్తామని, కూటమి వచ్చాక బీసీ డిక్లరేషన్ తీసుకువస్తామని, బీసీలకు ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు. కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు బడ్జెట్‌లో పెడతామని, క్రిష్టియన్లు సంక్షేమానికి మాది పూచీ అన్నారు. రవాణ రంగ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలిస్తామని, యువతకు చేయూతనిచ్చి బంగారు భవిష్యత్తు ఇస్తామన్నారు. స్కిల్ గణన చేసి యవతకు శిక్షణ ఇస్తామని బాబు ప్రకటించారు.
వేమిరెడ్డికి విజయాసాయిరెడ్డికి పోలికా?
పవన్ రాజకీయాల్లో స్ట్రగుల్ అయ్యాడు. పోరాడాడు, నిలదొక్కుకున్నాడు. అది జీవితం నేర్పిన పాఠం. సరైన సమయంలో సరైన నిర్ణయం ముందుకు తీసుకెళ్తుంది. నారాయణ సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. వేమిరెడ్డికి, విజయసాయిరెడ్డికి ఏమైనా పోలికా? నెల్లూరును దోచుకోవడానికే విజయసాయిరెడ్డి వచ్చారు. జగన్ అరాచకాలకు రాష్ట్రం నాశనమైతుందని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. వెంటబడి వేధించినా, కేసులు పెట్టినా శ్రీధర్ రెడ్డి, నారాయణ రెడ్డి పోరాడారు. వాళ్లను గెలిపించుకుని నెల్లూరు జిల్లా అభివృద్ధి సాధించడం మన బాధ్యత అని చంద్రబాబు పిలుపునిచ్చారు. మళ్లీ జన్మంటూవుంటే తెలుగు గడ్డపైనే పుట్టి తెలుగు ప్రజల రుణం తీర్చుకుంటానని చంద్రబాబు వినమ్రంగా ప్రకటించారు.
నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం…
నెల్లూరు- తిరుపతి- చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని హార్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. టిడ్కో ఇళ్లకు వైకాపా రంగులు వేసుకున్నారని ఎద్దేవా చేస్తూ, కూటమి వచ్చాక 48 వేల ఇళ్లు అర్హులకు అందజేస్తామన్నారు. నెల్లూరులో ఇంటి జాగా లేని ప్రజలకు స్థలమిచ్చి ఇళ్లు కట్టిస్తాం. నారాయణ మంత్రిగా ఉన్నపుడు నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.525 కోట్లు ఖర్చు చేశారు. రూ.735 కోట్లతో సీసీ రోడ్లు వేశాం. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా జరిపారు. కాపుభవన్, బీసీ భవన్, అంబేద్కర్, బాబు జగజ్జీనవ్ భవనాలు, ఘోషా ఆస్పత్రి, మైనార్టీ బాలికల కళాశాల, చేపల మార్కెట్, మటన్ మార్కెట్ నిర్మించారు. మున్సిపల్ పాఠశాలను అభివృద్ది చేశారు. 7 అన్న క్యాంటీన్లుతో పేదల ఆకలి తీర్చారు. నెల్లూరు జిలా అభివృద్దికి రూ.5,200 కోట్లు ఖర్చు చేసిన వ్యక్తి నారాయణ. వైసీపీ పాలనలో ఒక్క రూపాయి ఖర్చు చేశారా? నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా శ్రీధర్‌రెడ్డిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నారాయణను భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు.