న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో విలీనం చేయాలని దగ్గుబాటి పురందేశ్వరి నేతృత్వంలోని బీజేపీ ఎంపీల బృందం బుధవారం కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి కుమారస్వామిని కలిసి విజ్ఞప్తి చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాటలోకి తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఇందు కోసం ఒక యాక్షన్ ప్లాన్ ను తయారు చేసి కేంద్రమంత్రి కుమార స్వామికి వినతిపత్రం సమర్పించారు. విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం నుండి వచ్చిన ఒక భారీ పరిశ్రమ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే విషయాన్ని కుమార స్వామికి తెలిపారు. ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవిస్తూ నిర్ణయం ఉండాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సమర్థవంతంగా నిర్వహిస్తూ లాభాల బాటలోకి తీసుకుని వచ్చే కోణంలో మాత్రమే విధానాలు ఉండాలనే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిపారు. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకొని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని పురందేశ్వరి కోరారు.
బీజేపీ ఎంపీల వినతికి కుమారస్వామి సానుకూలంగా స్పందించారు. అధికారులతో కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు నెలల్లో మరో మారు సమావేశం నిర్వహించుకుందామని ఎంపీ పురందేశ్వరికి హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి కుమార స్వామిని కలిసిన వారిలో ఎంపీ పురందేశ్వరితో పాటు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, సాగి కాశీ విశ్వనాథóరాజులు ఉన్నారు.