అమరావతి: మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి శాసనసభ్యుడిగా ప్రమాణం చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టం. అని రాష్ట్ర విద్యా, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐదేళ్ల క్రితం ఓడినచోటే రికార్డుస్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ప్రజలు తనపౖౖె ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసమే వినియోగిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి నేతృత్వాన కొలువైన ప్రజాప్రభుత్వం 5కోట్లమంది ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుందన్నారు.